దక్షిణాసియా దేశాలకు ప్రాధాన్యం
సులభతర చెల్లింపుల పట్ల సానుకూలం
క్లియర్ ట్రిప్ నివేదికలో ఆసక్తికర అంశాలు
ముంబై: మారుమూలనున్న సాహస కేంద్రాలు, అందుబాటు ధరల్లో ఉన్న కేంద్రాలను సందర్శించేందుకు దేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాసియాలోని పేరొందిన ప్రదేశాలు పర్యాటకుల ప్రముఖ ఎంపికగా ఉంది.
ట్రావెల్ బుకింగ్ సేవల్లోని ‘క్లియర్‌ట్రిప్’ నివేదికను పరిశీలించగా.. జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు), వృద్ధులు అందుబాటు ధరల్లోని ప్రాంతాలకు ఈ ఏడాది ఎక్కువగా బుకింగ్ చేసుకున్నారు. సులభతర చెల్లింపుల విధానాలకు సైతం ఆమోదనీయం పెరుగుతోంది. ఈ విషయంలో జెనరేషన్ జెడ్‌లో 1.4 రెట్ల అధిక ఆమోదం కనిపించింది. ‘‘వీసా రహిత విధానాలు, ట్రావెల్ నిబంధనలను సడలించడంతో దక్షిణాసియా ప్రాంతాలు ట్రావెలర్ల ముఖ్య ఎంపికగా మారాయి. అందుబాటు ధరల్లో ఉన్న ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ఏడాది పర్యాటకులు ప్రాధాన్యం ఇచ్చారు’’అని క్లియర్‌ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనుజ్‌రాతి తెలిపారు.
➜బాలిలోని డెన్‌పాసర్‌కు బుకింగ్‌లు 2023తో పోల్చితే 73 శాతం పెరిగాయి. బాలికి బెంగళూరు నుంచి ఇండిగో డైరెక్ట్ ఫ్లయిట్ సేవలను ప్రారంభించడంతో దేశీయ పర్యాటకులకు ఇది అందుబాటులోకి వచ్చింది.
➜దేశీయంగా పెరుంబాకం, పంగాల, టెక్కుమురి ప్రాంతాలకూ ఆదరణ లభించింది.
➜దేశీయంగా చూస్తే లక్షద్వీప్‌లోని అగట్టి దీవికి ఏకంగా 94 శాతం మేర బుకింగ్‌లు పెరిగాయి. డయ్యూకి 130 శాతం అధికంగా బుకింగ్‌లు వచ్చాయి. బెంగళూరు నుంచి గోవా, డయ్యూని కలుపుతూ అగట్టికి ఇండిగో సేవలు ప్రారంభించడం ఇందుకు నేపథ్యం.
➜ఎక్కువ మంది అన్వేషించిన దేశీయ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గోవా మొదటి స్థానంలో ఉంది. గతేడాదితో పోల్చితే గోవాకి ఫ్లయిట్ అన్వేషణలు 200% పెరిగాయి. అమృత్‌సర్‌కు 106% బుకింగ్‌లు పెరిగాయి.
➜ఎక్కువ మంది అన్వేషించిన అంతర్జాతీయ కేంద్రంగా అజర్‌బైజాన్‌లోని షాదాగ్ నిలిచింది. అలాగే అదుబాబి, కౌలాలంపూర్, మెల్‌బోర్న్, లండన్, బ్యాంకాక్ ఫ్లయిట్ అన్వేషణల్లో ప్రముఖంగా నిలిచాయి. గతేడాదితో పోలిస్తే 90 - 150 శాతం పెరుగుదల కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment