సాక్షి, న్యూఢిల్లీ : రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త వ్యయసాయ చట్టాలపై ఐదో సారి జరుగుతున్న చర్చలివి. కొత్త వ్యయసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం సమ్మతం కాదంటున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 8వ తేదీన భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించారు. ( వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన పడ్డ మంత్రి! )
కాగా, రైతులతో ప్రభుత్వం చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్‌తో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రైతుల డిమాండ్ల గురించి కేంద్ర మంత్రులు మోదీతో చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాల పట్ల అన్నదాతల అభ్యంతరాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లులపై రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే యోచన చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment