
21న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 21వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు పరిశ్రమల రాయితీలు తదితర అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
23 నుంచి 29 వరకు బాబు జపాన్ పర్యటన: సీఎం చంద్రబాబు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు కనీసం 40 మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు పాల్గొంటారు. సీఎంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణతో పాటు కమ్యునికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.