సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీ ఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు గురువారం న్యూఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులతో సమావేశమైయ్యారు. అనంతరం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎన్జీవోల సంఘం నాయకులు ప్రసంగించారు.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహారిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం వారు సమైక్య రాష్ట్రం కోసం గట్టి పోరాటం చేయాలని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు మాట్లాడటం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.