సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. దీనిలో భాగంగానే నేడు పలువురు కేంద్రమంత్రులు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లను ప్రచారం కొరకు రంగంలోకి దింపింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ప్రచారం చేయనున్నారు. అలాగే అంబర్‌పేటలో పురుషోత్తం రూపాల, ఆసీఫాబాద్, మంచిర్యాల, ఇల్లందు, కొత్తగూడెంలో కేంద్రమంత్రి జువల్ ఓరం పర్యటించనున్నారు. భద్రాచలం, ఖైరతాబాద్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె పటాన్‌చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో సహా బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విజయం సాధించిన స్థానాలను అయినా తిరిగి నిలబెట్టుకోవాలని కమలదళం ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలని, ప్రధాని మోదీ సహా, అమిత్‌షా కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మోది ఇప్పటికే తొలి విడత ప్రచారం ముగించుకోగా, రెండో విడత ప్రచారంలో కోసం బీజేపీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment