రాష్ట్ర విభజనపై ముందే సమాచారమున్న అడ్డుకోలేని కేంద్రమంత్రులు సీమాంధ్ర ద్రోహులని నీటి పారుదల శాఖ ఉద్యోగుల జేఏసి అధ్యక్షుడు బందెనవాజ్ విమర్శించారు.
ర్నూలు రూరల్, న్యూస్‌లైన్:
రాష్ట్ర విభజనపై ముందే సమాచారమున్న అడ్డుకోలేని కేంద్రమంత్రులు సీమాంధ్ర ద్రోహులని నీటి పారుదల శాఖ ఉద్యోగుల జేఏసి అధ్యక్షుడు బందెనవాజ్ విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఇరిగేషన్ ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు పిలుపు మేరకు గురువారం సాగునీటి కాలువలకు 24 గంటల పాటు నీటిని బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఉద్యమ ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పారుదల శాఖ జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని సుంకేసుల, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తుంగభద్ర దిగువ కాలువ కింద పలు డిస్ట్రిబ్యూటరీలకు నీటిని బంద్ చేశామన్నారు. కేంద్రమంత్రులు ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కట్టుబడతామని చెప్పడం సిగ్గు చేటన్నారు. భ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమంటూ సీఎం ప్రగల్బాలు పలుకుతూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నేరస్తుల ఆర్డినెన్స్‌పై స్పందించిన రాహూల్ గాంధీ తెలంగాణ నోట్‌పై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన జరిగితే శ్రీశైలం మిగులు జలాలపై ఆధారపడి ఉన్న ఎస్సార్బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్ ఎస్కేప్ చానల్, గాలేరు, హంద్రీనీవాలకు సాగునీరు రాదంటూ నీటి పారుదల శాఖ ఉద్యోగి మహేశ్వరప్ప జెండాపై చిత్రించి ప్రచారం చేశారు. ఆందోళనలో ఇరిగేషన్ ఉద్యోగులు ప్రసాద్‌రావు, మల్లికార్జునరెడ్డి, నవాజ్ జిలాని, లక్ష్మీనారాయణ, విజయకుమార్‌రెడ్డి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.