'రుణమాఫీని అలవాటు చేయడం సరికాదు'
నెల్లూరు: రుణమాఫీ హామీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు రుణమాఫీ అలవాటు చేయడం సరికాదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. రుణమాఫీలతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్నారు.
జీఎస్టీ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేలా చేస్తామని వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతి జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరులో త్వరలోనే జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ క్లస్టర్ ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు.