కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యతలు అప్పగించింది.
ఢిల్లీ: కేంద్రమంత్రులకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధికార ప్రతినిధులుగా కేంద్ర మంత్రులు చిదంబరం, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సల్మాన్ ఖుర్షీద్, ముకుల్‌వాసినిక్, శశిథరూర్, అభిషేక్ సింఘ్వి, జోతిరాదిత్య సింధియాలను నియమించారు. వీరితోపాటు మరో 13 మందికి అధికార ప్రతినిధులుగా బాధ్యతలు అప్పగించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించినట్లుగా భావిస్తున్నారు.