సాక్షి, ఢిల్లీ: 2023 ఏడాదికిగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇవాళ(బుధవారం మార్చి 22) సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌తో పాటు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ పద్మ విభూషణ్ అందుకోగా.. ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్‌లు పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు.
పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత.. బదులుగా ఆయన తనయుడు సుబ్రతా దెబ్బర్మా), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, ప్రముఖ బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. ప్రముఖ కళాకారుడు దిల్‌షద్ హుస్సేన్, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(దివంగత.. బదులుగా ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా అవార్డును అందుకున్నారు), మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి చింతల పాటి వెంకట పతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం), తెలంగాణకి చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్ ), బి.రామకృష్ణరెడ్డి (సాహిత్యం) పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
#WATCH | Former Union Minister SM Krishna receives the Padma Vibhushan from President Droupadi Murmu. pic.twitter.com/WqA5b0YH1i
— ANI (@ANI) March 22, 2023
LIVE: President Droupadi Murmu presents Padma Awards 2023 at Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/jtEQQtx1DP
— President of India (@rashtrapatibhvn) March 22, 2023
Comments
Please login to add a commentAdd a comment