న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి పద్మ అవార్డులు ప్రధానం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థపాకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు ప్రకటించిన పద్మ విభూషణ్‌ను ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థపాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది.
అలాగే చినజీయర్ స్వామి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎస్‌ఎస్ రాజమౌళి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. అలాగే సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వ్యవస్థపాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుని ఈ ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి బుధవారం వీటిని ప్రధానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోనే ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ..
Comments
Please login to add a commentAdd a comment