Supreme Court Dismisses Plea Of 14 Opposition Parties Over CBI, ED Misuse - Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ..

Published Wed, Apr 5 2023 4:19 PM | Last Updated on Wed, Apr 5 2023 4:56 PM

Supreme Court Dismisses Opposition Plea Over CBI ED Misuse - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విపక్షాలకు చుక్కెదురైంది. సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ సహా 14 రాజకీయ పార్టీలు  దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నాయకుల అరెస్టులపై నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని విపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్దిష్ట కేసు వివరాలు లేకుండా  మార్గదర్శకాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

సామాన్యుడికి, రాజకీయ నాయకులకు వేర్వేరు న్యాయ సూత్రాలు ఉండవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించలేం అని పేర్కొంది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

దీంతో  పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాల తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వీ న్యాయస్థానాన్ని కోరారు.   విపక్షాల స్పేస్ తగ్గిందని కోర్టులను ఆశ్రయించడం సరికాదు, దానికి సరైన వేదిక రాజకీయాలే అని సుప్రీకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని హితవు పలికింది.
చదవండి: ఛానల్‌ బ్యాన్‌.. కేంద్రానికి షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement