దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో మరింత క్రేజ్ దక్కించుకున్న శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది. అంతా ఊహించినట్లుగానే వీరి కాంబోలో మూవీ ఖరారైంది.
ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న చిత్రానికి దసరా హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాని ట్విటర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది.
నాని తన ట్వీట్‌లో రాస్తూ..'ఆయన నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను. ఆయన కోసం గంటల తరబడి క్యూలైన్స్‌లో వెయిట్ చేశా. నా సైకిల్‌ను కూడా కోల్పోయా. కానీ ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇదంతా ఒక చక్రం లాంటిది. దర్శతుడు శ్రీకాంత్‌తో కలిసి ఆ కల నెరవేరబోతోంది' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
మెగాస్టార్ రిప్లై
శ్రీకాంత్ ఓదెల, నానితో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందంటూ మెగాస్టార్ రిప్లై ఇచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాతే చిరంజీవి- శ్రీకాంత్ కాంబోలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Thrilled at this collaboration and looking forward to this one my dear @NameisNani 🤗@odela_srikanth#ChiruOdelaCinema
Natural Star @NameisNani @UnanimousProd@sudhakarcheruk5 @SLVCinemasOffl https://t.co/AGfKjrwjDL— Chiranjeevi Konidela (@KChiruTweets) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment