Major
-
మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు తన తల్లి & భార్య గురించి...
-
అమరన్ మూవీ.. మేజర్ కుటుంబ సభ్యుల కోరిక అదే: డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఆ విషయంపై వివాదం..అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. అయితే ఈ చిత్రంలో మేజర్ ముకుంద్ కులాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఓ వర్గం ప్రజలు ప్రశ్నించారు. తాజాగా చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో మేజర్ కులాన్ని ఎందుకు చూపించలేదన్న అంశంపై రాజ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు.మేజర్ కుటుంబం అభ్యర్థన ఇదే..ముకుంద్ భార్య ఇందు, అతని తల్లిదండ్రులు సినిమా తీయడానికి ముందే కొన్ని అభ్యర్థనలు చేశారని డైరెక్టర్ వివరించారు. మేజర్ ముకుంద్ తమిళియన్ కావడంతో.. ఆ పాత్రలో కచ్చితంగా తమిళ మూలాలు ఉన్న వ్యక్తిని నన్ను నటింపజేయాలని ఆమె కోరిందని తెలిపారు. అది నాకు శివకార్తికేయన్‌లో కనిపించిందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి తమిళ గుర్తింపు కూడా ఉండాలని ఆమె కోరుకుందని వెల్లడించారు.అదేవిధంగా ముకుంద్ తల్లిదండ్రులు తమ కుమారుడిని భారతీయుడిగానే చూపించాలని కోరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. అంతేకాకుండా తన సర్టిఫికేట్లో కూడా భారతీయుడు, తమిళుడు తప్ప మరేలాంటి గుర్తింపు తమకు వద్దన్నారు. మేజర్ ముకుంద్‌ను ఆర్మీ మ్యాన్‌గా మాత్రమే గుర్తించాలని ఆయన తల్లిదండ్రులు నన్ను అభ్యర్థించారని వెల్లడించారు. అందుకే సినిమాలో ఎక్కడా కూడా ముకుంద్ కులాన్ని ప్రస్తావించలేదన్నారు. అలాగే మేజర్ కుటుంబం తనను ఎప్పుడూ కులం అడగలేదని.. అదే స్ఫూర్తితో అశోకచక్ర అవార్డు గ్రహీతకు బహుమతిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.అమరన్ గురించి..కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. -
'ఆ సమయంలో బాధను బయట పెట్టకూడదనుకున్నా': సాయిపల్లవి కామెంట్స్
టాలీవుడ్ నేచురల్ బ్యూటీ ఈ దీపావళికి అభిమానులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీనే రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అమరన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమరన్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భావోద్వేగాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేజర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తాను ఏవిధంగా ఫీలయ్యిందో చెప్పుకొచ్చారు.సాయిపల్లవి మాట్లాడుతూ.. 'అమరన్ మూవీ భాగంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీని కలిశా. ఆయన గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నా. ఆయన జీవితం గురించి తెలిశాక బాధగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టకూడదని డిసైడ్ అయ్యా. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేజర్ తండ్రి వరదరాజన్ ఎక్కడికెళ్లినా గర్వంగా చెబుతుంటారు. వాళ్లకి లోపల చాలా బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించరు. ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని' అన్నారు.పాత వీడియో వైరల్..అయితే గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ నెటిజన్స్ ఆమెను తప్పు పడుతున్నారు. గతంలో ఆమె విరాటపర్వం సినిమా నాటి వీడియో.. తాజాగా అమరన్ రిలీజ్ సందర్భంగా నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.ఆ వీడియో సాయిపల్లవి మాట్లాడుతూ.. 'పాకిస్తాన్లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.కావాలనే చేస్తున్నారు..అయితే సాయిపల్లవి కామెంట్స్‌పై బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లే కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే సాయిపల్లవి బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్మీపై ఆమె చేసిన కామెంట్స్ వల్ల సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కొందరు కావాలనే టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు. -
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
ఆగస్టు 15.. ఓటీటీలో ఈ మూవీస్ మిస్ అవ్వొద్దు!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. చాలామందికి ఈ రోజు సెలవు. మరోవైపు థియేటర్లలో 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్', 'ఆయ్' తదితర మూవీస్ రిలీజ్. సరే ఇవేం చూస్తాంలే. ఇంట్లోనే ఎంటర్ టైన్మెంట్ కావాలా? అయితే ఈ సినిమాలు మీకోసమే. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా కాస్తంత దేశభక్తిని గుర్తొచేసే చిత్రాలివి. ఇంతకీ ఇవన్నీ ఏ ఓటీటీల్లో ఉన్నాయి? అనేది తెలియాలంటే దిగువన లిస్ట్ చూసేయండి.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చూడాల్సిన మూవీస్ఖడ్గం - సన్ నెక్స్ట్, యూట్యూబ్ (తెలుగు)మేజర్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఘాజీ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గగనం - హాట్ స్టార్, యూట్యూబ్ (తెలుగు)భారతీయుడు - నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ (తెలుగు డబ్బింగ్)మేజర్ చంద్రకాంత్ - యూట్యూబ్, సన్ నెక్స్ట్ (తెలుగు)అల్లూరి సీతారామరాజు - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ (తెలుగు)ఆర్ఆర్ఆర్ - జీ5, హాట్‌స్టార్ (తెలుగు)సర్దార్ పాపారాయుడు - అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)రాజన్న - హాట్ స్టార్ (తెలుగు)ఉరి - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)షేర్షా - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)సామ్ బహదూర్ - జీ5 (హిందీ)రాజీ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)బోస్: ద ఫర్గాటెన్ హీరో - యూట్యూబ్ (హిందీ)ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ - యూట్యూబ్ (హిందీ)బోర్డర్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)కేసరి - అమెజాన్ ప్రైమ్ (హిందీ)చక్ దే - అమెజాన్ ప్రైమ్ (హిందీ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?) -
‘సాహో సీత’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
కేరళ వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే.. దేశంలోని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోపై ప్రశంసల వర్షం కురిపించారు.మేజర్ సీతా అశోక్ షెల్కే ఫోటోను షేర్ చేస్తూ ఆమెను వయనాడ్ వండర్ఫుల్ ఉమెన్ అంటూ కొనియాడారు.మాకు డీసీ సూపర్ హీరోలు అవసరం లేదు. ఎందుకంటే మాకు నిజజీవితంలో మేజర్ సీతా అశోక్ షెల్కేలాంటి వారు ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. The WonderWoman of Wayanad. No need for DC Super Heroes. We have them in real life out here…💪🏽💪🏽💪🏽 pic.twitter.com/DWslH6nKln— anand mahindra (@anandmahindra) August 3, 2024 ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కో ఎవరు?భయంకరమైన విషాదాన్ని నింపిన వయనాడ్‌లో బాధితుల్ని రక్షించేందుకు రికార్డ్ సమయంలో తాత్కాలిక వంతెనల నిర్మాణం సీత ఆధ్వర్యంలోనే జరిగింది. వయనాడ్‌లో ముందక్కై, చురాల్‌మల్‌లను కలుపుతూ ప్రతికూల వాతావరణంలో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం జులై 31 రాత్రి 9గంటలకు ప్రారంభించి.. మర్నాడు సాయంత్రం 5.30గంటలకల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను త్వరగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొండచరియలు విరిగిపడి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం మరింత సులభమైంది. అందుకే దేశ ప్రజలు ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోను అభినందనలతో ముంచెత్తుతున్నారు. If possible, don’t destroy this bridge once a more permanent structure is restored. It should serve as a symbol of our pride in our army and the sense of security we derive from our soldiers. https://t.co/ZwNJZR4xbw— anand mahindra (@anandmahindra) August 4, 2024 -
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు. -
Major Radhika Sen: కాంగోలో శాంతిదూత
భారత ఆర్మీకి చెందిన మేజర్ రాధికా సేన్‌కు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరానికి గాను ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల హింస చోటు చేసుకోకుండా రాధికా సేన్ చూపిన శాంతి ప్రబోధానికి, ప్రచారానికి నిదర్శనం. రాధికాసేన్ పరిచయం.తు΄ాకీ పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం జటిలమైన పని. అంతర్యుధ్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ్ర΄ాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని పీస్ కీపింగ్ ఫోర్స్ ఆయా దేశాలలో శాంతి కోసం ΄ోరాటం చేస్తూనే ఉంటుంది. ్ర΄ాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు మన ఆర్మీ మేజర్ రాధికా సేన్‌కు దక్కింది.ఈ కాంగోలో ఘోరాలుమధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం స్వతంత్రం ΄÷ంది ‘మొబుతు’ అనే నియంత ΄ాలనలో మగ్గింది. అతణ్ణి ప్రజలు కిందకు దించాక 1998 నుంచి అక్కడ అస్థిర ΄ాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ తూర్పు ్ర΄ాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ తమ కారణాల రీత్యా తీవ్ర హింసకు ΄ాల్పడుతుంటాయి. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు ΄ాల్పడుతోంది. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి.అత్యాచార పర్వంరిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి ΄ోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ΄ûష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపుతూ వారి కోసం సమర్థంగా పని చేయడం వల్ల రాధికా సేన్‌ను అవార్డు వరించింది.బాధితుల కోసం దూతగా వచ్చి...ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగా ఆర్మీ మేజర్ రాధికా సేన్ 2023 ఏప్రిల్‌లో డి.ఆర్.కాంగోకు వెళ్లింది రాధికా సేన్. ‘ఇండియన్ రాపిడ్ డి΄్లాయ్మెంట్ బెటాలియన్’కు ఆమె అక్కడ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల సుహృద్భావనతో ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో చెప్పడం. రాధికా సేన్ నార్త్ కీవోలో పని చేసింది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉ΄ాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీ ్ర΄ాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె సంభాషణలు నిర్వహించేది. వారు మళ్లీ పనిలో పడేలా చూసింది. హింసను సమష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించింది. కాంగో మహిళలు రాధికా సేన్‌ను తమలోని మనిషిగా చూశారు. ఆమె ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా ఉద్యుక్తుల్ని చేసింది’ అని మెచ్చుకున్నారు. మే 30 (నేడు) రాధికా సేన్‌కు అవార్డు బహూకరించనున్నారు. -
A టు Z ఇయర్ ఎండర్
కరువులు. కల్లోలాలు. కొట్లాటలు. కన్నీళ్లు... క్లుప్తంగా చెప్పుకుంటే ప్రపంచానికి 2023 ప్రధానంగా మిగిల్చిన గుర్తులివే! 2022లో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన ఆక్రమణ 2023 పొడవునా పడుతూ లేస్తూ కొనసాగింది. ఇది చాలదన్నట్టు ఏడాది చివర్లో ఇజ్రాయెల్ దండయాత్ర పాలస్తీనాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి కారణమైంది. లక్షలాది మంది ఆకలి కేకలు ఐరాస సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. అంతర్జాతీయ సమాజంలో మానవీయ స్పందన కరువైన తీరును కళ్లకు కట్టాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అటు కరువు, ఇటు వరదలతో అతలాకుతలమయ్యాయి. భూతాపోన్నతి ఒకానొక దశలో 2 డిగ్రీల లక్ష్మణరేఖను దాటేసి ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును మరోసారి గుర్తు చేసింది. ఏదో ఒక రూపంలో అడపాదడపా తలెత్తుతున్న కరోనా ఏడాది ముగుస్తుండగా కొత్త వేరియంట్ రూపంలో మరోసారి గుబులు పుట్టిస్తోంది. చంద్రయాన్, జీ20 సదస్సు నిర్వహణ వంటివి భారత కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై మరింతగా చాటాయి. 2023 త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన ప్రధాన సంఘటనలపై విహంగ వీక్షణం. – సాక్షి, నేషనల్ డెస్క్ A ఆర్టికల్ 370 జమ్మూ కశ్మిర్‌కు పలు విషయాల్లో ప్రత్యేక హోదా కల్పించిన ఈ వివాదాస్పద ఆర్టికల్‌ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఏ రాష్ట్రానికీ విడిగా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఉండబోదని కుండబద్దలు కొట్టింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 11న ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దాంతో కశ్మిర్‌కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, అంతర్గత వ్యవహారాల్లో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది. B బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 81 ఏళ్ల బైడెన్.. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నెగ్గి తన రికార్డును తానే మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయుధ, ఆర్థిక మద్దతు కొనసాగింపుపై విమర్శలతో పాటు పాలస్తీనాలో మానవీయ సంక్షోభం ముదురుతున్నా యుద్ధం ఆపేలా ఇజ్రాయెల్‌ను ఒప్పించలేకపోతున్నారంటూ ఈ ఏడాది మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారాయన. రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష బరిలో దిగేలా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నుంచి బైడెన్‌కు గట్టి పోటీ తప్పకపోవచ్చంటున్నారు. కోర్టు కేసులు 77 ఏళ్ల ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లని పక్షంలో 2020లో మాదిరే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం వీరిద్దరే పోటీ పడేలా ఉన్నారు. C చంద్రయాన్–3 అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేసిన కీలక ప్రయోగం. 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం దిగ్విజయం సాధించింది. ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన వ్యోమ నౌక 23న చంద్రుని దక్షిణ ధ్రువ సమీపంలో సురక్షితంగా దిగింది. ఈ విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు D డొనాల్డ్ ట్రంప్ బహుశా అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన నేత. ఆ దేశంలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా రికార్డు సృష్టించారు. నీలి చిత్రాల తారతో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలో గత ఏప్రిల్‌లో కోర్టు మెట్లెక్కిన సందర్భంగా సాంకేతికంగా అరెస్టు కూడా అయ్యారు! ఇదీ రికార్డే. దీంతోపాటు 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ క్యాపిటల్ భవనంపై తన సమర్థకులను దాడికి ఉసిగొల్పిన కేసులో ట్రంప్‌ను కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా దోషిగా తేల్చింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది! ఇలా అనర్హతకు గురైన తొలి మాజీ అధ్యక్షునిగా కూడా నిలిచారు. అయినా ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు! E ఎలక్షన్స్ 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపునిస్తే విపక్ష కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశకు లోను చేశాయి. ఈ ఏడాది చివర్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో బీజేపీ విజయబావుటా ఎగరేయడమే గాక మధ్యప్రదేశ్‌లోనూ ఘనవిజయం సాధించింది. ఎన్ని హామీలిచ్చినా రాజస్తాన్‌లో ఓటమి చవిచూడటమే గాక అధికారం నిలుపుకోవడం ఖాయమని భావించిన ఛత్తీస్‌గఢ్‌నూ కోల్పోవడంతో కాంగ్రెస్ తీవ్ర నైరాశ్యానికి లోనైంది. తెలంగాణలో సాధించిన అనూహ్య విజయం ఈ ఓటముల ముందు చిన్నబోయింది. ఈ నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ ప్రాధాన్యం కూడా తగ్గుముఖం పట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ భాగస్వాముల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి! F ఫారిన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల్లో 2023 భారత్‌కు మిశ్రమ ఫలితాలిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాదిరిగానే గాజాపై ఇజ్రాయెల్ దాడి విషయంలో కూడా ఏ పక్షం వైపూ పూర్తిగా మొగ్గకుండా ఎప్పట్లాగే కేంద్రం ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అంతేగాక జీ20 సదస్సు నిర్వహణ వంటి పలు అంతర్జాతీయ విజయాలు మన ఖాతాలో పడ్డాయి. అయితే కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందన్న ఆ దేశ ప్రధాని ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకరకంగా ఇరు దేశాల మధ్య నెలల తరబడి ‘దౌత్య యుద్ధమే’ జరిగింది. ఈ విషయంలో అమెరికా కూడా కెనడాకే దన్నుగా నిలవడం మనకు ఇబ్బందికరంగా మారింది. G జి 20 ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ప్రముఖ దేశాల అధినేతలు తరలివచ్చారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు రోజుల శిఖరాగ్రం ఘనవిజయం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి ప్రతష్టలను మరింతగా పెంచింది. H హెచ్1బీ రెన్యువల్స్ వేలాది భారతీయ టెకీలకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో అగ్ర రాజ్యం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ఇకపై అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తొలి విడతగా 20 వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను మొదలు పెట్టింది కూడా. దాంతో రెన్యువల్స్‌కు భారత్కో, మరో దేశానికో వెళ్లాల్సిన అవస్థ తప్పనుంది. I ఇమ్రాన్ ఖాన్ గతేడాది పాకిస్తాన్ ప్రధాని పదవి పోగొట్టుకుని, హత్యాయత్నం నుంచి తూటా గాయాలతో బయట పడ్డ ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా జైలుపాలయ్యారు! భూ వివాదం కేసులో తొలుత మే 9న హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్టయ్యారు. తర్వాత విడుదలైనా తోషాఖానా కానుకల కేసులో ఆగస్టు 6న మళ్లీ అరెస్టయ్యారు. అప్పటినుంచీ జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనపై 140కి పైగా కేసులు దాఖలయ్యాయి! ఫిబ్రవరిలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పావులు కదుపుతోంది. పాక్‌లో సర్వశక్తిమంతమైన సైన్యం కూడా అందుకు పూర్తిగా సాయపడుతున్నట్టు కని్పస్తోంది. J జిన్‌పింగ్ మావో అనంతరం చైనాలో అత్యంత శక్తిమంతుడైన నాయకునిగా అవతరించారు. 2023 మార్చిలో ఏకంగా వరుసగా మూడోసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. చైనా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకునిగా రికార్డులకెక్కారు. పార్టీలోని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఎదురులేని నాయకునిగా మారారు. అయితే కరోనా కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. లాక్‌డౌన్‌ను భరించలేక జనం భారీగా తిరుగుబాటుకు దిగడంతో నిబంధనలను సడలించాల్సి రావడం జిన్‌పింగ్ ప్రతిష్టకు మచ్చగా మిగిలింది. రియల్టీ భారీ పతనం, ఆర్థిక ఒడిదుడుకులు ఆయనకు సవాలుగా మారాయి. K కింగ్ చార్లెస్–3 బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం జరుపుకున్నారు. మే 6న అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలంతా హాజరయ్యారు. 73 ఏళ్ల చార్లెస్–3 2022 సెప్టెంబర్ 8న తన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో గద్దెనెక్కారు. అత్యంత పెద్ద వయసులో ఆ బాధ్యతలు చేపట్టి రికార్డులకెక్కారు. 8 నెలల తర్వాత లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు. L ఎల్జీబీటీక్యూఐ స్వలింగ సంపర్కం ఈ ఏడాదీ తరచూ వార్తల్లో నిలిచింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమంటూ అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకూ ఇతరుల మాదిరిగానే అన్ని హక్కులూ ఉంటాయని స్పష్టం చేసింది. వాటిని కాపాడాలని, వారిని ఎవరూ చిన్నచూపు చూడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది. M మణిపూర్ కల్లోలం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ఈ ఏడాది జాతుల హింసతో అట్టుడికింది. సంఖ్యాధికులైన మెయితీ తెగ వారు తమను గిరిజనేతరులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన కుకీలు మే 3న జరిపిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కుకీ మహిళను దారుణంగా హింసించి నగ్నంగా ఊరేగించడమే గాక అత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్రం భగ్గుమంది. అలా చెలరేగిన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. వందలాది మంది మరణించగా కనీసం 40 వేల మందికి పైగా కుకీలు పొరుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. కేంద్రం మెయితీల పట్ల పక్షపాతం చూపుతూ సమస్య పరిష్కారంపై మీనమేషాలు లెక్కిస్తోందంటూ విమర్శలపాలైంది. N నార్త్ కొరియా ఉత్తర కొరియా 2023 పొడవునా వరుస క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తూనే ఉంది. పొరుగు దేశం దక్షిణ కొరియానూ, అమెరికానూ హడలెత్తిస్తూనే ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది అది 36కు పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. వీటిలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కూడా ఉన్నాయి! దాంతో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇరు దేశాల మధ్య 2018లో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేసుకునే దాకా వెళ్లింది. O అపోజిషన్ కాంగ్రెస్‌తో పాటు 28 విపక్షాలు ఒక్క వేదికపైకి రావడం 2023లో జరిగిన ముఖ్య రాజకీయ పరిణామం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ చొరవతో ఈ కూటమి తెరపైకి వచ్చింది. జూలై 18న బెంగళూరులో జరిగిన రెండో భేటీలో కూటమికి ఇండియా పేరును ఖరారు చేశారు. కూటమి నాలుగుసార్లు సమావేశమై భావి కార్యాచరణపై చర్చించింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనవరి రెండో వారంలోగా సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే పనిలో ఉంది. P పాకిస్తాన్ దివాలా 2023లో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. నిత్యావసరాలకు కూడా కటకటలాడే పరిస్థితి తలెత్తింది. బియ్యం, గోధుమ పిండి తదితరాల కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు పరిపాటిగా మారాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరాయి. ఏడాది చివరికి వచ్చేసరికి పాస్‌పోర్టుల ముద్రణకు కావాల్సిన పేపర్ దిగుమతికి కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరింది. దాంతో ఒక దశలో పాస్‌పోర్టుల జారీయే నిలిచిపోయింది. Q క్వేక్స్ ఈ ఏడాది భారీ భూకంపాలతో పలు దేశాలు అతలాకుతలమయ్యాయి. ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. 50 వేల మందికి పైగా దీనికి బలయ్యారు. వీరిలో 44 వేలకు పైగా మరణాలు తుర్కియేలోనే సంభవించాయి! అనంతరం సెపె్టంబర్ 8న మొరాకోలో వచ్చిన 6.8 తీవ్రతతో కూడిన భూకంపానికి 3,000 మందికి పైగా బలయ్యారు. డిసెంబర్ 19న వాయవ్య చైనాలో వచ్చిన భూకంపం 150 మందిని బలి తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని జోషీ మఠ్‌లో నేల కుంగుబాట పట్టిన వైనమూ కలకలం రేపింది. వందలాది ఇళ్లు నిలువునా పగుళ్లిచ్చాయి! R ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఈ ఏడాది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని రెట్టింపు చేసింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఉత్తమ పాట అవార్డు దక్కింది. మార్చిలో జరిగిన ఆస్కార్ వేడుకలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అవార్డును అందుకున్నారు. 2009లో భారతీయ సినిమా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన జై హో పాటకూ ఆస్కార్ వచ్చినా ఆ సినిమాను యూకే ప్రొడక్షన్స్ పతాకంపై హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ రూపొందించారు. S సస్పెన్షన్లు 2023 ముగింపుకు వచ్చిన వేళ విపక్ష ఎంపీల భారీ సస్పెన్షన్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేడెక్కించాయి. డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీస్తూ విపక్ష ఎంపీలు ఉభయ సభలనూ రోజుల తరబడి హోరెత్తించారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటి నుంచీ కలిపి వారం రోజుల వ్యవధిలో ఏకంగా 149 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వరుస సస్పెన్షన్లు రాజకీయంగా దుమారం రేపాయి. T టన్నెల్ మనిషి సంకల్పం ముందు మంచు శిఖరం తలొంచింది. ఉత్తరాఖండ్‌లో సిల్‌్కయారా సొరంగం కుప్పకూలి లోన చిక్కుబడ్డ 41 మంది కార్మికులు 16 రోజుల ఉత్కంఠ తర్వాత సురక్షితంగా బయట పడ్డారు. హైవే పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం నవంబర్ 12న పాక్షికంగా కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌లో రోజుకో సమస్యలతో నిత్యం సస్పెన్సు నెలకొంటూ వచ్చింది. కీలకమైన చివరి అంకం సినిమా క్లైమాక్స్‌నే తలపించింది. యంత్ర బలం చేతులెత్తేసిన వేళ ర్యాట్ హోల్ కార్మికులు చివరి 12 మీటర్ల మేరకు శిథిలాలను జాగ్రత్తగా తవ్వేసి కారి్మకులను బయటికి తీసుకొచ్చారు. U యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచింది. కులమత తదితర విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన యూసీసీని అమలు చేసే దిశగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఏర్పాటైన దేశాయ్ కమిటీ నవంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో యూసీసీ విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు జరగవచ్చు. V వెనెజులా పొరుగున ఉన్న బుల్లి దేశమైన గయానాలో ని ఎసిక్వెబో ప్రాంతంలో అపార చమురు నిక్షేపాలపై వెనెజులా కన్నేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అవసరమైతే సైనిక చర్యకు దిగైనా దాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతుండటంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. W వార్స్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడి కారణంగా అక్టోబర్‌లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధమూ భీకరంగా సాగుతూనే ఉంది. ఇలా 2023 యుద్ధ సంవత్సరంగా గుర్తుండిపోనుంది. X ఎక్స్ ప్రముఖ సోషల్ సైట్ ట్విట్టర్‌ను సుదీర్ఘ కాలయాపన, వివాదాల తర్వాత 2022 చివర్లో సొంతం చేసుకున్న ఎలాన్ మస్‌్క, గత జూలైలో దాని పేరును ఎక్స్‌గా మార్చి మరో సంచలనం సృష్టించారు. బ్లూ టిక్ తీసేయడం మొదలుకుని ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో సంస్థ విలువ సగానికి సగం పడిపోయింది. Y యెవగనీ ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు. వాగ్నర్ ప్రేవేట్ సైనిక మూక చీఫ్. పుతిన్‌తో విభేదాల నేపథ్యంలో ఆగస్టు 23న ‘విమాన ప్రమాదం’లో ప్రిగోజిన్ మరణించాడు. రష్యాలో ఇలా అనుమానాస్పదంగా కాలగర్భంలో కలిసిపోయిన వారి జాబితాలో చేరిపోయాడు. Z జియోనిజం పశి్చమాసియాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనకు పుట్టుకొచ్చిన ఉద్యమం. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. తాను జియోనిస్టునని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. -
2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే..
భారతదేశ చరిత్రలో ప్రకృతి విపత్తులకు, మానవ తప్పిదాల కారణంగా తలెత్తే ఆపదలకు కొదవేంలేదు. వాటిలో ఒకటే అగ్ని ప్రమాదాలు. పలు ఘటనల్లో అగ్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని తెలుస్తుంటుంది. 2023లో మన దేశంలో అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది భారతదేశంలో సంభవించిన కొన్ని భారీ అగ్ని ప్రమాదాలు.. 15 మంది మృత్యువాత.. ధన్‌బాద్ (జార్ఖండ్): 2023, జనవరి 31న జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు. బస్సులో మంటలు చెలరేగి.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై 2023, జూలై ఒకటిన.. తెల్లవారుజామున ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 25 మంది మృతి చెందారు. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. హమ్‌సఫర్‌లో అగ్నిప్రమాదం 2023, సెప్టెంబరు 23న తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలు గుజరాత్‌లోని వల్సాద్ రైల్వే స్టేషన్ దాటుతుండగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రెస్క్యూ టీమ్.. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారత్ గౌరవ్ రైలులో.. 2023, ఆగస్టు 26న లక్నో-రామేశ్వరం భారత్ గౌరవ్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని మధురై జంక్షన్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు నాలుగు కోచ్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్నిప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు. లూథియానా గ్యాస్ లీక్ 2023, అక్టోబర్ 15న పంజాబ్‌లోని లూథియానాలోని ఒక రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. ఫలితంగా ఫ్యాక్టరీ సమీపంలోని భవనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది కార్మికులు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. వాల్వ్ సరిగా లేకపోవడంతో గ్యాస్ లీక్ అయింది. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలు భవిష్యత్తులో ఇటువంటి విషాదాలను నివారించడనికి గుణపాఠంగా కనిపిస్తాయి. మనం తీసుకోవల్సిన అగ్నిమాపక భద్రతా చర్యలతో పాటు అత్యవసర సంసిద్ధత ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు? -
చైనాకు చుక్కలు చూపించిన మేజర్ షైతాన్ సింగ్
శత్రువు చేతికి చిక్కిన ఆ యోధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. కాలితోనే శత్రువులపైకి తుపాకీ తూటాలు పేల్చాడు. శత్రువులను మట్టికరిపించి, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనంతరం అమరుడయ్యాడు. చైనాకు చుక్కలు చూపించిన భారత అమరవీరుని కథ ఇది. 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. అయితే 1962, నవంబరు 18న, అంటే యుద్ధం మధ్యలో మరొక చిన్న యుద్ధం జరిగింది. దీనిని రెజాంగ్ లా యుద్ధం అని చెబుతారు. ఈ యుద్ధంలో మేజర్ షైతాన్ సింగ్ విజయం సాధించి, అమరవీరుడు అయ్యాడు. మరణానంతరం పరమవీర చక్రను అందుకున్నాడు. 1962లో భారత్‌పై చైనా దాడి చేసింది. ఈ సమయంలో కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన 13వ బెటాలియన్ లేహ్-లడఖ్‌లోని చుషుల్ సెక్టార్లో మోహరించింది. దీనిలోని సీ కంపెనీ సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల (16 వేల అడుగులు) ఎత్తులో రెజాంగ్ లా వద్ద ఉన్న పోస్ట్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. 1962 నవంబరు 18న ఉదయం చైనా దళాలు ఈ పోస్ట్‌పై దాడి చేశాయి. తేలికపాటి మెషిన్ గన్లు, రైఫిల్స్, మోర్టార్లు, గ్రెనేడ్లతో దాడి జరిగింది. ఆ సమయంలో ఎముకలు కొరికే చలి సైనికులను చుట్టుముట్టింది దాదాపు 1300 మంది చైనా సైనికులతో 120 మంది భారత సైనికులు పోరాడుతున్నారు. మేజర్ షైతాన్ సింగ్.. రెజిమెంట్‌లోని చార్లీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధంలో పోరాడేందుకు తక్కువ సైనిక బలగం, తక్కువ ఆయుధాలు ఉన్నాయని గ్రహించిన ఆయన ఒక వ్యూహాన్ని రూపొందించారు. సైనికులు ఫైరింగ్ పరిధిలోకి రాగానే శత్రువుపై కాల్పులు జరపాలని ఆదేశించారు. ఒక్క బుల్లెట్‌తో ఒక్కో చైనా సైనికుడిని చంపేయాలని కోరాడు. ఈ వ్యూహంతో భారత సైనికులు దాదాపు 18 గంటల పాటు శత్రువులను ఎదుర్కొని విజయం సాధించారు. అయితే అప్పటికే 114 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కుయుక్తులకు దిగి, దాడి చేయడంతో ఈ యుద్ధంలో గెలిచింది. భారత సైన్యానికి చెందిన మూడు బంకర్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మేజర్ షైతాన్ సింగ్ శత్రువులతో పోరాడుతూనే ఉన్నాడు. కాలికి మెషిన్ గన్ కట్టుకుని, కాలి వేళ్లతో ట్రిగ్గర్ నొక్కుతూ బుల్లెట్లు కురిపించాడు. అయితే మేజర్ షైతాన్ సింగ్‌కు అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించింది. సుబేదార్ రామచంద్ర యాదవ్ అతనిని తన వీపునకు కట్టుకుని చాలా దూరం వరకూ తీసుకెళ్లి, అక్కడ పడుకోబెట్టారు. కొద్దిసేపటికే మేజర్ షైతాన్ సింగ్ అమరుడయ్యాడు. ఈ ఘటన 1962 నవంబరు 18 జరిగింది. ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! Major Shaitan Singh Param Vir Chakra Kumaon Regiment 18 November 1962 Major Shaitan Singh displayed undaunted courage and exemplary leadership in the face of the enemy. Awarded #ParamVirChakra (Posthumous). We pay our tribute. https://t.co/i8AOme3gYH pic.twitter.com/AGoSAKYD9e — ADG PI - INDIAN ARMY (@adgpi) November 18, 2023 -
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్‌లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్‌లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం?
పాక్‌లో భారీ భూకంపానికి సంబంధించిన అంచనాలు వెలువడిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక పరిశోధనా సంస్థ నుండి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ పాకిస్తాన్లో రాబోయే 48 గంటల్లో సంభవించే విధ్వంసక భూకంపానికి సంబంధించిన అంచనాను వెల్లడించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి పాక్ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (ఎస్‌ఎస్‌జీఈఓఎస్)కు చెందిన ఒక పరిశోధకుడు.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించామని, ఇది రాబోయే బలమైన భూకంపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ వార్త దేశంలో దావానలంలా వ్యాపించింది. రానున్న 48 గంటల్లో దేశంలో పెను భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం జరుగుతోంది. డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని తెలియజేశారంటూ ప్రచారం జరుగుతోంది. అతను గతంలో టర్కీ, సిరియాలో ప్రమాదకరమైన భూకంపాలను అంచనా వేయడానికి గ్రహాల అమరికను అధ్యయనం చేశారు. మరో 48 గంటల్లో పాకిస్థాన్‌లో బలమైన భూకంపం వస్తుందని ఈ శాస్త్రవేత్త అంచనా వేసినట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రాణాలను దక్కించుకునేందుకు ఏం చేయాలంటూ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత? On 30 September we recorded atmospheric fluctuations that included parts of and near Pakistan. This is correct. It can be an indicator of an upcoming stronger tremor (as was the case with Morocco). But we cannot say with certainty that it will happen. https://t.co/B6MtclMOpe — Frank Hoogerbeets (@hogrbe) October 2, 2023 -
బాలికపై పాశవికం.. ఆర్మీ మేజర్ దంపతుల వికృత చేష్టలు
అసోం: ఓ బాలికపై ఆర్మీ మేజర్, ఆయన భార్య వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంట్లో పనిచేసే పదహారేళ్ల బాలికను పాశవికంగా వేధింపులకు గురిచేశారు. బాలిక శరీరంపై ఎక్కడ చూసిన కాల్చిన వాతలు కన్పించాయి. పళ్లు ఊడిపోయాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలు కనిపించాయి. ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనులు చేయిస్తూనే గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆహారం సరిగా ఇవ్వకుండా బాలికను బక్కచిక్కిపోయేలా చేశారు. ఆహారం కూడా చెత్తకుప్పలో నుంచి ఏరుకుని తినేలా చేసి పాశవిక ఆనందాన్ని పొందినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నగ్నంగా ఉంచి రక్తం వచ్చేలా కొట్టేవారని వెల్లడించింది. గదిలో బందించి క్రూరంగా హింసించేవారని బాధితురాలు పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అసోం నుంచి వెళ్లినప్పుడు ఓ బాలికను ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అసోంకి తిరిగివచ్చిన క్రమంలో బాలిక తన కుటుంబాన్ని కలిసింది. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల వయసులో ఉన్న తన కూతురును వృద్ధురాలిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం -
నేడు సైమా అవార్డ్స్ ప్రకటన.. పోటీ పడుతున్న తెలుగు స్టార్స్ వీళ్లే
సినిమా ఇండస్ట్రీలో సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుగా సైమాకు గుర్తింపు ఉంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుక మరికొన్న గంటల్లో దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే అక్కడకు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నారు. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది పరిపాటి అని తెలిసిందే. ఈ పోటీలో ఎవరెవరున్నారో ఆ లిస్ట్‌ను సైమా ఇప్పటికే విడుదల చేసింది. ఉత్తమ నటుడు, చిత్రం – తెలుగు (2023) ♦ అడవి శేష్ (మేజర్) ♦ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR) ♦ దుల్కర్ సల్మాన్ (సీతారామం) ♦ నిఖిల్ సిద్దార్ద్ (కార్తికేయ) ♦ సిద్దు జొన్నలగడ్డ (DJ టిల్లు) ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023) ♦ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ♦ హను రాఘవపూడి (సీతారామం) ♦ చందూ మొండేటి (కార్తికేయ 2) ♦ శశికిరణ్ తిక్కా (మేజర్) ♦ విమల్ కృష్ణ (డీజే టిల్లు) ఉత్తమ గేయ రచయిత ♦ RRR సినిమా నుంచి నాటు నాటు (చంద్రబోస్) ♦ సీతారామం నుంచి 'ఇంతందం' సాంగ్ (కృష్ణకాంత్) ♦ ఆచార్య సినిమా నుంచి 'లాహె.. లాహె' సాంగ్ (రామజోగయ్య) ♦ RRR నుంచి 'కొమురం భీముడో' సాంగ్ (సుద్దాల అశోక్ తేజ) ఉత్తమ సహాయ నటి ♦ అక్కినేని అమల (ఒకే ఒక జీవితం) ♦ ప్రియమణి (విరాట పర్వం) ♦ సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్) ♦ సంగీత (మాసూద) ♦ శోభిత ధూళిపాళ (మేజర్) ఉత్తమ విలన్ ♦ సత్యదేవ్ (గాడ్ ఫాదర్) ♦ జయరామ్ (ధమాకా) ♦ సముద్రఖని (సర్కారు వారి పాట) ♦ సుహాస్ (హిట్-2) ► పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా 2023లో కనీసం నామినేషన్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. A glimpse of the star-studded moments. SIIMA 2023 pre-event press meet highlights!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall #TruckersUAE #SIIMA2023 #A23SIIMAWeekend #SouthIndianAwards #Docile… pic.twitter.com/hlVL9fI050 — SIIMA (@siima) September 14, 2023 (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) -
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్‌లైన్స్ పుణె ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్‌ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్‌ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్‌లైన్స్ పైలట్. సంజయ్ కుమార్‌ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
హైకోర్టుకు మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి భార్య.. కీలక ఆదేశాలు జారీ
భువనేశ్వర్: చైనా–భారత్ మధ్య 1962లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి ధైర్య సాహసాలకు ప్రతీకగా ప్రదానం చేసిన భూమి(రికార్డ్ ఆఫ్ లైట్స్–ఆర్ఓఆర్)ని ఆయన భార్యకు అందజేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. నెల రోజుల వ్యవధిలో భూమి సంబంధిత పట్టా సిద్ధం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి వారం రోజుల్లోగా సవరించిన ఆర్ఓఆర్ను పిటిషనర్ ఇంటికి వెళ్లి, ప్రత్యక్షంగా అందజేయాలని స్పష్టం చేసింది. దివంగత మేజర్ శ్యామ్‌సుందర్ మహంతి భార్య పూర్ణిమా మహంతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్‌తో కూడిన ధర్మాసనం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ధైర్యసాహసి మేజర్ భార్యను వేధించడం పట్ల న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సత్వర చర్యలతో ఆర్ఓఆర్ సిద్ధం చేసి, ఇంటి వద్దకే వెళ్లి పిటిషర్‌కు అందజేయాలన్నారు. అధికారి తీరుపై అసహనం.. 1962 చైనా–భారత్ యుద్ధంలో మేజర్ మహంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను ప్రభుత్వం ఆయనకు శ్యామపూర్ ప్రాంతంలో 5 ఎకరాల భూమిని ప్రదానం చేసింది. 2004లో మహంతి మరణించగా.. కుటుంబ వ్యవహారాల నిమిత్తం ఆయనకు కేటాయించిన భూమిని భార్య పూర్ణిమ వివిధ సందర్భాలలో ఐదుగురు వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. మరికొంత భూమిని తనవద్దే ఉంచుకున్నారు. దీనిపై భువనేశ్వర్ అసిస్టెంట్ సెటిల్మెంట్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూమిని ప్రభుత్వ సాధారణ పాలనాశాఖ పేరిట నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్వర్వులను పూర్ణిమ మహంతి హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె అభ్యర్థన పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అధికారి తీరును తప్పుబడుతూ ఉత్తర్వులు చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని కొట్టివేసింది. ఈ భూమిని ధైర్య సాహసాలను గుర్తిస్తూ రిటైర్డ్ ఆర్మీ మేజర్‌కు కేటాయించడంతో ఈ విషయంలో సంబంధిత అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
అడివి శేష్ సక్సెస్ కు కారణం అదే ..!
-
ఇఫీకి అంతా సిద్ధం
ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది. 53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్ – ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమ సెక్షన్ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్ ‘మేజర్’, అనుపమ్ ఖేర్ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్’, ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి. నాన్–ఫీచర్ విభాగంలో ‘టాంగ్’, ‘రే– ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే’, ‘క్లింటన్ అండ్ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్‌స్ట్రీమ్ సెక్షన్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ (హిందీ), ‘ఆర్ఆర్ఆర్’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్’ (బెంగాలీ), ‘ధర్మవీర్: ముక్కమ్ పోస్ట్’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ పనోరమ సెక్షన్లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్), ‘ఖుదీరామ్ బోస్’ (దర్శకుడు విద్యాసాగర్ రాజు) ఉన్నాయి. -
సండే సినిమా: వెండితెరపై జై జవాన్
సైనికులు అంటే యుద్ధం. దేశభక్తి. ప్రేమ. వియోగం. గెలుపు. మరణం. అందుకే ప్రపంచ సినిమాతో పాటు భారతీయ సినిమాలో తెలుగు సినిమాలో కూడా సైనికుడు కథానాయకుడు అవుతాడు. ‘సీతా రామమ్’లో హీరో సైనికుడు. ప్రేక్షకులు ఆ పాత్రను మెచ్చుకున్నారు. గతంలోనూ ఇలాగే మెచ్చారు. కాని నిజం చెప్పాలంటే తెలుగు సినిమాకు సైనికుడు అంతగా అచ్చి రాలేదు. ‘సండే సినిమా’లో ఈవారం ‘సైనిక సినిమా’. తెలుగు సినిమాల్లో సైనికుణ్ణి ఎక్కువగా తీసుకోరు. సైనికుడు అంటే ప్రేక్షకులు ఒక రకంగా ప్రిపేర్ అవుతారు... ఏ వీరమరణం పొందుతాడోనని. అదీగాక ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది వారికి సైనికులతో మానసిక అటాచ్మెంట్ తక్కువ. ఉత్తరాది వారే ఎక్కువగా సైన్యంలో భర్తీ కావడం ఇందుకు కారణం. అయినప్పటికీ మనవాళ్లు సైనిక నేపథ్యం ఉన్న పూర్తి సబ్జెక్ట్‌లను లేదా ఫ్లాష్‌బ్యాక్ కోసం కథ మలుపు కోసం సైనికుల సినిమాలు తీశారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ఏ.ఎన్.ఆర్ ‘సిపాయి చిన్నయ్య’ చేశారు. అది ఒక మోస్తరుగా ఆడింది. అదే అక్కినేని ‘జై జవాన్’లో నటిస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. ఎన్.టి.ఆర్. ‘రాము’లో మిలట్రీ జవాను. హిట్ అయ్యింది. కాని అదే ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సైనిక సినిమాల్లోకెల్లా పెద్ద హిట్‌గా ఇప్పటికీ నిలిచి ఉంది. అందులోని ‘జననీ జన్మభూమిశ్చ’ పాట దేశభక్తి గీతంగా మార్మోగుతూ ఉంది. కృష్ణ ‘ఏది ధర్మం ఏది న్యాయం’లో మిలట్రీ కేరెక్టర్ చేస్తే ఆడలేదు. కృష్ణ మరో సినిమా ‘చీకటి వెలుగులు’ కూడా అంతే. శోభన్ బాబు ‘బంగారు కలలు’ (ఆరాధన రీమేక్)లో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. చిరంజీవి సైనికుడిగా నటించిన భారీ చిత్రం ‘యుద్ధభూమి’ సినీ సైనిక సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం కె.రాఘవేంద్రరావు. అదే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి ఎయిర్‌ఫోర్స్ కస్టమ్స్ ఆఫీసర్‌గా ‘చాణక్య శపథం’లో నటించినా ఫలితం అదే వచ్చింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’, ‘పరమవీర చక్ర’ తగిన ఫలితాలు రాబట్టలేదు. కాని ‘మంగమ్మ గారి మనవడు’లో చిన్న సైనిక నేపథ్యం ఉంటుంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజశేఖర్ నటించిన ‘మగాడు’ పెద్ద హిట్ అయితే ‘అంగరక్షకుడు’, ‘ఆగ్రహం’ విఫలం అయ్యాయి. నాగార్జున ‘నిన్నే ప్రేమిస్తా’లో సైనికుడిగా కనిపిస్తాడు. సుమంత్ ‘యువకుడు’, ‘స్నేహమంటే ఇదేరా’లో సైనిక పాత్రలు చేశాడు. ఈ కాలం సినిమాలలో మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్‌హిట్ కొట్టింది. సరిహద్దులో రాయలసీమలో మహేశ్ ప్రతాపం చూపగలిగాడు. కామెడీ ట్రాక్ లాభించింది. అడవి శేష్ ‘మేజర్’ తెలుగులో అమర సైనికుల బయోపిక్‌ను నమోదు చేసింది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మిశ్రమ ఫలితాలు సాధించింది. రానా ‘ది ఘాజీ అటాక్’ హిట్. నాగ చైతన్య ‘లాల్‌సింగ్ చడ్డా’లో తెలుగు సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సైనిక సెంటిమెంట్ గండాన్ని దాటి ‘సీతా రామమ్’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రామ్ అనే సైనికుడు నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి అనే యువరాణితో ప్రేమలో పడటమే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ పాత్రలు తెర మీద మంచి కెమిస్ట్రీని సాధించాయి. పాటలు మనసును తాకాయి. హిమాలయ సానువులు, మంచు మైదానాలు కూడా ఈ కథలో భాగమయ్యి కంటికి నచ్చాయి. గొప్ప ప్రేమకథలు విషాదాంతం అవుతాయి అన్నట్టుగా ఈ కథ కూడా విషాదాంతం అవుతుంది. అందుకే ప్రేక్షకులకు నచ్చింది. బాంధవ్యాలను, కుటుంబాలను వదిలి దేశం కోసం పహారా కాసే వీరుడు సైనికుడు. అతని చుట్టూ ఎన్నో కథలు. ఆ కథలు సరిగా చెప్తే ఆదరిస్తామని ప్రేక్షకుడు అంటున్నాడు. మున్ముందు ఎలాంటి కథలు వస్తాయో చూద్దాం. -
రియల్ హీరో ఉన్ని కృష్ణన్ పక్కన "రీల్ మేజర్" ను చూశారా? (ఫొటోలు)
-
‘మేజర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
అడివి శేష్ హీరోగా,సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన చిత్రం ‘మేజర్’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ లభించింది. అడివి శేష్ నటన, శశికిరణ్ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిరోజు బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలో మొత్తంగా రూ.4 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి. ‘మేజర్’ తొలిరోజు కలెక్షన్స్ ► నైజాం - రూ.1.75 కోట్లు ► సీడెడ్ - రూ.46 లక్షలు ► ఈస్ట్ - 24 లక్షలు ► వెస్ట్ - రూ.24 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.51 లక్షలు ► గుంటూరు- 30 లక్షలు ► కృష్ణా - రూ.28లక్షలు ► నెల్లూరు - రూ.19లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 0.35కోట్లు ►ఓవర్సీస్-2.35 కోట్లు ►మొత్తం- రూ.7.12 కోట్లు(రూ.13.10కోట్ల గ్రాస్) -
ఏంటో.. అందరికి నా బర్త్‌డే సెంటిమెంట్ అయిపోయింది: విజయ్
Vijay Deverakonda Tweet On His Birthday: ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల లైగర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విజయ్, అప్పుడే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేయగా.. మరోసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో జనగనమణ సినిమాలను స్టార్ట్ చేసేశాడు. ఇదిలా ఉంటే నేడు (మే 9న) విజయ్ బర్త్ డే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కి స్పెషల్ విషెష్ చెప్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత అర్ధరాత్రే విజయ్‌తో కేక్ కట్ చేయించి రౌడీ బర్త్‌డేను సెలబ్రెట్ చేసింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లైగర్ మూవీ టీం ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయనుంది. చదవండి: ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డేట్ ఫిక్స్, ఆ రోజే లాంచ్! ఈ నేపథ్యంలో సాయంత్రం లైగర్ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇవ్వనుంది మూవీ టీం. ఈ క్రమంలో తన బర్త్‌డే సందర్బంగా విజయ్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజు నా బర్త్‌డే. ఏంటో నా బర్త్‌డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది. ఇదే రోజు ఎఫ్ 3, మేజర్ మూవీల ట్రైలర్, అంటే సుందరికి నుంచి సాంగ్ ఈ రోజే రిలీజ్ కానున్నాయి. దీనితో పాటు బాలీవుడ్ బాలీవుడ్ చిత్రం పృథ్విరాజ్ ట్రైలర్ కూడా ఈ రోజే విడుదల’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్. కాగా ఈ రోజు మే 9న సాయంత్రం నాలుగు గంటలకు లైగర్‌కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: మదర్స్ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా So many movie promotions on my birthday! It is like a festival day 😀 Andariki Vijay Deverakonda birthday sentiment ekva ipoindi.. All will do well, I shall share my power :)#Liger #VD11 #Major #F3 #AnteSundaraniki #Prithviraj — Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రీల్ మీదకు రానున్న ‘రియల్ హీరో’ల బయోపిక్స్
కంటి నిండా నిదుర ఉండదు.. సేద తీరే తీరిక ఉండదు. కుటుంబంతో గడిపే సమయం ఉండదు... ఒక్కటే ఉంటుంది.. ‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది. అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు. చల్లగాలికీ సేద తీరరు. దేశమే కుటుంబం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదులుతారు. అందుకే ‘సెల్యూట్ సైనికా’. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్ మీదకు రానున్న ఈ ‘రియల్ హీరో’ల బయోపిక్స్ గురించి తెలుసుకుందాం. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్–పాక్ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం. భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్ మానెక్ షా’ (పూర్తి పేరు సామ్ హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌గా భారత్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్ బహదూర్’. అలాగే 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చౌఫిస్’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్రామ్ సింగ్ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్‌గా చేస్తున్నారు. దేశభక్తి సినిమా కాదు కానీ... ‘‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. -
అడివి శేష్.. మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ‘మేజర్’ విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మేజర్: సిద్ శ్రీరామ్ పాడిన రొమాంటిక్ సాంగ్ చూశారా?
Major Telugu Movie Hrudayama Lyrical Song Video Released: ముంబై 26/11 దాడుల్లో వీరోచితంగా పోరాడిన కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'మేజర్'. ఇందులో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించాడు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఇది. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఇందులో భాగంగా 'వినవే హృదయమా' అనే రొమాంటిక్ సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సాయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. -
వారు కూడా నా కుటుంబమే:అడవి శేష్
-
అడివి శేష్ ‘మేజర్’ తేదీ ఖరార్
థియేటర్స్‌లోకి వచ్చేందుకు మేజర్ సిద్ధమయ్యాడు. ముంబై 26/11 దాడుల్లో వీరోచితంగా పోరాడిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఇందులో సందీప్‌గా అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ముంబై 26/11 దాడుల్లో సందీప్ వీరోచిత పోరాటంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
బిడ్డ చదువు బాధ్యత తండ్రిదే
న్యూఢిల్లీ: కుమారుడికి 18 ఏళ్ల వయసు నిండింది, మేజర్ అయ్యాడు కదా అని తండ్రి తన బాధ్యతల నుంచి పారిపోలేడని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బిడ్డకు చదువులు చెప్పించాలి్సన బాధ్యత ఎప్పటికీ తండ్రిదేనని, ఆ ఆర్థిక భారాన్ని తల్లిపై వేయకూడదని పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఒక జంట విడాకులు తీసుకున్నాక కుమారుడి చదువు కోసం తండ్రి నెలకి రూ.15 వేలు చెల్లించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని పునఃసమీక్షించాలంటూ ఆ భర్త మళ్లీ కోర్టుకెక్కాడు. తన కుమారుడికి 18 ఏళ్ల వయసు వచ్చేవరకు, లేదంటే అతడి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు మాత్రమే చదువు కోసం తాను డబ్బులు ఇస్తానని, ఆ తర్వాత ఇవ్వలేనంటూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ విచారణ చేపట్టారు. తండ్రి తన కుమారుడి చదువు బాధ్యతల నుంచి తప్పించుకోలేరంటూ పిటిషన్‌ను కొట్టేశారు. ‘‘పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడేవరకు, సమాజంలో ఒక గుర్తింపు వచ్చేలా ఎదిగేవరకు వారి బాధ్యతను తండ్రి స్వీకరించాలి. కొడుక్కి 18 ఏళ్లు నిండాయని అతని చదువులకయ్యే ఆర్థిక భారాన్ని తల్లిపై వేయకూడదు. కుమారుడు మేజర్ అయినంత మాత్రాన అతను ఆర్థికంగా స్వతంత్రుడు కావాలన్న నిబంధన లేదు. కుమారుడు ఆర్థికంగా తల్లికి అంది వచ్చేవరకూ అతని బాధ్యత తప్పనిసరిగా తండ్రిదే. అతను ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. 1997లో వివాహమైన ఢిల్లీకి చెందిన జంటకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2011లో మనస్పర్థలతో వారు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు కుమారుడికి 20 ఏళ్లు, కుమార్తెకి 18 ఏళ్లు వచ్చాయి. విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు కొడుక్కి 18 ఏళ్లు వచ్చేవరకు, కూతురుకి ఉద్యోగం లేదా పెళ్లి జరిగేవరకు పోషణ భారం తండ్రిదేనని తీర్పు చెప్పింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్కుగా ఉన్న ఆ తల్లి తాను తన జీతంతో కొడుక్కి చదువు చెప్పించలేనంటూ హైకోర్టుకెక్కితే చదువు నిమిత్తం తండ్రి నెలకి రూ.15 వేలు ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. బాధ్యతల నుంచి పారిపోవద్దంటూ ఆ తండ్రిని కోర్టు హెచ్చరించింది. -
Major Movie: మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. ‘‘త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని బుధవారం ‘మేజర్’ టీమ్ వెల్లడించింది. ముంబయ్ 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి, ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కుతోంది. -
మేజర్ కోసం అదిరిపోయే ఆరు సెట్లు!
ముంబయ్‌లోని గేట్‌వే ఆఫ్ ఇండియా, తాజ్ ప్యాలెస్‌ని ‘మేజర్’ సినిమా కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు ఏఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 ముంబయ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో తన ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం ఆరు భారీ సెట్స్ నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్, ఎన్ఎస్జీ కమాండోలకు సంబంధించిన ‘సెట్‌ని కూడా తీర్చిదిద్దాం. ముఖ్యంగా తాజ్ ప్యాలెస్ సెట్ వేయడానికి బాగా కష్టపడ్డాం. సినిమాలో తాజ్ హోటల్ని సెట్ ప్రాపర్టీలాగా కాకుండా ఓ క్యారెక్టర్లా ఊహించుకోవాలని అడివి శేష్ చెప్పడంతో రియల్ తాజ్ ప్యాలెస్‌లా సెట్ వేశాం. తాజ్‌లో గ్రాండ్ స్టెయిర్ కేస్, టాటా ఐకానిక్ ఇమేజ్, ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్స్ వంటి వాటిని రీ–క్రియేట్ చేశాం. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్, ఉడ్, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం’’ అన్నారు. చదవండి: గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
ఆ రోజు ‘మేజర్’ డే అంటున్న మహేష్
మేజర్ సినిమా విడుదల తేదీని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించాడు. నటుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు భాగస్వామ్యం కావడంతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. జులై 2న మేజర్ ప్రేక్షకుల ముందుకు రానుననట్లు మహేష్ పేర్కొన్నాడు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ‘జూలై 2న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో మేజర్ విడుదల కానుంది’ అని ట్వీట్ చేశాడు. చదవండి: మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్! అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన మహేష్ బాబు.. ఆ రోజును 'మేజర్' డే అని తెలపడం గమనార్హం. కాగా మేజర్ సినిమా 26//11 ముంబైలో జరిగిన ఉగ్రమూకల దాడిలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో అడవి శేష్ సరసన శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో అడవి శేష్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్యాకప్ చేప్పేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2nd July 2021. The #MAJOR day 😊@adivisesh @sonypicsindia @GMBents @AplusSMovies @SashiTikka #MajorOnJuly2 pic.twitter.com/iHSDCo80uy — Mahesh Babu (@urstrulyMahesh) January 29, 2021 -
ఉన్నికృష్ణన్ ప్రయాణం
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా అడివి శేష్ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన టైటిల్ రోల్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తాజా ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శేష్ బర్త్‌డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికష్ణన్ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. వచ్చే సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. -
అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్షన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ రోజు తన బర్త్‌డే సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లుక్‌లో అడివి శేష్‌ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు `మేజర్` ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. Happy to present the first look of #Major!! Wishing you a very happy birthday @AdiviSesh. I'm sure Major will go down as one of your best performances. Good luck and happiness always! 😊 pic.twitter.com/q5BLRj8ewn — Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2020 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జర్నీని ప్రేక్షకులకుకి అందించడమే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మరణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది చిత్ర యూనిట్. 27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ లుక్ టెస్ట్ పోస్టర్‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి వెల్లడించే వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.(ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్) మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటి వరకు 70శాతం షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారు. -
ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేజర్’. ఇందులో శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ లుక్ టెస్ట్ వీడియోను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ‘మేజర్’ విశేషాలను అడివి శేష్ ఆ వీడియోలో వెల్లడిస్తూ– ‘‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 2008 నుంచి నా మైండ్‌లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ దాడి జరిగినప్పుడు అమెరికాలో ఉన్నాను. ఆ దాడిలో సందీప్ మరణించినట్లు అక్కడి న్యూస్ ఛానల్స్‌లో 27వ తేదీ ఆయన ఫోటో వేశారు. ఆయన కళ్లల్లో ఒక ప్యాషన్, స్పిరిట్ కనిపించింది. దాంతో ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్‌ను కట్ చేసి పెట్టుకున్నాను. ఆయన ఇంటర్వ్యూలు చూశాను. ‘మేజర్’ లాంటి ప్యాన్ ఇండియన్ స్టోరీ చెప్పగలననే నమ్మకం వచ్చాక సందీప్ పేరెంట్స్‌ని కలిశాను. ఆ తర్వాతే ఈ సినిమా మొదలు పెట్టాం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
అడివి శేష్ ‘మేజర్’ నుంచి రేపు బిగ్ సర్ప్రైజ్
అడివి శేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మేజర్’. గూఢచారి ఫేం శశికిరణ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్గా నటిస్తోంది. ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో వీర మరణం పొందించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు. మూవీ కోసం అడివి శేష్ తీవ్రంగా శ్రమించాడు. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. కాగా, ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. ‘మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ స్టోరీ మా చిత్రానికి స్పూర్తినివ్వడమే కాకుండా.. మార్గనిర్దేశం కూడా చేసింది. ఈ చిత్రం మన అందరి హృదయాలకు ఎందకు దగ్గరవుతుందో రేపు 10 గంటలకు చెబుతాం’ అంటూ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఓ విడియోని విడుదల చేసింది. ఇక విడియో చివరల్లో ‘ ది లుక్ టెస్ట్’ అని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే రేపు ‘మేజర్’ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ‘మేజర్’ చెప్పే విషయాలు ఏంటో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. We've embarked on a heartfelt journey of bringing Major Sandeep Unnikrishnan’s story to life. Putting in words, what we felt, our emotions & feelings, is difficult but we did try and we share that piece of our heart tomorrow. The journey begins. #MajorBeginnings #MajorTheFilm pic.twitter.com/04dRxQj6Gx — GMB Entertainment (@GMBents) November 26, 2020 -
పతాక ప్రతిష్ట
స్కూల్లో ఫస్ట్. కాలేజ్‌లో ర్యాంక్ స్టూడెంట్. బీటెక్‌లో టాపర్. అకాడమీలో మెడలిస్ట్. ఆర్మీలో మేజర్. ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఇప్పుడు.. పతాక ప్రతిష్ట! స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు మేజర్ శ్వేతా పాండే. జెండా ఆవిష్కరణ సమయంలో ప్రధానికి సహాయంగా ఉండటం కోసం దేశ రక్షణ శాఖ కొద్ది రోజుల ముందే ఆమెను ఇండిపెండెన్స్ డే కి ‘ఫ్లాగ్ ఆఫీసర్’గా ఎంపిక చేసింది. సంప్రదాయంగా వస్తున్న ‘21–గన్’ గౌరవ వందనం స్వీకరిస్తూ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ జెండాను ఆవిష్కరిస్తున్నప్పుడు ఆయనకు చేదోడుగా ఉండటం అపూర్వమైన అవకాశమే. ఆ అవకాశం మేజర్ శ్వేతా పాండేకు దక్కింది. రష్యా ‘విక్టరీ డే’ లో భారత పతాకంతో శ్వేత రష్యా రాజధాని మాస్కోలో ఈ ఏడాది జూన్ 24న జరిగిన ఆ దేశపు ‘విక్టరీ డే’ 75వ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానంపై మన దేశం నుంచి వెళ్లిన భారత సైనిక దళానికి కూడా మేజర్ శ్వేతా పాండేనే నేతృత్వం వహించారు! మన త్రివర్ణ పతకాన్ని చేతబట్టి మన దళాన్ని పరేడ్ చేయించారు. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఆర్మీలోని 505 బేస్ వర్క్‌షాప్ సైనిక అధికారి. బేస్ వర్క్‌షాప్‌లో ఆయుధాలు, యుద్ధవాహనాలు, ఇతర సాధన సంపత్తికి అవసరమైన మరమ్మతులు నిరంతరం జరుగుతుంటాయి. ఆ పనులను శ్వేతే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఆ విభాగంలో ఇ.ఎం.ఇ. (ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్) ఆఫీసర్ ఆమె. ఈ ఏడాది జరిగిన రెండు విశేష కార్యక్రమాలలోనూ (రష్యా విక్టరీ డే, భారత్ ఇండిపెండెన్స్ డే) దళాధిపతిగా, ప్రధాని సహాయక అధికారిగా శ్వేతకు ప్రాముఖ్యం లభించడానికి కారణం.. ఆమె ప్రతిభా నిబద్ధతలే. శ్వేతా పాండే 2012 మార్చిలో ఆర్మీలోకి వచ్చారు. చెన్నైలోని ‘ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ’లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే అధికారులు ఆమెలోని చురుకుదనాన్ని, క్రియాశీలతను గమనించారు. శిక్షణాకాలంలో నేర్చిన రక్షణవ్యూహాలలో శ్వేత అకాడమీలోనే టాపర్‌గా నిలిచి ‘గర్వాల్ రైఫిల్స్’ మెడల్ సాధించారు. ఇక స్కూలు, కాలేజీల్లోనయితే ప్రసంగాలలో, చర్చలలో ఆమె కనబరిచిన ప్రతిభకు దేశ విదేశాలకు చెందిన 75 పతకాలు, 250 వరకు ప్రశంసా పత్రాలు లభించాయి. బి.టెక్ (కంప్యూటర్ సైన్స్, ఆనర్స్) లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. ఆమెలోని ఈ సామర్థ్యాలన్నిటికీ పదును పెట్టింది లక్నోలోని ప్రతిష్టాత్మక ‘సిటీ మాంటిస్సోరీ స్కూల్’. శ్వేత తండ్రి రాజ్ రతన్ పాండే యు.పి. ప్రభుత్వ ఆర్థికశాఖలో అడిషనల్ డైరెక్టర్. తల్లి అమితా పాండే సంస్కృతం, హిందీ భాషల ప్రొఫెసర్. వాళ్లిద్దరి ప్రభావం కూడా శ్వేత కెరీర్‌పై ఉంది. శ్వేత పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్ లో సి.బి.ఆర్.ఎన్. (కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్) కోర్సును కూడా పూర్తి చేశారు. -
కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్న వేళ..కశ్మీర్లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం కల్నల్ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్ కాల్స్‌కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్‌లు 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన వారు. వీరితోపాటు లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్‌కు చెందిన హైదర్ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్‌కు, మేజర్ అనూజ్ సూద్ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్‌లోయలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఖాజీ (ఫైల్ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి) -
ప్యాన్ ఇండియా
ఇంతకుముందు ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులుండేవి. కేవలం రీజినల్ మార్కెట్టే ఆ సినిమాల మెయిన్ టార్గెట్. సినిమా కథలు కూడా కేవలం వాళ్లకే అన్నట్టుగా తయారయ్యేవి. కానీ గడిచిన నాలుగైదేళ్ల నుంచి ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులు తొలగిపోయాయి. హద్దులు చెరిగిపోయాయి. ఈ మార్పులో ‘బాహుబలి’ కీలక పాత్ర పోషించిందని సందేహం లేకుండా చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి అభిమానులు ఎక్కువయ్యారు. మన సినిమాకి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే మనవాళ్లు ప్యాన్ ఇండియా (దేశంలో ఎక్కువ భాషల్లో సినిమాని విడుదల చేయడం) సినిమాగా తీయడానికి సంకోచించడం లేదు. ఐదారు భాషల్లో ఏకకాలంలో సినిమాని విడుదల చేసి మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో సుమారు పది సినిమాలు ‘ప్యాన్ ఇండియా’ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్నాయి. వాటి వివరాలు. త్రిబుల్ ఆర్.. టార్గెట్ 10 ‘బాహుబలి’తో మార్కెట్ లెక్కలకి కొత్త రెక్కలిచ్చారు దర్శకుడు రాజమౌళి. కథ బావుంటే సినిమా ఏ ప్రాంతంలో తయారైనా ఆదరణ అంతటా లభిస్తుందని నిరూపించారు. ‘బహుబలి’ ఇచ్చిన నమ్మకంతోనే ప్రస్తుతం మరో ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దాదాపు పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. డార్లింగ్.. టార్గెటింగ్ వరల్డ్ ‘బాహుబలి’తో నార్త్ ఆడియన్స్‌కి కూడా ప్రభాస్ డార్లింగ్ అయిపోయారు. ‘సాహో’ సౌత్‌లో అంచనాలను అందుకోలేకపోయినా నార్త్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణతో ప్రభాస్ చేస్తున్న ‘ఓ డియర్’ ప్యాన్ ఇండియా మూవీ అయితే ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో దర్శకత్వంలో చేయనున్న సినిమా ప్యాన్ వరల్డ్. ‘ఓ డియర్’ సినిమా పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్‌తో చేయబోయేది సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమా. ‘‘ఇది ప్యాన్ వరల్డ్ మూవీ’’ అంటున్నారు నాగ్ అశ్విన్. నిశ్శబ్దంగా... ‘బాహుబలి’ తర్వాత అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ కూడా పలు భాషల్లో రిలీజ్ కానుంది. పూర్తి స్థాయిలో అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్ చిత్రమిది. ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇందులో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించారు. సినిమాలో ఆమె చిత్రకారిణి. ఇది ‘క్రాస్ ఓవర్’ మూవీ. అంటే.. పలు భాషలకు చెందినవాళ్లు కలిసి ఒకే సినిమాలో నటించడం. ఈ సినిమాలో ఎక్కువమంది హాలీవుడ్ తారలు ఉండటం విశేషం. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇస్మార్ట్ మూవ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఘనవిజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఎనర్జీతో ఉన్నారు. ఇస్మార్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో కలసి బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దీని కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా వీళ్లకు తోడయ్యారు. అనన్యా పాండే కథానాయిక. హిందీ– తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. గ్రాండ్ కమ్‌బ్యాక్ మూడేళ్ల నుంచి మంచు మనోజ్ ఎనర్జీ స్క్రీన్ మీద కనిపించడం లేదు. అయితే కమ్‌బ్యాక్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మనోజ్. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ముహూర్తం జరుపుకుంది ఈ సినిమా. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్యాన్ కన్నప్ప ‘భక్త కన్నప్ప’ పై సినిమా చేయాలని కొంతకాలంగా వర్క్ చేస్తున్నారు మంచు విష్ణు. కన్నప్ప పాత్రలో నటించి ఈ సినిమాను నిర్మించనున్నారు. సుమారు 95 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ తీయనున్నారు. భారీ స్థాయిలో ఉండేలా ప్రీ– ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. డబుల్ ప్యాన్ హిందీ–తెలుగు–తమిళం ఇలా ఏ భాషలో అయినా కనిపిస్తూనే ఉంటారు రానా. కథ నచ్చితే పాత్ర ఏదైనా డబుల్ ఓకే అంటారాయన. ప్రస్తుతం రానా ‘అరణ్య’ అనే భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. అడవులను రక్షించాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని పాత్ర కోసం 30 కిలోలు తగ్గారు రానా. హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక చిత్రంలో కనిపించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమానే. మేజర్ ప్లాన్ పరిమిత బడ్జెట్, పరిమిత వనరులతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు ‘అడవి’ శేష్. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా ఇండియన్ ఆడియన్స్‌ను తన మ్యాజిక్‌లో పడేయడానికి సిద్ధమయ్యారు శేష్. ముంబై తాజ్ హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా శేష్ టైటిల్ రోల్లో ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. కరణం.. ఆదర్శం ఒలింపిక్స్‌లో మన దేశానికి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతాకాన్ని తీసుకొచ్చారు కరణం మల్లీశ్వరి. ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె జీవితాన్ని స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారు దర్శకురాలు సంజనా రెడ్డి. సుమారు 50 కోట్ల వ్యయంతో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇవి కాకుండా మరికొన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో చెప్పాల్సిన కథలు రచయితల డ్రాయింగ్ రూమ్‌లో రెడీ అవుతూనే ఉండొచ్చు. ఇవన్నీ బాగా ఆడాలని, మన కథలు ప్రపంచస్థాయికి వెళ్లాలని, తెలుగు సినిమా పరిధి, స్థాయి, మార్కెట్, గౌరవం మరింత పెరగాలని ఆశిద్దాం. తెలుగు సినిమా జయహో! – గౌతమ్ మల్లాది -
మేజర్‌లో...
ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, తన ప్రాణాల్ని త్యాగం చేశారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అడివి శేష్ లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఘట్టమనేని మహేష్ బాబు (జి.ఎం.బి.) ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్ష¯Œ ్స, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఇందులో శోభిత ధూలిపాళ కీలక పాత్ర చేస్తున్నారని సోమవారం చిత్రబృందం తెలిపింది. ‘‘గూఢచారి’ సినిమా తర్వాత ‘మేజర్’ కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్. -
రక్షణ దళానికి త్రీస్టార్ డాక్టర్
డాక్టర్ మాధురీ కణిట్కర్ శనివారం న్యూఢిల్లీలో పదోన్నతిపై లెఫ్ట్‌నెంట్ జనరల్ బాధ్యతలు స్వీకరించగానే ఆమె భుజం మీదకు భారత సైన్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు నక్షత్రాల గుర్తు వచ్చి వాలింది. రక్షణ దళాల వైద్య సిబ్బందికి కొత్త డిప్యూటీ చీఫ్ ఇప్పుడు ఆమె! భారత రక్షణ దళాల చరిత్రలో ఇంతవరకు ఇద్దరే మహిళా లెఫ్ట్‌నెంట్ జనరల్స్. మాధురి ఇప్పుడు మూడో జనరల్ కాగా.. మాధురి, ఆమె భర్త త్రీస్టార్ ఉన్న తొలి దంపతులుగా ఇక నుంచీ గుర్తింపు పొందుతారు. మిలటరీ రంగు చీర, జాకెట్, పైన ఆర్మీ క్యాంప్ ధరించి ఉన్న మాధురికి సైనిక దళ వైద్య సేవల (ఎ.ఎఫ్.ఎం.ఎస్) డైరెక్టర్ జనరల్ లెఫ్ట్‌నెంట్ అరూప్ బెనర్జీ భుజకీర్తులను తగిలిస్తున్నప్పుడు, పక్కనే ఉన్న మాధురి భర్త రాజీవ్ కణిక్టర్ కూడా ఆమె‘ఎపలెట్స్’ (భుజంపై ప్రతిష్ట చిహ్నాలు)ని ఎంతో గర్వంగా సవరించారు. ముందు డీజీకి అభివాదం తెలియజేసి, ఆ వెంటనే ‘థ్యాంక్యూ సర్’ అని భర్తతో అన్నారు డాక్టర్ మాధురి. రాజీవ్ కూడా సైనికాధికారే. ‘ఆర్మ్డ్ కోర్స్’ లో లెఫ్ట్‌నెంట్‌గా ఉండి, 2017 లో క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా త్రీ–స్టార్ హోదాలో రిటైర్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్ మాధురికి కూడా త్రీస్టార్ రావడంతో భారత రక్షణ దళంలోనే తొలి త్రీస్టార్ కపుల్‌గా ఈ భార్యాభర్తలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందుకు దక్కవలసిన అభినందనలు పూర్తిగా మాధురికే అయినప్పటికీ, ‘‘ఉద్యోగం కష్టంగా అనిపించిన పరిస్థితుల్లో.. ‘ఇలాంటప్పుడు చేసేదే ఉద్యోగం’ అని ధైర్యం చెప్పి ఆర్మీలోంచి నన్ను బయటికి రానివ్వకుండా ఆపిన నా భర్తదే ఈ క్రెడిట్ అంతా’’ అని నవ్వుతూ అన్నారు డాక్టర్ మాధురి. త్రివిధ దళాల ‘నాడీ’మణి ఎంబీబిఎస్లో గోల్డ్ మెడల్ పెళ్లయిన 36 ఏళ్లలో 12 ఏళ్లు మాత్రమే భార్యాభర్తలుగా ఉన్నారు డాక్టర్ మాధురి, రాజీవ్. మిగతా సమయమంతా భారత సైనికులుగానే ఉన్నారు. రక్షణ దళ ఉద్యోగాల్లో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచే ఒకరిని మించిన వారొకరిగా ఉన్నారు వీళ్లు! నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి రాష్ట్రపతి గోల్డ్ మెడల్‌తో బయటికి వచ్చారు రాజీవ్. మాధురి కూడా అంతే. పుణెలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్’లో బెస్ట్ ఎం.బి.బి.ఎస్. స్టూడెంట్‌గా రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తర్వాత అదే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి డీన్, డిప్యూటీ కమాండెంట్ అయ్యారు. అలా అయిన తొలి మహిళా అధికారి కూడా ఆమే! శనివారం నాటి పదోన్నతితో రక్షణ దళాల్లోని లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకుకు చేరిన మూడో మహిళా అధికారి అయ్యారు మాధురి. తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతీ బందోపాధ్యాయ్, రెండో మహిళ వైస్ అడ్మిరల్ పునీతా ఆరోరా. వాళ్లిద్దరూ రిటైర్ అయ్యారు. సైన్యంలోని అన్ని విభాగాలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కల్పించడానికి ‘పర్మినెంట్ కమిషన్’లోకి మహిళల్ని కూడా అనుమతించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ.. భారత సైన్యంలోని మెడికల్ వింగ్‌లో మొదటి నుంచీ మహిళలకు పర్మినెంట్ కమిషన్‌లో అవకాశం ఉంది. అందువల్లే డాక్టర్ మాధురి విశిష్ట సేవలకు ఇప్పుడీ ఉన్నతస్థాయి హోదా లభించడం సాధ్యమైంది. సైకిల్‌పై షికారు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాధురి 1982లో ‘ఆర్మీ మెడికల్ కోర్స్’ (సైనిక వైద్య దళం)లోకి వచ్చారు. ఎం.డి. చేశాక, ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ నెఫ్రాలజీ (చిన్నపిల్లల మూత్రపిండ సమస్యలు)లో శిక్షణ పొందారు. ‘ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక రంగాల వినూత్న ఆవిష్కరణల సలహా మండలి’లో సభ్యులుగా ఉన్నారు. తాజా విధుల్లోకి రాకముందు వరకు ఆర్మీలోని నార్తర్న్ కమాండ్(జమ్మూకశ్మీర్, లఢక్) వైద్యసేవల విభాగానికి అధికారిగా ఉన్నారు. ‘‘అక్కడ పని చేస్తున్నప్పుడు యుద్ధక్షేత్రంలోని ప్రతికూల పరిస్థితుల్లో వైద్య సంరక్షణ ఎంత కీలకమైన బాధ్యతో తెలిసింది. అక్కడ ఏ రోజుకారోజు స్పష్టమైన అత్యున్నతస్థాయి సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పని చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ అనుభవం ఉపయోపడుతుంది’’ అని డాక్టర్ మాధురి అన్నారు. మాధురి కణిట్కర్ కర్ణాటకలోని ధర్వార్లో జన్మించారు. తండ్రి చంద్రకాంత్ గోపాల్రావ్, తల్లి హేమలతా చంద్రకాంత్ ఖోట్. కణిట్కర్ దంపతులకు 1982లో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నిఖిల్, విభూతి. -
చివరి శ్వాస వరకు ప్రేమిస్తూనే ఉంటా.. నా జీవితం నీదే
‘నువ్వేం చెప్పావ్.. నన్ను ప్రేమించాననే కదా! అయితే నాకన్నా దేశాన్నే ఎక్కువగా ప్రేమించావు. గర్వంగా ఉంది. నీ ప్రేమ గొప్పది. నువ్వెన్నడూ చూడనైనా చూడని వారి కోసం నీ ప్రాణాలను త్యాగం చేశావు. ధైర్యవంతుడివి. నీ జీవిత భాగస్వామిని అయి ఉండటం నాకొక గౌరవం. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితం నీదే’’. వైఫాఫ్ మేజర్ విభూతి శంకర్ జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందగా భర్త స్ఫూర్తితో ఆయన భార్య నిఖితా కౌల్ సైన్యంలో చేరనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. త్వరలోనే శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్లనున్నారు. ఏడాది క్రితం.. ఇదే నెలలో.. కశ్మీర్ నుంచి.. డెహ్రాడూన్ చేరుకున్న మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భౌతికకాయం ఉన్న శవపేటికపై వాలి, ఆయన భార్య నిఖితా కౌల్ అన్నమాటలివి. మనసులో అనుకోలేదు. గొణుక్కున్నట్లు అనుకోలేదు. స్పష్టంగా.. బతికున్న మనిషితో మాట్లాడినట్లే భర్తపై తన ప్రేమను వ్యక్తం చేశారు నిఖిత. గత ఏడాది ఫిబ్రవరి 18న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు శంకర్. భీకర పోరు అది. పుల్వామాలో నలభైమంది జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే–మొహమ్మద్ ఉగ్రనేత ఘాజీ రిషీద్ను నాలుగు రోజుల పాటు వెతికి వేటాడి హతమార్చాక, ఎదురు కాల్పుల్లో తనూ చనిపోయాడు మేజర్ శంకర్. అప్పటికి నిఖితతో అతడి పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. భర్త మరణవార్త ఆమెను కుదిపేసింది. అతడికి 33. ఆమెకు 27. ఇంకా చాలా జీవితం ఉంది. భర్త అంత్యక్రియల్లో నిఖిత అన్నమాట ఎవరూ మర్చిపోలేనిది. ప్రతి భారతీయుడిని ఉద్దేశించి ఆమె ఆ మాట అన్నారు. ‘‘ఇలాంటప్పుడే మనం బలంగా ఉండాలి. ఇప్పుడే మనం కలిసికట్టుగా ఉండాలి..’ అంటూ, హరిద్వార్‌లో గంగానది ఒడ్డున్న ఆయన చితికి సెల్యూట్ చేశారామె. ఆ క్షణంలోనే శత్రువుపై అంతకంతా తీర్చుకునేందుకు మానసికంగా ఆమె సైన్యంలోకి వెళ్లిపోయారు. ∙∙ ఏడాది గడిచింది. ఇండియన్ ఆర్మీలో చేరడానికి నిఖిత ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి.) పరీక్ష రాశారు. ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఒక ఎమ్.ఎన్.సి. (మల్టీ నేషనల్ కంపెనీ)లో పని చేస్తున్నారు. ఆ ఉద్యోగాన్ని వదిలి, త్వరలోనే ఆర్మీ శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి వెళ్లబోతున్నారు. ఎస్.ఎస్.సి. పరీక్ష రాస్తున్నప్పుడు.. తన భర్త కూడా ఇలాగే పరీక్ష రాసి ఉంటారు కదా అన్న ఆలోచన వచ్చి ఆయనకు తనెంతో దగ్గరగా ఉన్నట్లు అనుభూతి చెందానని నిఖితా కౌల్ అన్నారు. భర్తకు ఒక జ్ఞాపకంగా మాత్రమే ఆమె మిగిలిపోదలచుకోలేదు. భర్త మిగిల్చి వెళ్లిన బాధ్యతల్ని తుపాకీలా భుజాన మోయాలని గట్టిగానే తీర్మానించుకున్నారు. అతడు.. ఆమె.. సైన్యం ‘మీ పెళ్లయి ఎన్నాళ్లయింది?’ అడిగింది ఇంటర్వ్యూ బోర్డు. ‘దాదాపు రెండేళ్లు’ జవాబిచ్చారు నిఖిత. ‘కాని మీ పెళ్లయి తొమ్మిది నెలలైనట్టు విన్నామే’ అని ఆశ్చర్యపోయారు బోర్డు సభ్యులు.‘ నా భర్త భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినంత మాత్రాన మా పెళ్లి ముగిసినట్లు కాదు కదా?’ తిరిగి ప్రశ్నించారు నిఖిత. నిజమే.. పెళ్లయిన తొమ్మిదినెలలకే భర్త అమరుడయ్యాడు. కాని ఆమె అతని తోడును కోల్పోలేదు. దేశం పట్ల అతనికున్న భక్తి, ఆ యూనిఫామ్ అంటే అతనికున్న నిబద్ధత ఆమె మనసులో అతణ్ణి సజీవంగా ఉంచాయి. తనూ సైన్యంలో చేరడమే తన భర్తకు ఆమె ఇచ్చే ఘనమైన నివాళిగా భావించారు. నిఖిత కౌల్.. కశ్మీర్ వాసి. ఢిల్లీ దగ్గరి నోయిడాలో ఉద్యోగం.‘‘మన దేశ జెండా గుడ్డలో చుట్టి తెచ్చిన నా భర్త భౌతిక కాయాన్ని చూసినప్పుడే నిశ్చయించుకున్నాను ఆయన అడుగుజాడల్లో సాగాలని. ముందసలు నా భర్త లేడు అన్న సత్యాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నెమ్మది నెమ్మదిగా అలవాటుపడ్డాను. విభూ చాలా ప్రోగ్రెసివ్. తన కన్నా నేను గొప్పగా ఉండాలని ఆశపడేవాడు. ఆయన ఆలోచనలు, ఆశయాలే నన్ను ఇండియన్ ఆర్మీ వైపు నడిపించాయి. నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా కాదా అన్న సందేహం ఏమాత్రం వచ్చినా.. ఏ కొంచెం ఆందోళన కలిగినా వెంటనే కళ్లు మూసుకొని విభూ ఉంటే ఏం చేసేవాడు అని ఆలోచించేదాన్ని. వెంటనే నాకున్న సందేహాలు, ఆందోళన మాయం అయిపోయేవి. విభు చనిపోయాక ఆర్నెల్లకు ఎస్ఎస్సికి దరఖాస్తు చేశాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఎస్ఎస్సి ప్రిపరేషన్ ఎంతగానో ఉయయోగపడింది. నేను పరీక్ష రాస్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి హాజరవుతున్నప్పుడు విభూనే తలుచుకున్నాను.. ఈ పరీక్ష, ఇంటర్వ్యూలప్పుడు తను ఎలా ఫీలయ్యుంటాడో అని. ఆయన భయాలు, ఆందోళనలతో నేనూ కనెక్ట్ అయ్యాను. ఒకరకంగా అదే నాకు శక్తినిచ్చిందని చెప్పొచ్చు’ అంటారు నిఖితా కౌల్. -
3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో
ఎవరు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్, తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ఓ బయోపిక్‌లో నటించనున్నాడు శేష్. అశోక్ చక్ర అవార్డు పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథతో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో నటించనున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించేందుకు శేష్ తీవ్రంగా శ్రమిస్తున్నాడట. ‘నిజమైన సైనికుడిగా కనిపించేందుకు మూడు నెలల్లో 10 కిలోలు బరువు తగ్గాల్సి ఉంది. అందుకోసం స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ను సిద్ధం చేసుకొని కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నాను. అమ్మచేతి వంటను కాదనాల్సిన పనిలేదు. ఆమె కాలిఫోర్నియాలో ఉంటున్నా’రని తెలిపారు. -
మహేశ్ బ్యానర్లో శేష్
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, హీరో మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ జి.మహేశ్‌బాబు (జిఎంబి) ఎంటర్టైన్మెంట్ కలయికలో ‘మేజర్’ అనే భారీచిత్రం రూపొందనుంది. అడివి శేష్ హీరోగా నటించనున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అడివి ఎంటర్టైన్మెంట్, శరత్చంద్ర, ఎ+జి మూవీస్ సహ నిర్మాతలు. ఈ ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభించి, 2020లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ– ‘‘ప్యాడ్ మాన్, 102 నాటౌట్’ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు మలయాళ చిత్రం ‘9’ని ప్రేక్షకులకు అందించి వారికి దగ్గరయ్యాం. మన దేశంలోని వారిని, సరిహద్దులను దాటి ఉన్న భారతీయులను ఇన్స్పైర్ చేసే చిత్రం ‘మేజర్’’ అన్నారు. ‘‘మహేశ్‌గారు, నమ్రతగారితో అసోసియేట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణాని అన్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ నమ్రత మాట్లాడుతూ– ‘‘ఇండియన్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాలను తీసుకొచ్చేలా సోనీ పిక్చర్స్‌తో కలిసి ముందుకు వెళ్తాం’’ అన్నారు. -
మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ హీరోగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాక నిర్మాతగానూ మంచి ఫాం చూపిస్తున్నాడు. ఇన్నాళ్లు తన చిత్రాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన మహేష్, ఇప్పుడు ఇతర హీరోలతో, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టి చార్లీ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు సూపర్ స్టార్. క్షణం, గూఢచారి లాంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించిన అడవి శేష్ హీరోగా ఓ బయోగ్రాఫికల్ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో బాలీవుడ్ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తెలుగులోకి అడుగుపెట్టబోతోంది. అంతేకాదు ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందనుండటంతో ఈ సినిమాలో మహేష్ నిర్మాతగా బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. మేజర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరోచిత పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరోసారి అడవి శేష్ కథా కథనాలు అందిస్తున్న ఈ సినిమాకు గూఢచారి ఫేం శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశారు. అడివి ఎంటర్టైన్మెంట్స్, శరత్ చంద్ర, ఏ+ఎస్ మూవీస్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈసినిమా షూటింగ్ 2019 వేసవిలో ప్రారభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో సినిమా విడుదలకానుంది. Honoured to bring you the story of our National hero - Major Sandeep Unnikrishnan... Sending my best wishes to @AdiviSesh, director @sashikirantikka, team @GMBents, @AplusSMovies... & Congratulations @SonyPicsIndia on your debut Telugu production👍🏻#MajorTheFilm pic.twitter.com/BZf4gSE1Rn — Mahesh Babu (@urstrulyMahesh) 27 February 2019 -
మార్చి 8న పెళ్లి ఇంతలోనే ..
న్యూఢిల్లీ : మరో నెలరోజుల్లో పెళ్లి ఉందనగా.. ఓ ఆర్మీ మేజర్ ప్రమాదవశాత్తు ల్యాండ్‌మైన్ పేలి ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి పనులతో బిజీగా ఉన్న ఆ మేజర్ తండ్రి కుమారుడి మరణ వార్త విని కుప్పకూలిపోయారు. ఉగ్రదాడి జరిగిన రెండు రోజులకే చోటుచేసుకున్న ఈ ఘటన మరింత విషాదాన్ని నింపింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని రాజౌరీ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. బాంబు నిర్వీర్యం బృందాన్ని లీడ్ చేసే ఆర్మీ మేజర్ చిత్రేష్ సింగ్ బిష్త్.. ల్యాండ్‌మైన్‌ను డిఫ్యూజ్ చేయబోయే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరఖాండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 31 ఏళ్ల మేజర్‌కు మార్చి 8న వివాహం జరగాల్సింది. ఈ ఏర్పాట్లలో మునిగిపోయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన ఆయన తండ్రి.. కొడుకు మరణ వార్త విని కుప్పకూలిపోయారు. నౌషరా సెక్టరాల్‌లో శనివారం మూడు ల్యాండ్స్‌మైన్స్‌ను భద్రతా బలగాలు గుర్తించగా.. వాటిని తొలిగించేందుకు మేజర్ చిత్రేష్ బృందం అక్కడికి వచ్చిందని, ఒకటి విజయవంతంగా తొలిగించిందని, రెండోదాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదావశాత్తు పేలిందని ఓ ఢిఫెన్స్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మేజర్ చిత్రేష్ సింగ్ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారని తెలిపారు. ఇక మేజర్ చిత్రేష్ మరణ వార్త తెలుసుకున్న ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. -
హెచ్1 బీ- ట్రంప్ కొత్త ప్రతిపాదనలు
వాషింగ్టన్: అమెరికాఅధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి హెచ్1బీ వీసా జారీ విధానం సంస్కరణపై కసరత్తు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరోసారి కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. హెచ్1 బీ వీసా జారి విధానానికి సంబంధించిన నిబంధనల్లో తాజా మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రతిపాదనలతో శుక్రవారం ఒక నోటీసు జారీ చేసింది. ముఖ్యంగా విదేశీ కార్మికుల్లో అత్యున్నత నైపుణ్యం, అత్యధిక జీతం పొందేవారికి మాత్రమే హెచ్1 బీ వీసాలు జారీ చేస్తామని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. కాంగ్రెస్ నిర్ణయించే పరిమితి మేరకు విదేశీ కార్మికులకు హెచ్1 బీ వీసా ఇచ్చే సమయంలో ఈ నిబంధనలను పాటించాలని పేర్కొంది. యూఎస్సీఐఎస్ నిర్ణయించే తేదీల్లో విదేశీయులు ఎలక్ర్టానిక్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఏడాదికి 65వేల వీసాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అనుమతి ఉంది. అయితే అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న 20వేల దరఖాస్తులను ఈ పరిమితి నుంచి మినహాయిస్తారు. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన 139పేజీల డాక్యుమెంట్‌లోని కొత్త ప్రతిపాదనలపై డిసెంబర్ 3 నుంచి జనవరి 2వ తేదీ మధ్య ప్రజలు తమ అభిప్రాయం తెలుపవచ్చని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. -
పెళ్లికి నిరాకరించిందని ఆర్మీ మేజర్ కిరాతకం
న్యూఢిల్లీ : ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ హత్య కేసులో ప్రధాన నిందుతుడు మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శైలజ, నిఖిల్ హండాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతోనే నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్మీ మేజర్‌గా పనిచేస్తున్న నిఖిల్ హండాకు 2015లో నాగలాండ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే సమయంలో శైలజ భర్త మేజర్ ద్వివేదికి కూడా నాగలాండ్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా నిఖిల్, శైలజల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత నిఖిల్, శైలజను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ శైలజ అందుకు అంగీకరించలేదు. అయితే వీరిద్దరి స్నేహం గురించి శైలజ భర్త మేజర్ ద్వివేదికి తెలిసింది. దాంతో అతడు శైలజ, నిఖిల్ల మధ్య ఎటువంటి కాంటక్ట్ ఉండకూడదని వారించాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నిఖిల్ కొడుకు ఆరోగ్యం పాడవడంతో అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సమయంలో శైలజ కూడా ఢిల్లీలోనే ఉంది. కొడుకు వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన నిఖిల్ శైలజకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరాడు. దాంతో గత శనివారం శైలజ ఇంట్లో ఫిజియోథెరపికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చింది. అయితే శైలజను ఫిజియోథెరపికి తీసుకెళ్లడానికి ద్వివేది ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేశాడు. ఫిజియోథెరపి కోసం వెళ్లిన శైలజ తిరిగిరాలేదని తెలిపాడు డ్రైవర్. ఫిజియోథెరపీ కోసం వెళ్లిన శైలజ నిఖిల్ హండాను కలిసింది. ఆ సమయంలో నిఖిల్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శైలజను కోరాడు. ఈ విషయం గురించి వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. శైలజ వివాహనికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన నిఖిల్ వెంట తెచ్చుకున్న కత్తితో శైలజ గొంతు కోసి చంపాడు. శైలజ మరణాన్ని ఆక్సిడెంట్‌గా చిత్రికరించడానికి ఆమె మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు.అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లి తన కుమారున్ని కలిసి యథాప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న మీరట్(ఉత్తరప్రదేశ్)కు వెళ్లి పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం రోడ్డు మీద శైలజ మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మరణించిన వ్యక్తిని శైలజగా గుర్తించి, కేసు నమోదు చేశారు. శైలజ భర్త మేజర్ ద్వివేది, నిఖిల్ హండా మీద అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇలోపు శైలజ ఫోన్లో నిఖిల్ హండాకు, శైలజకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలించిన పోలీసులు నిఖిల్ హండాను నేరస్తుడిగా నిర్ధారించారు. దాంతో ఒక పోలీసులు బృందం ఆదివారం మీరట్ వెళ్లి నిఖిల్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. -
కంటోన్మెంట్ ఏరియాలో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని శివారులో కలకలం రేగింది. ఓ ఆర్మీ అధికారి భార్య హత్య ఉదంతం కంటోన్మెంట్ ప్రాంతంలో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. నైరుతి ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ వద్ద శనివారం ఓ మహిళ యాక్సిడెంట్లో మృతి చెందింది. అయితే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె గొంతు కోసి ఉండటాన్ని గమనించారు. దీంతో హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 30 ఏళ్ల సదరు మహిళ స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి ఫిజియోథెరపీ సెషన్ కోసం వెళ్లారు. ఆమె భర్త మేజర్ కావటంతో అధికారిక వాహనంలో ఆమెను డ్రైవర్ ఆస్పత్రి వద్ద డ్రాప్ చేశాడు. అయితే అరగంట తర్వాత ఆమె ప్రమాదానికి గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆమె గొంతుపై కత్తిగాట్లను గమనించారు. ముందు ఆమెను హత్య చేసి, ఆపై వాహనాన్ని ఆమె మీదుగా పోనిచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. మేజర్‌కు సమాచారం అందించిన పోలీసులు.. మృత దేహాం ఆయన భార్యదేనని నిర్ధారించారు. ఆపై పోస్టు మార్టానికి మృతదేహాన్ని తరలించి కేసును నమోదు చేసుకున్నారు. ఫోన్ కాల్ లిస్ట్, సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. ఆర్మీ మేజర్ అరెస్ట్... ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ అందింది. ఈ కేసుకు సంబంధించి ఇండియన్ ఆర్మీ మేజర్ నిఖిల్ హందాను మీరట్‌లోని దౌరాలాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ప్రాజెక్టులకు వరద నష్టం రూ.112 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టంపై నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తంగా రూ.112 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తేల్చింది. వరద నష్టంపై అంచనాలకోసం ఈ నెల 13, 14 తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ వరద నష్టం అంచనాలను సిద్ధం చేసింది. మేజర్ ప్రాజెక్టులకు 32 చోట్ల నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటి పునరుద్ధరణకు రూ.54.73 కోట్లు అవసరం ఉంటుందని లెక్కకట్టింది. ఇందులో రూ.50 కోట్లు కేవలం మిడ్‌మానేరు ప్రాజెక్టులో తెగిన కట్టకే అవసరమని పేర్కొంది. మీడియం ప్రాజెక్టుల కింద మొత్తంగా 5 చోట్ల నష్టం ఉందని, వాటికి మరో రూ.26 లక్షలు అవసరమని తెలిపింది. ఇక మైనర్ ఇరిగేషన్ కింద మొత్తంగా 671 చెరువుల పరిధిలో నష్టం జరిగిందని, వీటి పునరుద్ధరణకు రూ.57.58 కోట్లు అవసరమని తెలిపింది. మొత్తంగా రూ.112.88 కోట్లు అవసరం ఉంటాయని లెక్కకట్టింది. ఈ మేరకు బుధవారం నష్టం అంచనాలను ప్రభుత్వానికి అందజేసింది. -
‘కాకినాడ’ పీఠం కైవసమే లక్ష్యం
అధికార పార్టీ వైఫల్యాల్నీ, వంచననూ ఎండగట్టాలి మెజారిటీ డివిజన్లూ, మేయర్ స్థానమూ గెలవాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేతల పిలుపు కాకినాడ: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లలో గెలుపుతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బొత్స మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్ళ పాలనలో తుంగలో తొక్కి, ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు ఐకమత్యంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. సమర్థులే అభ్యర్థులు : ధర్మాన పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను సర్వేలు, ఇతర అంశాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థి గుణగణాలతోపాటు ప్రజలతో ఉండే సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మరో పరిశీలకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని శత్రువుగా చూసే ధోరణిలో పాలన సాగిస్తున్న చంద్రబాబు హయాంలో ఎన్నికలు యుద్ధంలా జరుగుతున్నాయని, కేడర్ సైనికుల్లా పనిచేయాల్సి అవసరం ఉందని చెప్పారు. జన్మభూమి కమిటీల ద్వారా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీట్ లెవెల్లో పార్టీ శ్రేణులతో కమిటీలు వేయాలన్నారు. మరో ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ నేతలు ఐక్యతతో పనిచే సి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు. ‘స్మార్ట్ సిటీ’ ప్రచారార్భాటమే : కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ద్వారా రూ.386 కోట్లు విడుదలైనట్టు గొప్పలు చెబుతూ ఇప్పటి వరకు పట్టుమని రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన టీడీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి గెలుపుబాట పట్టాలన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ద్వారా అధికార పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యులున్నందున కనీసం 35 స్థానాల్లో గెలుపును లక్ష్యంగా భావించాలన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోపాటు ఇతర వైఫల్యాలను, స్మార్ట్‌సిటీ పేరుతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న విధానాలను ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయన్నారు. అమర జవాన్లకు నివాళి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా, రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ నగర ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు సునీల్, అక్బర్ అజామ్ తదితరులు ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పిస్తూ శశిధర్ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ పెద్దాపురం, జగ్గంపేట కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, మట్టా సుజాత, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, మీసాల దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
అత్యాచార కేసు నిందితుడు రాకేశ్ మేజరే?
ఓటు వేసినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు శంకరపట్నం: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు యువతిపై సామూహిక అత్యాచార కేసులో నిందితుడు ముద్దం రాకేశ్ మేజర్ అనే కీలక ఆధారాలు పోలీసులు సేకరించినట్లు సమాచారం. వీణవంక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు శంకరపట్నం మండలం ఆముదాలపల్లెకు చెందిన గొట్టె శ్రీనివాస్, కల్వల గ్రామానికి చెందిన ముద్దం అంజి, ముద్దం రాకేశ్ వెళ్తున్నారు. ఫిబ్రవరి 10న సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్న ఆరోపణతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో అంజి ఉరఫ్ అంజన్న, రాకేశ్ మైనర్లని పోలీసు అధికారులు జువైనల్ హోంకు తరలించారు. బాధిత యువతి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో శని వారం పోలీసులు రాకేశ్ వయసు నిర్ధారణపై ఓటరు జాబితా పరిశీలించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసినట్లు ప్రచారం కావడంతో కేశవపట్నం పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఫోరెన్సిక్ వైద్య పరీక్షల్లో ముద్దం అంజి మేజర్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాకేశ్‌కు 23 ఏళ్లు ఉన్నాయనే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు వివరాలను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. -
అంజయ్య మైనర్ కాదు.. మేజరే..!
* గ్యాంగ్‌రేప్ నిందితుడిపై ఫోరెన్సిక్ నివేదిక * జువైనల్ హోం నుంచి కోర్టుకు తరలించే అవకాశం..? * జాతీయ ఎస్సీ కమిషన్‌కు బాధితురాలు ఫిర్యాదు * వివరాలు తెలుసుకున్న కమిషన్ సభ్యురాలు కమలమ్మ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుడు ముద్దం అంజయ్య అలియాస్ అంజి మైనర్ కాదని తేలింది. అంజయ్య మేజర్ అని, ఆయన వయస్సు 19 నుంచి 21 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగం తేల్చింది. ఈ మేరకు నివేదికను జిల్లా పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఈ కేసును నేరుగా విచారిస్తున్న ఎస్పీ జోయల్ డేవిస్ నిందితుడు అంజయ్య వయస్సు నిర్ధారణపై ప్రత్యేకంగా పోలీసులను పంపించి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అంజయ్య మైనర్ అంటూ జువైనల్ హోంకు పోలీసులు తరలించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సం ఘాలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసును నీరుగార్చేందుకు నిందితులను మైనర్లుగా చిత్రీకరిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితుడి వయస్సు నిర్ధారించాలంటూ ఎస్పీ వైద్యశాఖకు లేఖ రాశారు. దీంతో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో నాలుగు రోజులుగా నిందితుడి వెంట్రుకలు, ఎముకలు, లింగనిర్ధారణ వంటి పరీక్షలు చేశారు. వీటి ఆధారంగా అంజ య్యకు 19 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుం దని నిర్ధారిస్తూ నివేదిక రూపొం దించారు. ఆ నివేదికను శుక్రవారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గతవారం రోజులుగా నింది తుడి వయస్సుపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. బాధితురాలికి న్యాయం అందేలా చూస్తాం: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చ ల్లూరు గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతికి పూర్తి న్యాయం అందేలా చూస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ అన్నారు. సామూహిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ శుక్రవారం బాధిత దళిత యువతి, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. బాధిత యువతి, కుటుంబ సభ్యులు, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లు ఎర్రమంజిల్కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని కమలమ్మ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సమాజంలో స్త్రీలకు రక్షణలేదని, ముఖ్యంగా నిమ్నజాతుల స్త్రీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని కమలమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై తనకు పూర్తి నివేదిక అందలేదని, తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం నిందితు ల్లో ఒక్కర్ని మేజర్‌గా చూపించారని, మిగిలిన వారిని మైనర్లుగా చూపుతున్నారన్నారు. నేడు (శనివారం) ఉదయం 11:30 నిమిషాలకు కరీంనగర్ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను అమీర్‌పేటలోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించినట్టు ఆమె చెప్పారు . బాధితురాలు మాట్లాడుతూ తనకు జరి గిన అన్యాయం మరెవరికీ జరగకుండా నిందితులకు కఠిన శిక్షవిధించాలని డిమాండ్ చేసింది. కమిషన్సభ్యురాలు కమలమ్మ తనకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిందని తెలిపారు. -
ఎస్బీఐలో మళ్లీ మంటలు
సాక్షి, చెన్నై :చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ప్రధాన కార్యాలయం శనివారం మంటల్లో చిక్కిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది వీరోచిత శ్రమతో పెను నష్టం తప్పింది. ఆ భవనం రెండు, మూడు అంతస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే, ఖాతాదారుల నగదు, నగలకు ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. అక్కడి క్యాంటీన్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను చాకచక్యంగా అగ్నిమాపక సిబ్బంది తరలించి, పెను ప్రమాదం నుంచి ఆ భవనాన్ని తప్పించారు. ఇక ప్రమాదం తప్పినట్టేనని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషించే పనిలో పడ్డారు. రెండో అంతస్తులో పాత ఫర్నిచర్ ఉంచిన గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందన్న భావనలో పడ్డారు. రాత్రి కావడంతో అక్కడి నుంచి అగ్నిమాపక వాహనాలు కదిలాయి. తదుపరి కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించే పనిలో ఎస్బీఐ అధికారులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ మళ్లీ మంటలు చెలరేగడం ఆ పరిసరాల్లో కలకలం సృష్టించింది. పేలుడు శబ్దం: అర్ధరాత్రి సరిగ్గా రెండున్నర గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఆ భవనం నుంచి మంటలు చెలరేగడాన్ని ఆ పరిసరవాసులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి మళ్లీ అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది పరుగులు తీశారు. రాత్రి నుంచి ఉదయం ఏడు గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ పరిసరవాసులకు రాత్రంతా కునుకు లేదు. అలాగే, మంటలు మొదటి అంతస్తులోకి వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. అయితే, రెండో సారి మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం గ్యాస్ సిలిండర్ అని తేలింది. శనివారం క్యాంటీన్ నుంచి రెండు సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, ఆ క్యాంటీన్ సిబ్బంది మరో సిలిండర్‌ను రహస్యంగా ఉంచి మరచినట్టున్నారు. దీంతో ఆ సిలిండర్ అర్ధరాత్రి వేళ పేలి మరో మారు అందరినీ వణికించేలా చేసింది. ప్రమాదం అంచున భవనం తొలిసారి ప్రమాదానికే మూడో అంతస్తు గోడలు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి సిలిండర్పేలిన దాటికి రెండో అంతస్తు భవనం ప్రమాదం బారిన పడింది. ఆ పురాతన భవనం పూర్తిగా ప్రమాదం అంచుకు చేరడంతో, ఇక్కడ బ్యాంకు నిర్వహణ అనుమానంగా మారింది. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న ఎస్బీఐ అధికారులు మొదటి, రెండు, మూడు అంతస్తుల్లో కీలక పరిశీలనలు జరిపారు. కొన్ని బీరువాల్ని మరో చోటకు సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యామ్నాయంగా బ్యాంక్ నిర్వహణ వ్యవహారాలను మరో చోటకు తాత్కాలికంగా మార్చేందుకు కసరత్తులు వేగవంతం చేశారు. బ్యాంకు మంటల్లో చిక్కిన సమాచారంతో ఖాతా దారులు ఉదయాన్నే అక్కడికి పరుగులు తీశారు. ఆ బ్యాంక్‌లో ఉన్న తమ నగదు, నగలు ఏమయ్యాయో ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే, బ్యాంక్ అధికారుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు బ్యాంక్ ఉన్నతాధికారి ప్రకాష్ రావు జోక్యం చేసుకుని ఖాతాదారులను బుజ్జగించారు. నగదు, నగలు సురక్షితంగా ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇక, ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు బ్యాంక్ అధికారుల నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సోమవారం రంగంలోకి దిగనుంది. అలాగే, పోలీసులు సైతం విచారణను వేగవంతం చేశారు. అన్నీ సురక్షితం అగ్ని ప్రమాదం జరిగిన ఎస్బీఐలో రికార్డులు, లాకర్లు, నగదు, నగలు అన్నీ సురక్షితంగా ఉన్నాయని ఆ బ్యాంక్ ఉన్నతాధికారి సూర్య ప్రకాష్ రావు స్పష్టం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఖాతాదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నీ సురక్షితంగా ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ 48 గంటల్లో మరో బ్రాంచ్‌కు మార్చడం జరుగుతుందన్నారు. ఈ వివరాలను ఖాతాదారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ భవనాన్ని ఐఐటీ నిపుణులు పరిశీలించారు. పురావస్తు విభాగం అధికారుల పరిశీలనానంతరం ఈ భవనం గురించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. -
మేజర్ ముకుంద్ ఇంటికి భద్రత
టీనగర్, న్యూస్‌లైన్:కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో హతమైన మిలిటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇంటికి సైనిక భద్రత కల్పించారు. ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్ కాలనీ పార్క్‌వ్యూ అపార్టుమెంట్స్‌లో ముకుంద్ కుటుంబం నివసిస్తోంది. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వరదరాజన్ కుమారుడు ముకుంద్ వరదరాజన్(32). ఈయన ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. ఈయన భార్య ఇందు, కుమార్తె హర్షియ(3)తో బెంగళూరులోని మిలటరీ క్వార్టర్స్‌లో నివసించేవారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం కాశ్మీర్లో తీవ్రవాదుల కాల్పుల్లో ముకుంద్ వరదరాజన్ అమరుడయ్యూరు. ముకుంద్ వరదరాజన్ మృతదేహం చెన్నైలోని ఆయన ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ముకుంద్ తల్లి కేరళకు చెందిన మహిళ. ఆమె కుటుంబ స్నేహితుడైన కేరళ సీఎం ఉమెన్చాండీ ముకుంద్ తల్లిదండ్రులను, అతని భార్యను ఓదార్చారు. ప్రస్తుతం ముకుంద్ ఇంటికి భద్రతగా ఇద్దరు జవాన్లను నియమించారు. వీరు బయటి వ్యక్తులను ఎవ్వరినీ ఇంటిలోకి అనుమతించడం లేదు.