
శోభిత ధూలిపాళ
ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, తన ప్రాణాల్ని త్యాగం చేశారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అడివి శేష్ లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఘట్టమనేని మహేష్ బాబు (జి.ఎం.బి.) ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్ష¯Œ ్స, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఇందులో శోభిత ధూలిపాళ కీలక పాత్ర చేస్తున్నారని సోమవారం చిత్రబృందం తెలిపింది. ‘‘గూఢచారి’ సినిమా తర్వాత ‘మేజర్’ కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్.
Comments
Please login to add a commentAdd a comment