nsg commando
-
దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు
-
మేజర్‌లో...
ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురి ప్రాణాల్ని కాపాడి, తన ప్రాణాల్ని త్యాగం చేశారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్.జి.) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అడివి శేష్ లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఘట్టమనేని మహేష్ బాబు (జి.ఎం.బి.) ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్ష¯Œ ్స, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఇందులో శోభిత ధూలిపాళ కీలక పాత్ర చేస్తున్నారని సోమవారం చిత్రబృందం తెలిపింది. ‘‘గూఢచారి’ సినిమా తర్వాత ‘మేజర్’ కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్. -
కమాండో అర్జున్ పండిట్
మైనస్ పది డిగ్రీల చలిలో దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఎన్.ఎస్.జీ కమాండో అర్జున్ పండిట్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కోసం కష్టపడుతున్నారు. మరి.. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు? అనేది వెండితెరపై తెలుస్తుంది. ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ ముఖ్య తారలుగా ‘వినాయకుడు’ ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్, ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి. బిహెచ్, సతీష్ డేగలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు నిర్మాతలు. ఈ సినిమాకి పని చేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో రానా విడుదల చేశారు. అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జీ కమాండోగా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం మైనస్ పది డిగ్రీల చలిలో షూటింగ్ జరుపుతున్నాం. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కల్పిత కథ ఇది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
ఉగ్రవేటకు బ్లాక్ క్యాట్ కమెండోలు
శ్రీనగర్/ న్యూఢిల్లీ/ ముంబై: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పుందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 24 మంది ఎస్ఎస్జీ కమెండోల బృందాన్ని కశ్మీర్‌కు పంపిందని తెలిపారు. వీరు త్వరలోనే భద్రతాబలగాలతో కలసి ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొంటారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి ఎన్ఎస్జీ కమెండోల సంఖ్యను 100కు పెంచే అవకాశముందని వెల్లడించారు. ఉగ్రవాదులు ప్రజల్ని బందీలుగా చేసుకుంటే లేదా విమానాల హైజాకింగ్‌కు పాల్పడితే వెంటనే ఘటనాస్థలికి చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం కమెండోలను శ్రీనగర్ విమానాశ్రయంలో మోహరించామన్నారు. ఎన్ఎస్జీ కమెండోల వద్ద ఉన్న గోడల్ని స్కానింగ్చేసే రాడార్లు, స్నైపర్ తుపాకులు, ఇంటి మూలల్లో నక్కిన ఉగ్రవాదుల్ని కాల్చగలిగే తుపాకులతో ఉగ్ర ఆపరేషన్లలో బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే యాత్రకు వాడే వాహనాల గమనాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ స్టిక్కర్లను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. 10–15 డ్రోన్లను వినియోగించడంతో పాటు ఎమర్జెన్సీ నంబర్ 1364ను యాత్రికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేర్పాటువాదుల అరెస్ట్ జమ్మూకశ్మీర్‌లో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారితో పాటు ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు కశ్మీరీల మృతికి నిరససగా వేర్పాటువాదులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను కోఠిబాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాజ్ ఉమర్ ఫారుఖ్‌ను ఆయన స్వగృహంలో నిర్బంధించారు. అతివాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఇప్పటికే గృహనిర్బంధంలో ఉన్నారు. సీఎం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా, వేర్పాటువాదుల పిలుపుతో కశ్మీర్ లోయలో మార్కెట్లు, దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శుక్రవారం అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. గవర్నర్ పాలన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, కశ్మీరీలను మరింత అణచేందుకే జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారని పాకిస్తాన్ విమర్శించింది. -
ఎన్ఎస్జీ కమాండో చెల్లెలు ఐసిస్‌లో చేరిక?
ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్లలో ఒకరు దేశం కోసం పోరాడుతుంటే.. మరొకరు దేశం మీద పోరాటం కోసం ఉగ్రవాద సంస్థకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కేరళలోని రెండు జిల్లాల నుంచి దాదాపు 20 మందికి పైగా యువతీ యువకులు ఇటీవల అదృశ్యం అయిన విషయం తెలిసిందే. వాళ్లంతా ఐఎస్‌లో చేరడానికి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. వారిలో బిందుకుమార్ కుమార్తె ఒకరు. తన కుమార్తెకు వచ్చే నెలతో 24 ఏళ్లు నిండుతాయని, ఆమెను వెతకడంలో దేవుడే దిక్కని బిందుకుమార్ అన్నారు. ఆమె కొడుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)లో కమాండోగా పనిచేస్తున్నారు. తాను కూడా ఆర్మీలో చేరుతానని తన కూతురు నిమిష చెబుతూ ఉండేదని, ఎప్పుడూ సరదాగా ఉండే ఆమె.. ఇలా అవుతుందని ఊహించలేదని ఆమె వాపోయారు. కేరళ నుంచి వెళ్లిపోయిన 20 మందిలో ఇద్దరు మాత్రం తమ బంధువులకు మెసేజిలు పంపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తే.. అఫ్ఘానిస్థాన్, ఈజిప్టుల నుంచి అని తేలింది. తన పిల్లలిద్దరికీ దైవభక్తితో పాటు దేశభక్తి కూడా బాగా ఉందని ఆమె చెప్పారు. ఆమె భర్త కేరళలో చిన్న రెస్టారెంటు నడిపిస్తుంటారు. జూన్ 3వ తేదీన వాళ్లకు తమ కూతురి నుంచి చివరి మెసేజ్ వచ్చింది. తర్వాతిరోజు ఆమెకు ఫోన్ చేస్తే, అది స్విచాఫ్ చేసి ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ ఆమె ఫోన్ కలవలేదు. గత నవంబర్ నుంచి ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడటం మానేసింది. ఎందుకని ఆమె బీడీఎస్ చదువుతున్న కాలేజికి వెళ్లి కనుక్కుంటే.. పెళ్లి కోసం ఆమె ఇస్లాం మతంలోకి మారిందని తెలిసింది. అది వాళ్లకు పెద్ద షాక్. ఎజా అనే ఎంబీయే కుర్రాడిని పెళ్లి చేసుకోడానికి ఆమె ఫాతిమా అని పేరు మార్చుకుంది. అంతలోనే ఏమైందో తెలియదని.. తన కూతురు ఐఎస్‌లో చేరిందని అంటున్నారని బిందు కుమారి వాపోతున్నారు.