టాలీవుడ్ నేచురల్ బ్యూటీ ఈ దీపావళికి అభిమానులను పలకరించనుంది. కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీనే రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అమరన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమరన్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భావోద్వేగాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మేజర్ కుటుంబాన్ని కలిసినప్పుడు తాను ఏవిధంగా ఫీలయ్యిందో చెప్పుకొచ్చారు.
సాయిపల్లవి మాట్లాడుతూ.. 'అమరన్ మూవీ భాగంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీని కలిశా. ఆయన గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నా. ఆయన జీవితం గురించి తెలిశాక బాధగా ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టకూడదని డిసైడ్ అయ్యా. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని వాళ్లు ఎంతో గర్వంగా చెప్పారు. ఇదే విషయాన్ని మేజర్ తండ్రి వరదరాజన్ ఎక్కడికెళ్లినా గర్వంగా చెబుతుంటారు. వాళ్లకి లోపల చాలా బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించరు. ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని' అన్నారు.
పాత వీడియో వైరల్..
అయితే గతంలో సాయిపల్లవి ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మన జవాన్లను టెర్రరిస్ట్‌లతో పోల్చిందంటూ నెటిజన్స్ ఆమెను తప్పు పడుతున్నారు. గతంలో ఆమె విరాటపర్వం సినిమా నాటి వీడియో.. తాజాగా అమరన్ రిలీజ్ సందర్భంగా నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే.
ఆ వీడియో సాయిపల్లవి మాట్లాడుతూ.. 'పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు.. మన జవాన్లు టెర్రరిస్ట్‌లు అని అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. వాళ్లకు ఏమైనా హాని చేస్తామని భావిస్తారు. అదే సమయంలో మనకు కూడా వాళ్లు అలానే కనిపిస్తారు. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు రైట్..? ఎవరు రాంగ్..? అని నేను చెప్పలేను.’ అని ఆమె అన్నారు.
కావాలనే చేస్తున్నారు..
అయితే సాయిపల్లవి కామెంట్స్‌పై బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లే కొందరు కావాలని అలా ప్రచారం చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది. అయితే సాయిపల్లవి బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్మీపై ఆమె చేసిన కామెంట్స్ వల్ల సీత పాత్రలో సాయి పల్లవిని తొలగించాలంటూ కొందరు కావాలనే టార్గెట్ చేశారని మరికొందరు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment