Adivi Sesh Major Movie Release Date Announed By Mahesh Babu - Sakshi
Sakshi News home page

ఆ రోజు ‘మేజర్‌’ డే అంటున్న మహేష్‌

Published Fri, Jan 29 2021 2:20 PM | Last Updated on Fri, Jan 29 2021 3:24 PM

Mahesh Babu Announces Major Movie Release date - Sakshi

మేజర్‌ సినిమా విడుదల తేదీని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రకటించాడు. నటుడు అడివి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు భాగస్వామ్యం కావడంతో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ‘గూఢచారి’ ఫేమ్‌ శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. జులై 2న మేజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుననట్లు మహేష్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ‘జూలై 2న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో మేజర్‌ విడుదల కానుంది’ అని ట్వీట్‌ చేశాడు. చదవండి: మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌!

అయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన మహేష్ బాబు.. ఆ రోజును 'మేజర్' డే అని తెలపడం గమనార్హం. కాగా మేజర్‌ సినిమా 26//11  ముంబైలో జరిగిన ఉగ్రమూకల దాడిలో వీర మరణం పొందిన మేజర్‌  సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో అడవి శేష్ సరసన శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో అడవి శేష్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్యాకప్‌ చేప్పేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement