అడివి శేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మేజర్’. గూఢచారి ఫేం శశికిరణ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో వీర మరణం పొందించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు. మూవీ కోసం అడివి శేష్ తీవ్రంగా శ్రమించాడు. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. కాగా, ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది.
‘మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ స్టోరీ మా చిత్రానికి స్పూర్తినివ్వడమే కాకుండా.. మార్గనిర్దేశం కూడా చేసింది. ఈ చిత్రం మన అందరి హృదయాలకు ఎందకు దగ్గరవుతుందో రేపు 10 గంటలకు చెబుతాం’ అంటూ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఓ విడియోని విడుదల చేసింది. ఇక విడియో చివరల్లో ‘ ది లుక్ టెస్ట్’ అని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే రేపు ‘మేజర్’ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ‘మేజర్’ చెప్పే విషయాలు ఏంటో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
We've embarked on a heartfelt journey of bringing Major Sandeep Unnikrishnan’s story to life. Putting in words, what we felt, our emotions & feelings, is difficult but we did try and we share that piece of our heart tomorrow.
— GMB Entertainment (@GMBents) November 26, 2020
The journey begins.
#MajorBeginnings
#MajorTheFilm pic.twitter.com/04dRxQj6Gx
Comments
Please login to add a commentAdd a comment