
ఎవరు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్, తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ఓ బయోపిక్‌లో నటించనున్నాడు శేష్. అశోక్ చక్ర అవార్డు పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథతో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో నటించనున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించేందుకు శేష్ తీవ్రంగా శ్రమిస్తున్నాడట. ‘నిజమైన సైనికుడిగా కనిపించేందుకు మూడు నెలల్లో 10 కిలోలు బరువు తగ్గాల్సి ఉంది. అందుకోసం స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ను సిద్ధం చేసుకొని కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నాను. అమ్మచేతి వంటను కాదనాల్సిన పనిలేదు. ఆమె కాలిఫోర్నియాలో ఉంటున్నా’రని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment