Evaru Movie
-
క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్‌గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్‌లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్‌గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్‌గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్‌ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్‌రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్‌ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్‌గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్‌గా చూపించేసి ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్‌లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్‌తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్‌తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్‌కి ఫోకస్‌ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్‌కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్‌ప్లే నే భలే ట్విస్ట్‌గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్‌లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్‌లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్‌తో…ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్‌కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
కన్నడంలోకి ఎవరు
గత ఏడాది మంచి విజయం సాధించిన సినిమాల్లో అడవి శేష్ నటించిన ‘ఎవరు’ ఒకటి. వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. స్పానిష్ చిత్రం ‘ది ఇన్ విజిబుల్ గెస్ట్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ‘ఎవరు’లోని ట్విస్ట్ లు తెలుగు ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేశాయి. ఆ థ్రిల్ ను కన్నడ ఆడియన్స్ కూడా ఆస్వాదించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రం కన్నడంలో రీమేక్ కానుంది. దిగంత్ అనే కన్నడ నటుడు ఈ రీమేక్ లో హీరోగా కనిపిస్తారట. దర్శకుడు, ఇతర నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ ఎవరు
-
సాహోపై కేటీఆర్ కామెంట్
బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో.. చిత్రం గతవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డివైడ్ టాక్ వచ్చినా... వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 300కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వీక్షించిన కేటీఆర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సాహో టెక్నికల్‌గా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించాడు. ఈ సినిమాతో పాటు ‘ఎవరు’ ను వీక్షించినట్టు తెలిపాడు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమా బ్రిలియెంట్‌గా తెరకెక్కించారంటూ.. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర అద్భుతంగా నటించారని ట్వీట్ చేశాడు. ఎవరు చిత్రం వసూళ్ల పరంగా దుమ్ములేపగా.. ప్రస్తుతం సాహో కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. Watched two fabulous Telugu movies today; #Saaho was technically brilliant & raised the bar for movie makers in India. Compliments to #Prabhas and #Sujeeth 👍#Evaru was brilliant for its gripping screenplay & fabulous performances by @AdiviSesh @reginacassandra @Naveenc212 👍 — KTR (@KTRTRS) September 1, 2019 -
3 నెలల్లో 10 కిలోలు తగ్గాలి : హీరో
ఎవరు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్, తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. తొలిసారిగా ఓ బయోపిక్‌లో నటించనున్నాడు శేష్. అశోక్ చక్ర అవార్డు పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథతో తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో నటించనున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించేందుకు శేష్ తీవ్రంగా శ్రమిస్తున్నాడట. ‘నిజమైన సైనికుడిగా కనిపించేందుకు మూడు నెలల్లో 10 కిలోలు బరువు తగ్గాల్సి ఉంది. అందుకోసం స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ను సిద్ధం చేసుకొని కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నాను. అమ్మచేతి వంటను కాదనాల్సిన పనిలేదు. ఆమె కాలిఫోర్నియాలో ఉంటున్నా’రని తెలిపారు. -
పోలీసుల చేత ఫోన్లు చేయించారు
‘‘నన్ను థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అంటున్నారు. అవేమీ వద్దు. పూల దండలు, పొగడ్తలు అవసరం లేదు. ఎప్పటికీ మంచి సినిమాల శేష్‌గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు’’ అన్నారు అడివి శేష్. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘కుర్రాడు కాలిఫోర్నియా నుంచి వచ్చాడు. ఇంగ్లీష్ టాకింగ్, వాకింగ్ బాగుంది. ఇక్కడ సినిమాలు చేస్తూ అక్కడ సౌకర్యవంతమైన జీవితం లీడ్ చేస్తుంటాడని నా గురించి మొదట్లో అనుకుని ఉంటారు. కానీ అలాంటిది ఏం లేదు. మాది అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మా నాన్నగారు హోటల్ మేనేజర్‌గా చేశారు. మా అమ్మగారు వెయిట్రస్‌గా చేశారు. నాకూ కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. ‘పంజా’ తర్వాత కూడా అవి తగ్గలేదు. ఆ సినిమా తర్వాత విలన్‌గా నీకు ఫాలోయింగ్ వచ్చింది. హీరోగా ట్రై చేయమన్నారు. ఆ సమయంలో ‘కిస్’ సినిమా చేశాను. మ్యాట్నీ షో టైమ్‌కి ఓ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి రెండు మూడు కోట్లు పోతాయన్నాడు. నా జేబులో పది రూపాయలు కూడా లేని పరిస్థితి. అప్పులు ఇచ్చిన వారు కొందరు పోలీసుల చేత ఫోన్లు చేయించారు. సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడతారు. నా సినిమా నిలబడాలని కోరుకుంటాను. ఎందుకంటే మరోసారి నేను పోలీస్ స్టేషన్లో నిలబడను. ‘ఎవరు’ సక్సెస్ తర్వాత 48 గంటల్లో ఆరుగురు నిర్మాతలు ఫోన్ చేసి ‘కథ ఉందా? నీపై నమ్మకం ఉంది’ అన్నారు. ఆ నమ్మకం కోసమే కష్టపడుతున్నాను. డబ్బు లేనప్పుడు కూడా నన్ను నమ్మింది రచయిత అబ్బూరి రవిగారే. నా బ్యాక్‌గ్రౌండ్ ఆయనే. నాపై నమ్మకం ఉంచిన పీవీపీ గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ ప్రేక్షకులకు నచ్చేలా రావడానికి మాలో మేం గొడవలు పడ్దాం. ఫైనల్‌గా సినిమా గెలిచింది. ఈగోల కన్నా సినిమా చాలా పెద్దది. శేష్ ఇంకా మంచి సినిమాలు చేయాలి. రామ్‌జీ తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతాడు. ‘ఎవరు’ లైబ్రరీ ఫిల్మ్ వంటిది’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘శేష్ ఆల్రెడీ రెండు హిట్స్ (క్షణం, గూఢచారి)తో ఉన్నాడు. ఏం చేయాలా? అనుకున్నా. ‘ఏం చేసినా నమ్మకంతో చేయి’ అన్న అబ్బూరి రవిగారి మాటలు నాకు సహకరించాయి. మా సినిమాకు కో డైరెక్టర్ లేడు. మా ఏడీ టీమ్ సుధీర్, సూర్య, మనీషా, దివ్య బాగా కష్టపడ్డారు. నాకు కృష్ణానగర్ కష్టాలు లేవు. నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తోంది. నా స్నేహితులే నా ఎమోషనల్ సపోర్ట్’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘థ్రిల్లింగ్ స్టార్ అనేది శేష్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనిపిస్తుంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రెజీనా. నటులు సాయి, శశి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్, డీఓపీ వంశీ పచ్చిపులుసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కేకే, భాను మాట్లాడారు. -
ట్రూమేక్
కాగితం మీద సీన్ ఉంటే నమ్మకం కుదరదు. అదే ఆల్రెడీ తీసేసిన స్క్రిప్ట్ అయితే ఒక గ్యారంటీ. అది పెద్ద హిట్ అయి ఉంటే ఇంకా భరోసా. అక్కడ హిట్ అయ్యింది ఇక్కడ హిట్ అవుతుందిలే అని ధైర్యం. కాని రీమేక్‌లు ఎప్పుడూ మేజిక్స్టిక్లే. అవి సరిగ్గా తిప్పితే పూలవర్షం కురుస్తుంది.లేదంటే పాము పడగై కాటేస్తుంది. ఇటీవలి రీమేక్‌లు సక్సెస్‌స్టోరీ ఇది. రీమేక్ అనేది కత్తి మీద సాము. మార్పులు చేసి తీయాలా యథాతథంగా తీయాలా అనేది ఎప్పుడూ ఒక పజిల్. మార్పులు చేసి తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మార్పులు చేయకుండా తీసిన సినిమాలూ హిట్ అయ్యాయి. మార్పులు చేసినా, చేయకపోయినా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. సినిమాలు ఎలా ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయో చెప్పలేము. చిరంజీవి అంతటి మెగాస్టార్ కెరీర్ పరంగా ఒడిదుడుకులలో ఉన్నప్పుడు హిట్ ఇచ్చి నిలబెట్టిన ‘హిట్లర్’ రీమేకే. పెద్ద సక్సెస్ ఇచ్చి రాజకీయ ప్రవేశానికి ఊతం ఇచ్చిన ‘ఠాగూర్’ రీమేకే. ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్’ కూడా రీమేకే. అలాగే మోహన్‌బాబుకు సినిమా రంగంలో సెకండ్ లైఫ్ ఇచ్చి స్టార్ ఇమేజ్ తెచ్చిన ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ గారి పెళ్లాం’ సినిమాలు రీమేక్‌లే. కాని రీమేక్ అంటే మాత్రం చాలామంది దర్శకులు నెర్వస్‌గానే ఫీలవుతారు. గతంలో తెలుగులో రీమేక్ స్పెషలిస్టులు ఉండేవారు. పాతరోజులలో ఎస్.డి.లాల్ వంటి డైరెక్టర్లు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు. ‘నిప్పులాంటి మనిషి’ (జంజీర్), అన్నదమ్ముల అనుబంధం (యాదోంకి బారాత్), నేరం నాది కాదు ఆకలిది (రోటి) ఇవన్నీ ఎస్.డి.లాల్ తీసిన సినిమాలు. తర్వాతి రోజులలో రవిరాజా పినిశెట్టి రీమేక్‌లకు వాసి గాంచారు. ఆయన తీసి సూపర్‌హిట్ చేసిన ‘పుణ్యస్త్రీ’, ‘పెదరాయడు’, ‘చంటి’ రీమేక్‌లే. ఇక దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు రీమేక్ సినిమాలతోనే కెరీర్ నిర్మించుకున్నారు. ‘శుభాకాంక్షలు’, ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘సుడిగాడు’ ఇందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు అలా లేదు. అందరు దర్శకులూ అవకాశాన్ని బట్టి రీమేక్‌లు తీయడానికి సిద్ధమవుతున్నారు. తీస్తున్నారు కూడా. మొన్న మొన్న వచ్చిన నాగార్జున ‘ఊపిరి’ ఫ్రెంచ్ ‘‘ది ఇన్టచ్బుల్స్’కు రీమేక్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నాగచైతన్య ‘ప్రేమమ్’ కూడా మలయాళ సూపర్‌హిట్‌కు రీమేక్. చందు మొండేటి దర్శకుడు. ఇటీవల తెలుగులో మళ్లీ రీమేక్‌ల చర్చ వస్తోంది. కారణం ఇటీవలి రీమేక్ సినిమాలు హిట్ కావడమే. ఎంత మార్చాలి ఎంత మార్చక్కర్లేదు అనే లెక్కలని జాగ్రత్తగా వేసి తీసిన సినిమాలివి. ఒక రకంగా వీటిని ‘ట్రూమేక్’లు అనొచ్చు. ఒరిజినల్ సినిమా పట్ల నిజాయితీతో ఉండి తీసిన సినిమాలన్నమాట. వాటి విశేషాలు. ఓహో బేబీ! సినిమా కథకు ఐడియా వెలగడం పెద్ద విషయం కాదు. దానిని విస్తరించి ఆసక్తికరమైన తొంభై సీన్లుగా మలచడం అసలు విజయం. ఒక స్త్రీ జీవిత చరమాంకంలో తిరిగి యంగ్‌గా జీవించే ఛాన్స్ వస్తే అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే దానిని సినిమాకు వీలుగా మలిచిన తీరు కూడా ఆసక్తికరమే. అందుకే కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ పెద్ద హిట్ అయ్యింది. కథకు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందని గ్రహించాక 11 భాషలకు చెందిన సినీరంగాలవారు ఈ కథను దేశ విదేశాలలో ఎగరేసుకుపోయారు. అలా ఈ కథ తెలుగుకు కూడా చేరి ‘ఓ బేబీ’ అయ్యింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో నటించారు. బేబీగా 80 ఏళ్ల వృద్ధ స్త్రీ పాత్రను లక్ష్మి చేశారు. రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యపాత్రల్లో నటించారు. బేబీ ఎంత బాగా నచ్చిందంటే సూపర్‌హిట్ కావడమే కాదు సుమారు 30 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేసింది. హిందీలో కూడా రీమేక్ కాబోతోంది. హిందీలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తారని తెలిసింది. ఈ సినిమా హిట్ కావడానికి కారణం తెలుగుదనం తప్పిపోని విధంగా తెరకెక్కించడం, ఇది మన కథే అన్న భావన కలిగించడం. ఎప్పుడైతే బామ్మగా లక్ష్మి చేశారో ఆమె తన నుడికారంతో ఒక సాధారణ బామ్మను చూస్తున్న అనుభూతిని కలిగించారు. సమంత ఆ పాత్రను నేటి అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గర చేయగలిగింది. సగటు తెలుగు స్త్రీ మనోభావాలను, జీవితపు వెలితిని చూపడం వల్లే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ‘‘రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా ఆడకపోతే పాడు చేశారు అంటారు. ఒకవేళ హిట్ అయితే సేమ్ అలానే తీశారు హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం’’ – నందినీ రెడ్డి, ‘ఓ బేబి’ రిలీజ్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో. రాక్షసుడు గతంలో ఎస్.వి.కృష్ణారెడ్డి ‘గన్‌షాట్’ అనే సైకో ఫిల్మ్ తీశారు. అందులో సైకోగా ప్రకాష్‌రాజ్ నటించారు. అలీ హీరో. కామెడీ చేయాల్సిన అలీ సీరియస్ రోల్ చేయడం, సీరియస్‌నెస్ చూపించాల్సిన విలన్ కామెడీ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను సరిగా చేరలేదు. కాని ‘రాక్షసుడు’ సినిమా మాత్రం మొదటి సీన్ నుంచే సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. స్కూల్ వయసు ఉన్న ఆడపిల్లలను చంపి అవయవాలను చిన్న చిన్న భాగాలుగా చేసి రాక్షసానందం పొందే ఈ సైకో కిల్లర్‌ను సినిమా దర్శకత్వం కోసం సైకోలను స్టడీచేసి, సినిమా తీసే వీలులేక పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఎలా పట్టుకున్నాడనేది కథ. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘రాక్షసన్’కు రీమేక్ ఇది. అక్కడ ఈ కథను రాసి దర్శకత్వం వహించింది రామ్‌కుమార్. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరనేది ప్రేక్షకుడు పసిగట్టలేనంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లే ఉంది. తమిళ ఒరిజినల్‌ను చాలా కొద్ది మార్పులతో రీమేక్ చేయడం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల్లో దూసుకుపోయిందనే అభిప్రాయం ఉంది. సాధారణంగా పాత్రకు తగ్గ నటులు దొరక్కపోతే పాత్ర ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తమిళంలో ముఖ్యపాత్రలు చేసిన ఇద్దరు ముగ్గురు నటులు తెలుగులో చేయడం కూడా సినిమా హిట్‌కు కారణం కావచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లోనే బెస్ట్ హిట్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ‘‘రీమేక్ చేయడం అంటే ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం. అది అంత ఈజీ కాదు. తమిళ సినిమా ఓ టెంపోలో నడుస్తుంటుంది. అదే టెంపోను ఇక్కడ రిపీట్ చేయగలిగాను. సక్సెస్ సాధించాను’’ – రమేశ్ వర్మ, ‘రాక్షసుడు’ రిలీజ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.– ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది గురి తప్పిన బాణాలు రీమేక్‌లు అన్నిసార్లు సత్ఫలితాలు ఇవ్వవు. తమిళంలో సూపర్‌హిట్ అయిన సత్యరాజ్ సినిమా ‘వాల్టర్ వెట్రివేల్’ను తెలుగులో చిరంజీవి, శ్రీదేవిలతో ‘ఎస్.పి.పరశురామ్’గా తీస్తే ప్రేక్షకులు నిరాకరించారు. గ్లామర్ స్టార్ శ్రీదేవి ఈ సినిమాలో పాత్రపరంగా అంధురాలు కావడం జనానికి రుచించలేదు. మలయాళంలో మోహన్‌లాల్ నటించగా సూపర్‌హిట్ అయిన ‘దేవాసురమ్’ను తెలుగులో మోహన్‌బాబు ‘కుంతీపుత్రుడు’గా తీస్తే ప్రేక్షకులు మెచ్చలేదు. కన్నడలో సూపర్‌హిట్ అయిన విష్ణువర్థన్ సినిమా ‘ఆప్తరక్షక’ తెలుగులో వెంటేష్‌తో ‘నాగవల్లి’గా తీస్తే సత్ఫలితం ఇవ్వలేదు. కన్నడలో సూపర్‌హిట్ అయిన శివ రాజ్‌కుమార్ ‘జోగి’ని తెలుగులో ప్రభాస్‌తో ‘యోగి’గా తీస్తే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిందీలో సూపర్ హిట్ అయిన ఆమిర్ ఖాన్ ‘మన్’ను తెలుగులో నాగార్జునతో ‘రావోయి చందమామ’గా తీస్తే ప్రేక్షకులు నిరాశాజనకమైన రిజల్ట్స్ ఇచ్చారు. కనుక పట్టువదలక పని చేస్తూ పోవడమే చేయదగినది. నచ్చితే హిట్ అవుతుంది. లేకుంటే అనుభవం వస్తుంది. ఎవరు ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో థ్రిల్లింగ్ హిట్స్ అందుకున్నారు అడివి శేష్. మళ్లీ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘ఎవరు’తో వచ్చారు. స్పానిష్ సినిమా ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఆల్రెడీ హిందీలో ‘బద్లా’ గా ఈ సినిమా రీమేక్ అయింది. ఆ రెండు సినిమాలను చూసిన వారు కూడా ఎంటర్టైనింగ్గా చూసేలా మరిన్ని ట్విస్ట్‌లతో తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్‌జీ. ఓ బడా బిజినెస్‌మేన్ భార్య పోలీస్ ఆఫీసర్‌ను చంపేస్తుంది. తన మీద అత్యాచారం చేశాడని, ఆత్మరక్షణ కోసం కాల్చానని చెబుతుంది ఆమె. ఇందులో నుంచి తప్పించడానికి విక్రమ్ వాసుదేవ్ అనే లంచగొండి పోలీస్ ఆఫీసర్ సహాయం తీసుకుంటుంది. ఈ కేస్‌లో నుంచి తప్పించుకోవడానికి విక్రమ్ వీళ్లకు సాయం చేశాడా? వీళ్లు తప్పించుకున్నారా? లేదా అనేది క్లుప్తంగా ‘ఎవరు’ కథ. ఒరిజినల్లో ఉన్న కొన్ని పాత్రలను తప్పించి, మరిన్ని ట్విస్ట్‌లు జోడించి ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా రూపొందించారు.‘‘ఒరిజినల్ సినిమా అక్కడ ఎందుకు ఆడింది? అనే విషయం అర్థం చేసుకోవాలి. ‘ఇన్విజిబుల్ గెస్ట్’ కోల్డ్ ఫిల్మ్. వాళ్ల ఎమోషన్స్ అలానే ఉంటాయి. మనవి అలా ఉండవు. దాన్ని అర్థం చేసుకుని మనకు తగ్గట్టుగా మలుచుకుంటే కచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు’’ – వెంకట్ రామ్‌జీ. ‘ఎవరు’ దర్శకుడు. -
హ్యాట్రిక్ కొట్టేశాడు : బన్నీ
రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ తెలుగు నెటీవిటీకి తగ్గట్టుగా మలిచి, కథనంలో మార్పులు చేసి తీసిన ‘ఎవరు’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం.. అందర్నీ ఆకట్టుకుంటోంది. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సందర్భంగా ఈ సినిమాపై సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘చిత్రబృందానికి కంగ్రాట్స్. నేను గత రాత్రే ఈ సినిమాను చూశాను. మర్డర్ మిస్టరీని అనేక మలుపులతో అద్భుతంగా తెరకెక్కించారు. కథనం, సాంకేతిక పరంగా ఈ చిత్రం చాలా బాగుంది. శేష్‌కు ఇది హ్యాట్రిక్ మూవీ.. కంటిన్యూస్‌గా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ చక్కగా నటించారు. నిర్మాత పీవీపీ, దర్శకుడు వెంకట్ రామ్‌జీలకు కంగ్రాట్స్’అని తెలిపారు. CONGRATULATIONS to the entire team of EVARU . @AdiviSesh @ReginaCassandra pic.twitter.com/PS08Kxrne4 — Allu Arjun (@alluarjun) August 19, 2019 -
నా నంబర్ వాళ్ల దగ్గర లేదనుకుంటా
నన్ను, శేష్‌ని ‘మీరు అమెరికాలో చదివి వచ్చిన బ్యాచ్. మీకు మాస్ సినిమా తీయడం రాదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ బ్యాచ్’ అని పీవీపీగారు తిడుతుంటారు. కానీ ఇవాళ మా ‘ఎవరు’ అన్ని సెంటర్స్‌లో సూపర్‌గా కనెక్ట్ అవ్వడం సంతోషంగా ఉంది. ‘‘ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు ఆ భాషల్లో ఎందుకు హిట్ అయ్యాయో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు నచ్చేలా ఎలా తీయాలో ఆలోచించుకోవాలి. అప్పుడు కచ్చితంగా మన వాళ్లకు నచ్చే సినిమా తీయొచ్చు’’ అన్నారు దర్శకుడు వెంకట్ రామ్‌జీ. పీవీపీ నిర్మాణంలో రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. స్పానిష్ థ్రిల్లర్ ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ‘ఎవరు’ గత గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా వెంకట్ రామ్‌జీ చెప్పిన విశేషాలు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శకుడు గుణ్ణం గంగరాజుగారి దగ్గర ఓ సీరియల్‌కు స్క్రీన్‌ప్లే రచయితగా పని చేశాను. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారి అబ్బాయి ప్రకాశ్‌తో కలసి పని చేశాను. ఆతను తీసిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా, ఆ తర్వాత పీవీపీ సంస్థలో ‘క్షణం, సైజ్ జీరో, ఊపిరి, బ్రహ్మోత్సవం’ సినిమాలకు మార్కెటింగ్ విభాగంలో పని చేశాను. పీవీపీగారికి ఒక కథ చెబుదాం అనుకున్నప్పుడు ఆయనే నాకో పాయింట్ చెప్పి ఎలా ఉంది? అని అడిగారు. ఆ స్పానిష్ సినిమా ఇంతకుముందే చూశాను. కానీ దాన్ని వీళ్లు చూసిన కోణం నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి ఆ కథ మీద వర్క్ చేయడం మొదలుపెట్టాం. ఏ కథలో అయినా అందులో ఎమోషన్స్‌ను ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. అందుకే ఆ కథకు ఎమోషన్స్ యాడ్ చేశాను. ఏ కథకైనా ఎమోషనే ముఖ్యం అని నమ్ముతాను. గత పదేళ్లలో చిన్న సినిమా పెద్ద విజయం అనే ట్రెండ్‌ను ‘క్షణం’ క్రియేట్ చేసింది. పీవీపీగారు రాజకీయాల్లో బిజీ అయిపోయి ‘క్షణం’ లాంటి చిన్న సినిమా చేయాలనుకున్నారు. ‘క్షణం’ చిత్రబృందంలోని చాలామంది ‘ఎవరు’కి పని చేశారు. ‘క్షణం, గూఢచారి’ సినిమాలకు అన్ని బాధ్యతలను శేష్ భుజాన వేసుకున్నాడు. ఈ సినిమాకి వచ్చేసరికి చాలా అలసిపోయాడు. ఈ సినిమాలో రైటింగ్ పరంగా ఏం చేయకపోయినా రైటర్స్‌కి మంచి గైడెన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ రెండు థ్రిల్లర్స్ చేశాడు. ఎక్కడ థ్రిల్ చేయాలో తనకు ఐడియా ఉంటుంది. అలాగే అబ్బూరి రవిగారు కూడా డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సమీరా పాత్రకు రెజీనా బాగా సూట్ అయ్యారు. ‘అ!’ నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తున్నారామె. తన కళ్లతోనే అన్ని భావాలను చూపించగలరు. నవీన్ చంద్ర కూడా బాగా చేశాడు. సినిమాలో సర్ప్రైజ్ చేసింది నిహాల్ చేసిన ఆదర్శ్ పాత్ర. ఈ సినిమా 70 శాతం పూర్తయినప్పుడే విజయం మీద నమ్మకం వచ్చేసింది. రఫ్ కట్ నుంచి ఫైనల్ వెర్షన్‌కు పెద్దగా ఎడిటింగ్ ఏమీ లేదు. కేవలం నిమిషం మాత్రమే కట్ చేశాం. నా స్క్రిప్ట్ 118 పేజీలు ఉంటే మా సినిమా నిడివి కూడా కేవలం 118 నిమిషాలే ఉంది. ‘ఎవరు’ చూసి ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారు. అడ్వాన్స్ ఇస్తామని నిర్మాతలు ఎవ్వరూ ఫోన్ చేయలేదు. బహుశా నా నంబర్ వాళ్ల దగ్గర లేదనుకుంటా (నవ్వుతూ). నా నెక్ట్స్ సినిమా కూడా థ్రిల్లర్ జానర్లోనే ఉంటుంది. -
అప్పుడు విలన్ రోల్ ఇవ్వలేదు.. కానీ!
స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎవరు. తొలి షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ‘ఎవరు’ టీంను అభినందించారు. ఈ సందర్భంగా అడివి శేష్‌తో తమ బ్యానర్లో ఓ సినిమా చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌పై హీరో అడివి శేష్ ఆసక్తికరంగా స్పందించారు. గతంలో దిల్ రాజు నిర్మించిన ఎవడు సినిమాలో విలన్ రోల్ కోసం అడివి శేష్ ప్రయత్నించాడు. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడు ఆ రోల్ తనకి దక్కలేదని చెప్పాడు. ఇప్పుడు ఎవరు సినిమా సక్సెస్ తరువాత దిల్ రాజు స్వయంగా అడివి శేష్‌ను తన బ్యానర్లో సినిమా చేయమని అడగటంతో మరింత ఆనందంగా ఉన్నాడు శేష్. -
వారికి శేష్ ఒక ఉదాహరణ
‘‘ఇండస్ట్రీలో మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు’ అని చాలామంది అంటుంటారు. వారందరికీ అడివి శేష్ ఒక ఉదాహరణ. ప్రతిభ ఉండి కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’రాజు. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర ముఖ్య తారాగణంగా వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఒక స్టోరీ ఎలా ఉంది? ఏంటి? అంటే నేను చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్ట్‌లతో కూడుకున్న సినిమాను నేను సరిగ్గా జడ్జ్ చేయలేను. ‘ఎవరు’ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేవు. వరుస ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టారు. ఇటీవల ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినందుకు హ్యాపీ. అడివి శేష్‌ని క్యారెక్టర్ ఆర్టిస్టు అనాలా? లేక హీరో అనాలా?.. డైరెక్టర్ రామ్‌జీ యాక్టర్ అనమంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ ఇప్పుడు ‘ఎవరు’ వంటి సినిమాలతో శేష్ యాక్టర్‌గా ఎదుగుతున్నాడు. మా బ్యానర్లో సినిమా చేయమని అడిగాను. రెజీనా, నవీన్‌చంద్ర బాగా నటించారు. ‘నేను లోకల్’ సినిమా సమయంలో నవీన్‌చంద్రకు హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ట్రై చేయమని చెప్పాను. అతను బాగా చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఇలా చెబితే ..‘రాజుగారి ఏంటీ ఇలా చెబుతారు.. హీరోగా చేయమని ఎంకరేజ్ చేయాలి కదా’ అనుకుంటారు. ఏళ్ల తరబడి హీరోలుగా చేసిన వారు కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్టు ఎప్పుడూ ఉంటాడు. నా మిత్రుడు పీవీపీ బ్యానర్లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయాను. ‘దిల్’ రాజుగారి ‘ఎవడు’ సినిమాలో మెయిన్ విలన్‌గా చేయడానికి అప్పట్లో ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా.. నేను అప్పటికీ ఆ స్థాయిలో లేనేమో. ఇప్పుడు ‘దిల్’ రాజుగారు ‘ఎవరు’ సినిమా చూసి అభినందించడం మరిచిపోలేను. సినిమా చూసి మా బ్యానర్లో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్? అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కలెక్షన్స్ గురించి మాట్లాడను. కానీ ‘గూఢచారి’ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పగలను’’ అన్నారు అడివి శేష్.‘‘‘అరవిందసమేత..’లో చేసిన బాల్ రెడ్డి పాత్రలానే ‘ఎవరు’లో నేను చేసిన అశోక్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోగానే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ట్రై చేయమన్న ‘దిల్’ రాజుగారి సలహాను పాటిస్తూనే ఉంటాను’’ అన్నారు నవీన్‌చంద్ర. ‘‘ఇది సమిష్టి విజయం’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు మురళీ శర్మ. ‘‘ఈ సినిమాకు, నేను చేసిన సమీర పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సింగిల్ స్క్రీన్‌కి వెళ్లి చూశాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలోని ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చూడబోయేవారి ఆసక్తిని తగ్గించవద్దు. వారు కూడా సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయాలి’’ అన్నారు రెజీనా. -
సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి
నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ కోసం ఎదురుచూసిన రెజీనాకు ‘ఎవరు’ రూపంలో మంచి విజయం లభించింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన రెజీనా.. తనను కలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ‘హలో.. ఎవరు చిత్రానికి వస్తున్న స్పందన, చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. మీరంతా కలవాలని అడిగితే కాదనగలనా? ఇక్కడ మీకోసం చిన్న కంటెస్ట్ నిర్వహించబోతోన్న.. ఎవరు చిత్రంలో సమీర భర్త పేరు చెప్పండి.. 18వ తేదీన నాతో కాఫీ తాగేందుకు జాయిన్ అవ్వండి’ అంటూ ట్వీట్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం సమాధానం చెప్పండి..రెజీనాతో కాఫీ తాగే చాన్స్ కొట్టేయండి. Helloo... Thank you so much for the love and amazing response for #Evaru 🤗 You askpd to meet and how could I resist. Here's a small contest question. What's Sameera's husband's name in the movie #Evaru? Give the correct answer and join me for coffee on the 18th.♥️ pic.twitter.com/tYbC1F2TQ2 — ReginaCassandra (@ReginaCassandra) August 16, 2019 -
అభిమానులకు అడివి శేష్ రిక్వెస్ట్
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో అడివి శేష్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కట్టిపడేసే కథా కథనాలతో ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన శేష్‌పై అభినందనల జల్లు కురుస్తోంది. అయితే కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో సినిమాలోని కీలక ట్విస్ట్‌లను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. (మూవీ రివ్యూ : ‘ఎవరు’) ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లను సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ లీకులపై ఎవరు టీం స్పందించింది. ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసిన అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనాలు ట్విస్ట్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని రిక్వెస్ట్ చేశారు. తనకు ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు. Team #Evaru is really enjoying the success of the film. We have a small request about SPOILERS!!! #EvaruRampage pic.twitter.com/KvRDf2kTx5 — Adivi Sesh (@AdiviSesh) August 15, 2019 -
శర్వానంద్ మిస్ అయ్యాడు?
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’తో పాటు శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన రణరంగం సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత వారం రిలీజ్ అయిన సినిమాల ప్రభావం పెద్దగా లేకపోవటం, ఆగస్టు 15 సెలవు కూడా కావటంతో రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు. అయితే ఈ అడ్వాంటేజ్‌ను శర్వా మిస్ చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్ విషయంలో ఒక అడుగు ముందున్న అడివి శేష్ సినిమా మీద అంచనాలను పెంచటంలో సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు ఒక రోజు ముందుగానే సినిమాను సినీ ప్రముఖులకు, మీడియాకు ప్రదర్శించటం కూడా కలిసొచ్చింది. స్పెషల్ ప్రీమియర్లతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఎవరు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. రణరంగం విషయంలో అలాంటి సందడి కనిపించటం లేదు. సోషల్ మీడియాలోనూ రణరంగంకు సంబంధించి హడావిడి లేదు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగటంలేదన్న టాక్ వినిపిస్తోంది. తన పాత్రకోసం ఎంతో కష్టపడే శర్వానంద్ ప్రమోషన్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది అంటున్నారు విశ్లేషకులు. -
భవిష్యత్ గురించి నో ఫికర్..!
భవిష్యత్ గురించి ఎలాంటి బాధ లేదంటోంది నటి రెజీనా. ఆరణాల చెన్నై బ్యూటీ అయిన ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషలోనూ స్టార్ హీరోలతో నటించే అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెజీనా ముందుంచితే ఇలాంటి వాటి గురించి కారణాలేమిటో తనకూ తెలియలేదని బదులిచ్చింది. తాను నటించిన చిత్రాలన్నీ హిట్టేనని చెప్పింది. ఆ మధ్య తెలుగులో నటించిన ‘అ!’ చిత్రాన్ని జాతీయ అవార్డు వరించింది. దానికి మేకప్పే ముఖ్య అంశం అని, అందుకు తానూ ఒక కారణం అని చాలా మంది ప్రశంసించినట్లు తెలిపింది. ఆ చిత్రంలోని పాత్రకు మేకప్ కోసం తాను గంటల తరబడి సమయాన్ని కేటాయించినట్లు రెజీనా చెప్పింది. ఇంకో విషయం ఏమిటంటే కథల గురించి తానెప్పుడూ ఆలోచించనంది. అందులో తన పాత్రనే ముఖ్యంగా భావిస్తానని చెప్పింది. ఈ పాత్ర తనకు భవిష్యత్‌లో సహాయపడుతుందా అన్న దాని గురించి ఆలోచించనని చెప్పింది. ఇచ్చిన పాత్రలకు పూర్తిగా న్యాయం చేయడానికి శ్రమిస్తానని అంది. భవిష్యత్ గురించి చింతించనని రెజీనా పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో ‘కల్లపాట్’, ‘కసడ తపద’ చిత్రాల్లో నటిస్తోంది. రెజీనా నటించిన నిర్మాణం పూర్తి చేసుకున్న ‘నెంజం మరప్పదిలై’, ‘పార్టీ’ చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. ఇక తెలుగులో నటించిన ‘ఎవరు’ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపైనా రెజీనా చాలా నమ్మకం పెట్టుకుంది. -
‘ఎవరు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తారాగణం : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్ పాకల దర్శకత్వం : వెంకట్ రామ్‌జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ మరోసారి తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్ మరోసారి సక్సెస్ సాధించాడా..? కథ : ఓ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ మహా భార్య, సమీరా మహా(రెజీనా), డీసీపీ అశోక్ (నవీన్ చంద్ర)ను కాల్చి చంపేస్తుంది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేసే అశోక్, తమిళనాడు.. కూనుర్‌లోని ఓ రిసార్ట్‌లో హత్యకు గురికావటంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. చనిపోయింది డిపార్ట్మెంట్ వ్యక్తి కావటంతో పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుంటారు. సమీరాపై హత్య కేసు పెడతారు. సమీరా మాత్రం అశోక్ తనపై అత్యాచారం చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంది. కేసు విషయంలో సమీరాకు సాయం చేసేందుకు అవినీతి పరుడైన పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్(అడివి శేష్)ఆమెను కలుస్తాడు. తనకు అసలు నిజం చెపితేనే కేసు నుంచి కాపాడగలనని సమీరాకు చెపుతాడు విక్రమ్. మరి సమీరా, విక్రమ్‌తో అసలు నిజం చెప్పిందా..? అశోక్‌తో సమీరాకు ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసుకు, ఏడాది క్రితం కనిపించకుండా పోయిన వినయ్ వర్మ(మురళీ శర్మ)కు, అతని కొడుకు ఆదర్శ్‌కు సంబంధం ఏంటి..? అసలు విక్రమ్ వాసుదేవ్ ఎవరు? సమీరా ఎవరు? అన్నది తెర మీద చూడాల్సిందే. నటీనటులు : థ్రిల్లర్ కథాంశాల్లో నటించటం అడివి శేష్‌కు కొట్టిన పిండి. అందుకే విక్రమ్ వాసుదేవ్ పాత్రలో ఈజీగా నటించేశాడు శేష్. అనవసరమైన బిల్డప్‌లు భారీ ఎమోషన్స్, పంచ్ డైలాగ్‌లు లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజీనా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇటీవల ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్న రెజీనా ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించింది. సమీరాగా చాలా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కింది. కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, మురళీ శర్మ, నిహాల్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఒక హత్య కేసు, ఓ మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తయారు చేసుకున్న కథను తన కథనంతో రెప్పవేయకుండా చూసేంత ఇంట్రస్టింగ్‌గా మలిచాడు దర్శకుడు వెంకట్ రామ్‌జీ. సినిమాలో పది, పదిహేను నిమిషాలకోసారి ఓ ట్విస్ట్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. దర్శకుడు థ్రిల్లర్ జానర్‌కే ఫిక్స్ అయి సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కామెడీ, డ్యూయెట్స్ లాంటివి ఇరికించకపోవటం సినిమాకు కలిసొచ్చింది. రొటీన్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరించటం కాస్త కష్టమే. చాలా సన్నివేశాలు రెండు మూడు కోణాల్లో చూపించినా ఎక్కడ బోర్ అనిపించకుండా తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంత గ్రిప్పింగ్‌గా అనిపించదు. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకల సంగీతం. పాటలు కథలో భాగం వచ్చిపోతాయి. నేపథ్య సంగీతంతో ప్రతీ సన్నివేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు.. సంగీత దర్శకుడు. వంశీ పచ్చిపులుసు తన కెమెరా పనితనంతో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన సీరియస్‌నెస్‌ను తీసుకువచ్చాడు. సినిమా అంతా రెండు, మూడు లోకేషన్లలోనే తెరకెక్కించినా ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!
‘‘పాజిటివ్ క్యారెక్టరా? నెగటివ్ క్యారెక్టరా? అని కాదు. కథ బలంగా ఉండాలి. కథ నా పాత్ర చుట్టూ తిరగాలి. అలాంటి సినిమాలు చేయాలనుకుంటా’’ అన్నారు అడివి శేష్. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. అడివి శేష్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో పదివేలు, ఇరవై వేలకు ఆశపడి తప్పులు చేసే విక్రమ్ వాసుదేవ్ అనే పోలీసాఫీసర్ పాత్రలో నటించాను. ఈ ‘ఎవరు’ చిత్రానికి హిందీ ‘బద్లా’తో ఏమైనా లింక్ ఉందా? అనే విషయం థియేటర్లోనే తెలుస్తుంది. ► ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్నప్పుడు రామ్‌చరణ్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. ట్రైలర్ నచ్చిందని రామ్‌చరణ్ అన్నారు. బెటర్మెంట్ చేశాం. రీషూట్ చేశాం. ఫైనల్‌గా సాలిడ్ స్టాండర్డ్స్‌కు సినిమాను తీసుకువచ్చాం. రీషూట్స్ చేయడం అనేది ‘క్షణం’ నుంచి నాకు అలవాటైందని అనుకుంటున్నా. మంచి అవుట్‌పుట్ రావడం కోసం మార్పులు చేయడంలో తప్పులేదన్నది నా అభిప్రాయం. ► థ్రిల్లర్ మూవీస్‌ను మళ్లీ చూడాలనిపించదు. ట్విస్ట్స్ తెలిసిపోయినప్పుడు రెండోసారి చూడాలనిపించదు. కానీ ఆ ట్విస్ట్‌లకు స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ ఉంటే మళ్లీ మళ్లీ చూడొచ్చు. ‘క్షణం’ అలాంటిదే. మా అమ్మగారు ఆ సినిమాను ఐదుసార్లు చూశారు. ► నా సక్సెస్ఫుల్ కెరీర్లో రచయిత అబ్బూరి రవిగారి పాత్ర ఉంది. అలాగే శోభు యార్లగడ్డగారి వల్ల ‘పంజా, బాహుబలి’ సినిమాల్లో నటించాను. నేను ఫ్లాప్ డైరెక్టర్ని. నా ‘కిస్’ సినిమా ఆడలేదు. పోస్టర్స్ అతికించే మైదాపిండి ఖర్చు కూడా రాలేదు. ‘క్షణం, గూఢచారి’ సినిమాల బడ్జెట్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఆ సినిమాలకు కథ అందించింది నేనే. ‘మేజర్’ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు మేజర్ అనౌన్స్మెంట్ అని ట్విట్టర్లో పెడితే, నా పెళ్లి వార్త అనుకున్నారు. కానీ అది ‘మేజర్’ సినిమా గురించి. ‘గూఢచారి 2’ స్టార్ట్ ఉంటుంది. నా కమిట్మెంట్స్ని చూసుకుని ‘2 స్టేట్స్’ రీమేక్ గురించి ఆలోచిస్తా. -
‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’
‘‘క్షణం’ సమయంలో ‘ఏముందిలే చిన్న సినిమా’ అంటూ మా ఆఫీస్ బాయ్ వాళ్ల స్నేహితుడితో ఫోన్లో మాట్లాడాడు. ఆ రోజే ఫిక్స్ అయ్యాను. చాలా తీవ్రంగా కష్టపడాలని. ‘2.0’ వెర్షన్‌లా మారిపోయాను. ఈ సినిమా అతనికే అంకితం చేస్తున్నాను’’ అన్నారు అడివి శేష్. పీవీపీ నిర్మాణంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ప్రీ–రిలీజ్ ప్రెస్మీట్లో శేష్ మాట్లాడుతూ – ‘‘మా స్నేహితులకు ఈ సినిమా చూపించా. నమ్మకంగా పీవీపీగారితో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ వద్దు. ప్రీమియర్ షో వేద్దాం అన్నాను. నన్ను ఎవరూ నమ్మని సమయంలో ఆయన నమ్మారు’’ అన్నారు శేష్. ‘‘టాలెంట్ ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడంలో పీవీపీగారు బెస్ట్. నమ్మితే ప్రశ్నించరు’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు నవీన్ చంద్ర’’. ‘‘కథ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఈ సినిమాకు ఇద్దరు అమ్మాయిలు ఆసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశారు. ఒక సినిమాకి ఇద్దరమ్మాయిలు ఉండటం నా కెరీర్లో ఫస్ట్ టైమ్’’ అన్నారు రెజీనా. ‘‘తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. అందులో మా సినిమా కూడా ఉండబోతోంది. మా సెట్, ఆఫీస్ పని చేయడానికి చాలా సురక్షితమైన ప్రదేశం అని గర్వంగా చెబుతాను’’ అన్నారు పీవీపీ. -
‘ఎవరు’ ప్రీ రిలీజ్ వేడుక
-
సమీర పాత్ర ఫుల్‌మీల్స్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఎస్.ఎమ్.ఎస్’ చిత్రంతో 2012లో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నా. నాకు నచ్చిన పాత్రలను ఎంచుకుని వాటికి న్యాయం చేస్తున్నా. కానీ, పెద్ద సినిమాలు రాకపోవటానికి కారణం ఏంటో తెలియదు. అయితే నేను మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేశాను’’ అని రెజీనా అన్నారు. అడివి శేష్, రెజీనా జంటగా నవీన్ చంద్ర కీలక పాత్రలో వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. పివిపి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజీనా పంచుకున్న విశేషాలు... ► పీవీపీగారు ఓ రోజు ఫోన్ చేసి, వెంకట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు కథ చెప్తారు వినండి, నచ్చితే చేద్దాం అన్నారు. అడివి శేష్, రామ్‌జీ చెన్నై వచ్చారు. రామ్‌జీ రెండు గంటలు పాటు ‘ఎవరు’ కథ చెప్పినప్పుడే తనపై పూర్తినమ్మకం కుదిరింది. పైగా కథ చాలా బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. ► ఈ చిత్రంలో సమీర అనే పాత్ర చేశా. ఆమె జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. అది ఏంటి? చివరికి సమీర జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అన్నదే చిత్ర కథ. ► సమీర పాత్ర పూర్తి సంతృప్తినిచ్చింది. ఫుల్మీల్స్లాగా అన్నమాట. ‘నక్షత్రం’ సినిమాలో డబ్బింగ్ చెప్పా. పూర్తిస్థాయి పాత్ర చేసి, ఫుల్‌గా డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం ‘ఎవరు’. ► ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసే లగా’ నా తొలి హిందీ చిత్రం. ఇందులో లెస్బియన్ పాత్రలో నటించా. సినిమా చూశాక చాలా మంది ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా అనిపించింది. బోల్డ్‌గా నటించడానికి ఇబ్బంది లేదు. కానీ, వల్గర్‌గా ఉండే పాత్రలు మాత్రం చేయను. తాప్సీ నటించిన ‘బద్లా’కి, మా సినిమాకి పోలికే లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. ► ‘మహానటి’ చిత్రానికి కీర్తీసురేశ్కి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాంటి పాత్రలు చేసే అవకాశం అందరికీ రాదు. ‘అ’ సినిమాకి జాతీయ అవార్డు రావడంతో నాని మెసేజ్ చేశారు. ఆ చిత్రానికి మేకప్ విభాగంలో ఇంద్రాక్షి పట్నాయక్‌కి కూడా జాతీయ అవార్డు రావడం సంతోషం. ‘అ’ సినిమాలో నా మేకప్‌కి ఎంతో శ్రమించారామె. ► అడివి శేష్ మంచి నటుడు. తనతో పని చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. సెట్లో సరదాగా ఎంజాయ్ చేశాం. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో కూడా కొన్ని అవకాశాలున్నాయి.. ప్రొడక్షన్ వారే అధికారికంగా ప్రకటిస్తారు. హిందీలో కూడా త్వరలో ఓ సినిమా ఫైనల్ అవ్వనుంది. -
‘ఎవరు’ ట్రైలర్ విడుదల
-
ట్రైలర్ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది
‘‘గూఢచారి’ చిత్రం ట్రైలర్‌ను ఇదే అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేశాం.. ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. ‘ఎవరు’ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోతే శేష్ ప్రతి సినిమా ట్రైలర్‌ని నేనే విడుదల చేయాల్సి వస్తుందనే ప్రమాదం ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో నాని అన్నారు. అడివి శేష్, రెజీనా జంటగా, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పీవీపీ సినిమా బ్యానర్‌పై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం నాని మాట్లాడుతూ– ‘‘శేష్, రెజీనా, పీవీపీగారు సహా అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. ట్రైలర్ నేరుగా మనల్ని కథలోకి తీసుకెళ్లిపోయింది. అసలు తెలుగు సినిమానా? ఇంగ్లీష్ సినిమానా? అనిపిస్తోంది.. సినిమాను అంత బాగా చేశారు. టీజర్ చూసినప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అనే ఆసక్తి పెరిగిపోయింది’’ అన్నారు. ‘‘మా సినిమా గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున మాట్లాడతాను’’ అన్నారు వెంకట్ రామ్‌జీ. ‘‘సినిమాలంటే ప్యాషన్ ఉన్న టీమ్ ఇది. రెండేళ్ల ముందు అనుకున్న ఆలోచనతో చేశాం. మంచి సినిమా అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత పీవీపీ అన్నారు. ‘‘ఎవరు’ సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నవీన్ చంద్ర. ‘‘నేను నమ్మిన సినిమా.. నాకు నచ్చిన సినిమా ‘ఎవరు’. ఈ సినిమాలో అందరూ రెండు ముఖాలను కలిగి ఉంటారు. ఈ మనిషి ఇలా ఉంటారని ప్రేక్షకుడు అనుకున్న పది నిమిషాలకు ఆ మనిషి మారిపోతుంటాడు. ఇలాంటి కథతో సినిమా చేయబోతున్నానని రామ్‌జీ చెప్పగానే ట్విస్ట్‌ను బ్రేక్ చేయలేకపోయాను. నన్ను హీరోగా ఏ ప్రొడ్యూసర్ నమ్మని టైమ్‌లో పీవీపీగారు నమ్మారు. అందుకే ఆయనతో ‘క్షణం’ తర్వాత ‘ఎవరు’ చేశా’’ అని అడివి శేష్ చెప్పారు. రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. -
చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’
క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. గూఢాచారి చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. డిఫెరెంట్ జానర్లో సినిమాలను చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న అడివి శేష్.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. టైటిల్‌తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం టీజర్‌తో మంచి అంచనాలను క్రియేట్చేసింది. తాజాగా నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్‌ను పెంచేలా ఉంది. నవీన్ చంద్ర, రెజీనా పాత్రలు సినిమాలో కీ రోల్ పోషించినట్లు కనబడుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించగా.. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. -
అడవి శేష్ ‘ఎవరు’ రీమేకా?
క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్ రామ్‌జీ దర్శకుడు. సైలెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. 2007లో హాలీవుడ్లో రిలీజ్ అయిన ది ఇన్విజిబుల్ గెస్ట్ కు ఎవరు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సినిమాను బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీల కాంబినేషన్లో బద్లా పేరుతో రీమేక్ చేశారు. అయితే హాలీవుడ్ ఓ మహిళ హత్య విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేస్తే, ఇండియన్ రీమేక్‌లలో మాత్రం ఓ వ్యక్తి హత్య విషయంలో ఆమె గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసినట్టుగా మార్చారు. అయితే ‘ఎవరు’ సినిమా రీమేకా.. కాదా అన్న విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.