శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు? | No Buzz For Sharwanand Ranarangam | Sakshi
Sakshi News home page

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

Published Thu, Aug 15 2019 9:42 AM | Last Updated on Thu, Aug 15 2019 1:48 PM

No Buzz For Sharwanand Ranarangam - Sakshi

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’తో పాటు శర్వానంద్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన రణరంగం సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత వారం రిలీజ్‌ అయిన సినిమాల ప్రభావం పెద్దగా లేకపోవటం, ఆగస్టు 15 సెలవు కూడా కావటంతో రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు.

అయితే ఈ అడ్వాంటేజ్‌ను శర్వా మిస్‌ చేసుకున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రమోషన్ విషయంలో ఒక అడుగు ముందున్న అడివి శేష్ సినిమా మీద అంచనాలను పెంచటంలో సక్సెస్‌ అయ్యాడు. దీనికి తోడు ఒక రోజు ముందుగానే సినిమాను సినీ ప్రముఖులకు, మీడియాకు ప్రదర్శించటం కూడా కలిసొచ్చింది.

స్పెషల్ ప్రీమియర్లతోనే సక్సెస్‌ టాక్ తెచ్చుకున్న ఎవరు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. రణరంగం విషయంలో అలాంటి సందడి కనిపించటం లేదు. సోషల్ మీడియాలోనూ రణరంగంకు సంబంధించి హడావిడి లేదు. దీంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా ఆశించిన స్థాయిలో జరగటంలేదన్న టాక్‌ వినిపిస్తోంది. తన పాత్రకోసం ఎంతో కష్టపడే శర్వానంద్ ప్రమోషన్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది అంటున్నారు విశ్లేషకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement