కన్నడంలోకి ఎవరు | Adivi Sesh Evaru Now Diganth Kannada Remake | Sakshi
Sakshi News home page

కన్నడంలోకి ఎవరు

Published Sun, Apr 12 2020 5:29 AM | Last Updated on Sun, Apr 12 2020 5:29 AM

Adivi Sesh Evaru Now Diganth Kannada Remake - Sakshi

దిగంత్‌

గత ఏడాది మంచి విజయం సాధించిన సినిమాల్లో అడవి శేష్‌ నటించిన ‘ఎవరు’ ఒకటి. వెంకట్‌ రాంజీ తెరకెక్కించిన ఈ సినిమాలో రెజీనా, నవీన్‌ చంద్ర ముఖ్య  పాత్రల్లో నటించారు. స్పానిష్‌ చిత్రం ‘ది ఇన్‌ విజిబుల్‌ గెస్ట్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ‘ఎవరు’లోని ట్విస్ట్‌ లు తెలుగు ఆడియన్స్‌ ను బాగా థ్రిల్‌ చేశాయి. ఆ థ్రిల్‌ ను  కన్నడ ఆడియన్స్‌  కూడా ఆస్వాదించబోతున్నారని  తెలిసింది. ఈ చిత్రం కన్నడంలో రీమేక్‌ కానుంది. దిగంత్‌  అనే కన్నడ నటుడు ఈ రీమేక్‌ లో హీరోగా కనిపిస్తారట. దర్శకుడు, ఇతర నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement