అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా? | Adivi Sesh Evaru Remake of Spanish Thriller | Sakshi
Sakshi News home page

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

Published Sat, Jul 20 2019 2:25 PM | Last Updated on Sat, Jul 20 2019 4:03 PM

Adivi Sesh Evaru Remake of Spanish Thriller - Sakshi

క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. సైలెంట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది. 2007లో హాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన ది ఇన్విజిబుల్‌ గెస్ట్ కు ఎవరు రీమేక్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇదే సినిమాను బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీల కాంబినేషన్‌లో బద్లా పేరుతో రీమేక్‌ చేశారు.

అయితే హాలీవుడ్ ఓ మహిళ హత్య విషయంలో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేస్తే, ఇండియన్‌ రీమేక్‌లలో మాత్రం ఓ వ్యక్తి హత్య విషయంలో ఆమె గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసినట్టుగా మార్చారు. అయితే ‘ఎవరు’ సినిమా రీమేకా.. కాదా అన్న విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement