
క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. గూఢాచారి చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. డిఫెరెంట్ జానర్‌లో సినిమాలను చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న అడివి శేష్.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.
టైటిల్‌తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం టీజర్‌తో మంచి అంచనాలను క్రియేట్‌చేసింది. తాజాగా నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్‌ను పెంచేలా ఉంది. నవీన్ చంద్ర, రెజీనా పాత్రలు సినిమాలో కీ రోల్ పోషించినట్లు కనబడుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించగా.. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.