Major Movie: మేజర్‌ వాయిదా | Adivi Sesh starrer Major release date postponed | Sakshi
Sakshi News home page

Major Movie: మేజర్‌ వాయిదా

Published Thu, May 27 2021 5:48 AM | Last Updated on Thu, May 27 2021 9:29 AM

Adivi Sesh starrer Major release date postponed - Sakshi

అడివి శేష్‌ హీరోగా రూపొందుతున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘మేజర్‌’. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు.

‘‘త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని బుధవారం ‘మేజర్‌’ టీమ్‌ వెల్లడించింది. ముంబయ్‌ 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి, ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు, ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డు) కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్‌’ చిత్రం తెరకెక్కుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement