Major: అనుకున్న సమయానికి రావడం లేదట! | Adivi Sesh Major Release Postponed: Check Update Of New Release Date | Sakshi
Sakshi News home page

Major: మేజర్‌ రిలీజ్‌ వాయిదా

Published Wed, May 26 2021 11:17 AM | Last Updated on Wed, May 26 2021 11:25 AM

Adivi Sesh Major Release Postponed: Check Update Of New Release Date - Sakshi

26/11 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్‌". అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సయూ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్‌ చేయడం లేదట. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల జూలై 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని మరికొన్నాళ్లపాటు వాయిదా వేయనున్నారట.

ఈ మేరకు అడివి శేష్‌ సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. పరిస్థితులు సాధారణమైన తర్వాత కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించాడు. కచ్చితంగా దీన్ని తొలుత థియేటర్లలోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్‌ కొల్లా ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు ఏఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏప్లస్‌ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా వైడ్‌ రిలీజవుతోంది.

చదవండి: ఉగ్రదాడుల్లో చిక్కుకున్న శోభితా దూళిపాల

మేజర్‌ కోసం అదిరిపోయే ఆరు సెట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement