Major Movie First Day Box Office Collection, Full Details in Telugu - Sakshi
Sakshi News home page

Major First Day Box Office Collections: ‘మేజర్‌’ తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే...

Published Sat, Jun 4 2022 1:38 PM | Last Updated on Sat, Jun 4 2022 2:01 PM

Major Movie First Day Box Office Collection Details - Sakshi

అడివి శేష్‌ హీరోగా,సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా  శశి కిరణ్‌ తిక్క తెరకెక్కించిన చిత్రం ‘మేజర్‌’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణణ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 3న విడుదలైంది.

(చదవండి: మేజర్‌ మూవీ రివ్యూ)

ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ లభించింది. అడివి శేష్‌ నటన, శశికిరణ్‌ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిరోజు బాక్సాపీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 7.12 కోట్ల షేర్‌, 13.10 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలో మొత్తంగా రూ.4 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.14.93 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్‌ రాబట్టాలి. 

‘మేజర్‌’ తొలిరోజు కలెక్షన్స్‌

► నైజాం - రూ.1.75 కోట్లు

► సీడెడ్ - రూ.46 లక్షలు

► ఈస్ట్ - 24 లక్షలు

► వెస్ట్ - రూ.24 లక్షలు

► ఉత్త‌రాంధ్ర - రూ.51 లక్షలు

► గుంటూరు- 30 లక్షలు

► కృష్ణా - రూ.28లక్షలు

► నెల్లూరు - రూ.19లక్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- 0.35కోట్లు

►ఓవర్సీస్‌-2.35 కోట్లు

►మొత్తం- రూ.7.12 కోట్లు(రూ.13.10కోట్ల గ్రాస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement