Adivi Sesh Hindi Version Major Movie Ranked Number 1 On Netflix Trends List - Sakshi
Sakshi News home page

Major: ఓటీటీలో దూసుకెళ్తున్న ‘మేజర్‌’.. పాకిస్తాన్‌లో రికార్డు

Published Fri, Jul 8 2022 12:04 PM | Last Updated on Fri, Jul 8 2022 2:11 PM

Adivi Sesh Major Movie Ranked Number 1 On Netflix Trends List - Sakshi

26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

(చదవండి:  మేజర్‌ మూవీ రివ్యూ)

తాజాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులను సృష్టిస్తోంది. జులై 3 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిష‌న్ల‌లో మేజ‌ర్ కొన‌సాగుతుంది. ‘మేజర్‌’ హిందీ వెర్షన్‌ టాప్‌ 1లో ట్రెండ్‌ అవుతుండగా, తెలుగు వెర్షన్‌ రెండో స్థానంలో ఉంది.

(చదవండి: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!)

ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌లో కూడా ‘మేజర్‌’ చరిత్ర సృష్టిస్తున్నాడు. అక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్‌ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్‌ 1లో ఉండడం గమనార్షం. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో  సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement