2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. | Major fire accidents in the country in 2023 - Sakshi
Sakshi News home page

2023 Major fire accidents: దేశంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే..

Published Mon, Dec 18 2023 10:38 AM | Last Updated on Mon, Dec 18 2023 10:57 AM

Major fire accidents in the country in 2023 - Sakshi

భారతదేశ చరిత్రలో ప్రకృతి విపత్తులకు, మానవ తప్పిదాల కారణంగా తలెత్తే ఆపదలకు కొదవేంలేదు. వాటిలో ఒకటే అగ్ని ప్రమాదాలు. పలు ఘటనల్లో అగ్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని తెలుస్తుంటుంది. 2023లో మన దేశంలో అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది భారతదేశంలో సంభవించిన కొన్ని భారీ అగ్ని ప్రమాదాలు..

15 మంది మృత్యువాత..
ధన్‌బాద్ (జార్ఖండ్): 2023, జనవరి 31న జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారు.

బస్సులో మంటలు చెలరేగి..
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై 2023, జూలై ఒకటిన.. తెల్లవారుజామున ఒక బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 25 మంది మృతి చెందారు. ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. 

హమ్‌సఫర్‌లో అగ్నిప్రమాదం
2023, సెప్టెంబరు 23న తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం  చోటుచేసుకుంది. రైలు గుజరాత్‌లోని వల్సాద్ రైల్వే స్టేషన్ దాటుతుండగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. రెస్క్యూ టీమ్‌.. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

భారత్ గౌరవ్ రైలులో..
2023, ఆగస్టు 26న లక్నో-రామేశ్వరం భారత్ గౌరవ్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  తమిళనాడులోని మధురై జంక్షన్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు నాలుగు కోచ్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్నిప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు. 

లూథియానా గ్యాస్ లీక్
2023, అక్టోబర్ 15న పంజాబ్‌లోని లూథియానాలోని ఒక రసాయన కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. ఫలితంగా ఫ్యాక్టరీ సమీపంలోని భవనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 18 మంది కార్మికులు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. వాల్వ్ సరిగా లేకపోవడంతో గ్యాస్ లీక్ అయింది.

ఈ ఏడాదిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాలు భవిష్యత్తులో ఇటువంటి విషాదాలను నివారించడనికి గుణపాఠంగా కనిపిస్తాయి. మనం తీసుకోవల్సిన అగ్నిమాపక భద్రతా చర్యలతో పాటు అత్యవసర సంసిద్ధత  ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement