
థియేటర్స్‌లోకి వచ్చేందుకు మేజర్ సిద్ధమయ్యాడు. ముంబై 26/11 దాడుల్లో వీరోచితంగా పోరాడిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఇందులో సందీప్‌గా అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఇది.
ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ముంబై 26/11 దాడుల్లో సందీప్ వీరోచిత పోరాటంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment