Adivi Sesh Hit 2 Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Hit 2 Release Date: ‘హిట్‌ 2’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి

Published Mon, May 2 2022 12:33 PM | Last Updated on Mon, May 2 2022 1:46 PM

Adivi Sesh Hit 2 Movie Release On July 29th - Sakshi

Adivi Sesh Hit 2 Movie Release Date Locked: నాని నిర్మాతగా విశ్వక్‌ సేన్‌ హీరోగా 2020లో వచ్చిన 'హిట్ .. ది ఫస్టు కేస్' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్వీక్వెల్‌గా హిట్‌ 2ను నిర్మించారు. ఈ సీక్వెల్‌లో అడవి శేష్‌ హీరోగా నటించాడు. ' హిట్ ది సెకండ్ కేస్' అనే టైటిట్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు మేకర్స్‌. జూలై 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇస్తూ పోస్టర్‌ను వదిలిలారు. 

చదవండి: రాజీవ్‌తో విడాకులపై స్పందించిన యాంకర్‌ సుమ

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. జాన్ స్టీవర్టు సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి - కోమలి ప్రసాద్ కథానాయికలుగా అందాల సందడి చేయనున్నారు. భానుచందర్‌, రావు రామేశ్‌,  పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే అడివి శేష్ మరో చిత్రం మేజర్‌ 'మేజర్' మే 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ మూవీని సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement