హీరో నాని (Nani) సినిమా షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. హిట్ 3 మూవీ (HIT: The Third Case) షూటింగ్‌లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కేఆర్ కృష్ణ (30) మృతి చెందింది. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో షూటింగ్ జరుగుతుండగా కృష్ణకు గుండెపోటు రావడంతో మరణించింది.
కాగా హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో భాగమే హిట్: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే1 విడుదల చేయనున్నారు.
చదవండి: ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్‌కు నాగవంశీ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment