Nani Announces The Sequel Of HIT2 With Adivi Sesh As The Lead Actor - Sakshi
Sakshi News home page

‘హిట్‌’ సీక్వెల్:‌ హీరో ఎవరో తెలుసా..?‌

Published Sat, Mar 20 2021 12:37 PM | Last Updated on Sat, Mar 20 2021 2:06 PM

Adivi Seshu In HIT2: Nani Announces Sequel Of Hit  - Sakshi

యువ హీరో విశ్వ‌క్‌సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘హిట్’‌ చిత్రం సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందుకుంది. హీరో నాని నిర్మించిన ఈ సినిమా విశ్వక్‌కు ప్రత్యేక గుర్తింపును అందించింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు హిట్ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ లో విశ్వక్ సేన్ నటించడం లేదు. సెకండ్ పార్ట్‌లో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు. 

హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే హిట్‌ 2 సినిమా రూపొందనుంది. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. తాజాగా శనివారం 'హిట్‌ 2' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను ఆడవి శేషు ట్విటర్‌ వేదికగా విడుదల చేశాడు. 

ఈ సినిమాలో క్రిష్ణ దాస్ పాత్రలో అడవి శేషు కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తోంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కనిపించనుంది. 'ది సెకండ్‌ కేస్‌' అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా తెలంగాణకు చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ సినిమాను రూపొందించగా..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిట్‌ టీమ్‌ ఓ ఇంట్రెస్టింగ్‌ కేసును ఆఫీసర్‌ కేడీ ఆసక్తికరంగా ఎలా డీల్‌ చేస్తారో హిట్‌-2లో చూపించబోతున్నారు.

చదవండి: మరో ఇంట్రెస్టింగ్‌ కేసుతో 'హిట్‌ 2'
అందం.. అదితిరావు హైదరి సొంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement