Adivi Sesh First Pan India Movie: Major Worldwide On June 3, New Poster Out - Sakshi
Sakshi News home page

Major Release Date: 'మేజర్‌' కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Wed, Apr 27 2022 11:57 AM | Last Updated on Wed, Apr 27 2022 12:57 PM

Adivi Sesh Major Film Worldwide On June 3 - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘మేజర్‌’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్‌ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘ శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది.

చదవండి: యంగ్‌ హీరోపై వరుస కేసులు

వ్యభిచారం చేయాలని నిర్మాత ఒత్తిడి.. నటి ఆత్మహత్యాయత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement