
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్.
'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు.
చదవండి: డేటింగ్ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్..
ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్.
చదవండి: బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే..
ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment