Actress Saiee Manjrekar Shares Interesting Things About Major Movie And Adivi Sesh - Sakshi
Sakshi News home page

Major Movie: మేజర్‌ షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ తండ్రి చనిపోయారు, అయినా..

Published Thu, Jun 2 2022 9:01 PM | Last Updated on Fri, Jun 3 2022 8:52 AM

Saiee Manjrekar About Major Movie And Adivi Sesh - Sakshi

హీరో అడివి శేష్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'మేజర్' చిత్ర కథానాయిక సయీ మంజ్రేకర్  మీడియాతో ముచ్చటించారు. సయీ పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి..

'మేజర్'  చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
మేజర్ చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తా. మేజర్ సందీప్‌కు చిన్ననాటి ప్రేమికురాలిగా, అలాగే సందీప్ భార్యగా కనిపిస్తా. చిన్ననాటి సన్నివేశాల్లో చాలా ప్యూరిటీ వుంటుంది. ఒక సాధారణ కుర్రాడు అసాధారణ పనులు ఎలా చేశారనేది మేజర్‌లో చూస్తారు. నాది నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్ర. ఫస్ట్ డే షూటింగ్ లో చాలా కంగారు పడ్డా. తెలుగు సరిగ్గా అర్ధమేయ్యేది కాదు. అయితే ఫస్ట్ షెడ్యుల్ పూర్తయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతలా అంటే మేజర్ లో నా పాత్రకి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చెప్పా.

సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాలో చేయడం ఎలా అనిపించింది ? 
మహేశ్‌బాబు గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. సల్మాన్ ఖాన్, అల్లు బాబీ, ఇప్పుడు మహేశ్‌బాబు గారి నిర్మాణంలో చేశాను. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా.

మేజర్ సందీప్ తల్లిదండ్రులని కలిశారా?
తాజ్‌లో జరిగిన మేజర్ సందీప్ స్మారక కార్యక్రమంలో ఒకసారి వారి పేరెంట్స్‌ను కలిశాను. దీని తర్వాత రెండు రోజుల క్రితం బెంగళూర్‌లో జరిగిన మేజర్ ప్రివ్యూలో మళ్ళీ వారిని కలిశాను. చాలా గొప్ప వ్యక్తులు. మేజర్ సందీప్ తల్లి గారిని చూస్తే నా మదర్‌ను చూసినట్లే అనిపించింది. గొప్ప ప్రేమ, ఆప్యాయత వున్న వ్యక్తులు.

మేజర్ చూసిన తర్వాత మేజర్ సందీప్ తల్లితండ్రుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? 
మేజర్ సినిమా గురించి మేజర్ సందీప్ కజిన్ ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టొరీ పోస్ట్ చేశారు. అందులో నా పనితీరు సందీప్ తల్లి ధనలక్ష్మీ గారికి చాలా నచ్చిందని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. నా పనితీరు వారికి నచ్చింది. ఇంతకంటే ఏం కోరుకోను. 

కథ ప్రకారం మీరు సందీప్ కి ప్రపోజ్ చేస్తారా? సందీప్ మీకు ప్రపోజ్ చేస్తారా ? 
ఇద్దరూ( నవ్వుతూ) చాలా క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టొరీ అది.

మేజర్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
నమ్రత మేడమ్ గారు మా పేరెంట్స్ కి తెలుసు. నమ్రత గారు కాల్ చేసి మేజర్ లో రోల్ గురించి అమ్మకి చెప్పారు. మా నాన్నగారు ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని చెప్పారు. తర్వాత శేష్  గారిని కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్ల ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం. 

మేజర్ సినిమాలో మీకు నచ్చిన పాత్ర?
మేజర్ సందీప్ రియల్ హీరో. ఆయన పాత్ర అందరికీ నచ్చుతుంది. మేజర్ సందీప్ తల్లి పాత్ర చేసిన రేవతి గారికి నేను ఫిదా అయిపోయాను. రేవతి గారు అద్భుతంగా చేశారు. 'మేజర్' సినిమాకి మేజర్ సందీప్ ఆత్మలాంటి వారైతే మేజర్ తల్లి ధనలక్ష్మీ పాత్ర పోషించిన రేవతి గారు సందీప్‌కి ఆత్మలాంటి పాత్ర. చాలా గొప్పగా ఉంటుంది.

అడివి శేష్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
అడవి శేష్ గారు గ్రేట్ డెడికేషన్ పర్సన్. అన్ని విషయాల్లో  సహాయం చేస్తారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎలాంటి విసుగు లేకుండా చాలా కూల్ గా సమాధానం ఇస్తుంటారు. చాలా మంచి విషయాలు చెబుతుంటారు.  ఆయన ప్రాంక్ లు కూడా చేస్తారు ( నవ్వుతూ) నాకు బల్లులు అంటే భయం. చాలా అందంగా ఒక గిఫ్ట్ ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేస్తే అందులో రెండు బల్లులు వున్నాయి( నవ్వుతూ). 

దర్శకుడు శశి కిరణ్ తిక్కా తో పని చేయడం ఎలా అనిపించింది ? 
శశి గారు చాలా కూల్‌గా వుంటారు. ఆయన విజన్ చాలా క్లియర్ వుంటుంది. మేజర్ జరుగుతున్నపుడే శశిగారి ఫాదర్ చనిపోయారు. అయినా ఆయన ఎంతో ధైర్యంగా సెట్స్‌కు వచ్చారు. శశి చాలా అద్భుతమైన డైరెక్టర్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది.

మీ పాత్ర తెలుగులో డబ్బింగ్ చెప్పారు కదా.. తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది ?
తెలుగు వెర్షన్ వైజాగ్ లో చూశా. అసలు డబ్బింగ్ చెప్పింది నేనేనా అని నమ్మలేకపోయా. చాలా రోజుల క్రితమే డబ్బింగ్ పూర్తి చేశాను. మాట పలకడం, డిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పాను. ఒక్కసారిగా తెరపై చూసేసరికి చాలా సర్ప్రైజ్ అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. చిత్ర యూనిట్ తో పాటు మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇకపై డబ్బింగ్ చెప్పడానికే ప్రయత్నిస్తా. 

తెలుగులో రెండు సినిమాలు చేశారు కదా.. తెలుగు పరిశ్రమ ఎలా అనిపించింది ? 
తెలుగు చిత్రపరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ అంతా చాలా ఆప్యాయంగా వుంటారు. అందరూ డెడికేట్ గా వర్క్ చేస్తారు. చాలా కష్టపడతారు. హైదరాబాద్ కల్చర్ నాకు చాలా నచ్చింది. 

మీ కొత్త సినిమాలు ? 
కొన్ని కథలు విన్నాను. హిందీలో ఓ సినిమా చేస్తున్నా. త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉంది.

చదవండి: కేకే పడిపోయిన వెంటనే సీపీఆర్‌ చేసుంటే బతికేవారు: డాక్టర్‌
బన్నీతో అక్షయ్‌ సినిమా? నిజంగా హింటిచ్చాడా! లేక మామూలుగానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement