Watch: Adivi Sesh Major Movie Hrudayama Full Video Song Released - Sakshi
Sakshi News home page

Major Movie Hrudayama Video Song: ‘మేజర్‌’ నుంచి మరో మెలోడీ సాంగ్‌, ఆకట్టుకుంటున్న పాట

Published Wed, May 25 2022 3:13 PM | Last Updated on Wed, May 25 2022 3:56 PM

Hrudayama Melody Song Release From Adivi Sesh Major Movie - Sakshi

యంగ్‌ హీరో అడవి శేష్‌ తాజాగా నటించిన చిత్రం మేజర్‌. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.  శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 3న  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: 'డెడ్‌' అని సమంత పోస్ట్‌.. ఆ వెంటనే డిలీట్‌

మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన పోస్టర్స్‌, ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్‌ను వదిలారు మేకర్స్‌. ‘హృదయమా’ అంటూ సాగే ఈ పాటను సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్‌, రమేశ్‌ కుమార్‌లు సాహిత్యం అందించారు.

చదవండి: Pushpa 2: రూ.400 కోట్ల బడ్జెట్‌.. పుష్ప 2కు ఆ సీన్‌ హైలైట్‌ అట

ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్‌ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్‌ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్‌లో మేజర్‌ రిలీజ్‌ కానుంది. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్‌ జోడిగా సయూ మంజ్రేకర్‌ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement