Allu Arjun about 'Major Movie': Allu Arjun Praises Adivi Sesh Major Movie - Sakshi
Sakshi News home page

Major Movie: ప్రతి భారతీయుడి మనసును తాకే గొప్ప సినిమా: అల్లు అర్జున్‌

Jun 4 2022 7:10 PM | Updated on Jun 4 2022 8:40 PM

Allu Arjun Praises Adivi Sesh Major Movie - Sakshi

'మేజర్‌ టీమ్‌కు శుభాకాంక్షలు. సినిమా మనసు హత్తుకునేలా ఉంది. మ్యాన్‌ ఆఫ్‌ ద షో అడివిశేష్‌ వెండితెరపై మరోసారి మ్యాజిక్‌ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయూ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ఇతర నటీనటులు ప్రతిభావంతంగా నటించారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన బీజీఎమ్‌ అయితే మతి పోగొడుతోంది. డైరెక్టర్‌ శశికిరణ్‌ సినిమాను చాలా అద్భుతంగా, అందంగా మలిచాడు. గుండెల్ని పిండేసే సి

Allu Arjun about 'Major Movie': 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ అధికారి సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌. సందీప్‌ పాత్రలో యంగ్‌ హీరో అడివి శేష్‌ నటించాడు. సయూ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ కథానాయికలు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ మూవీతో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిలిం ఇండియా నిర్మించింది. జూన్‌ 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ లభించింది. తాజాగా ఈ సినిమాపై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసలు కురిపించాడు.

'మేజర్‌ టీమ్‌కు శుభాకాంక్షలు. సినిమా మనసు హత్తుకునేలా ఉంది. మ్యాన్‌ ఆఫ్‌ ద షో అడివిశేష్‌ వెండితెరపై మరోసారి మ్యాజిక్‌ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయూ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ఇతర నటీనటులు ప్రతిభావంతంగా నటించారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన బీజీఎమ్‌ అయితే మతి పోగొడుతోంది. డైరెక్టర్‌ శశికిరణ్‌ సినిమాను చాలా అద్భుతంగా, అందంగా మలిచాడు. గుండెల్ని పిండేసే సినిమాను అందించిన నిర్మాత మహేశ్‌బాబుగారికి ప్రత్యేక గౌరవాభినందనలు. ప్రతి భారతీయుడి గుండెను తాకే గొప్ప సినిమా మేజర్‌' అంటూ ట్వీట్‌ చేశాడు బన్నీ. దీనిపై అడివి శేష్‌ స్పందిస్తూ.. 'క్షణం నుంచి మేజర్‌ వరకు మీరు చూపించిన ప్రేమ, అందించిన సపోర్ట్‌కు కృతజ్ఞతలు. నా పుట్టినరోజు(డిసెంబర్‌ 17) పుష్ప గిఫ్టిచ్చారు. ఇప్పుడు మేజర్‌ విజయాన్ని మరింత అందంగా మలిచారు' అని రిప్లై ఇచ్చాడు.

చదవండి:  హోటల్‌లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు..
‘మేజర్‌’ తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement