Adivi Sesh Major Movie Release Date: First Glimpse Out, అడివి శేష్‌ 'మేజర్‌' మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా? - Sakshi
Sakshi News home page

Adivi Sesh: అడివి శేష్‌ 'మేజర్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఎప్పుడంటే..

Published Tue, Feb 22 2022 5:10 PM | Last Updated on Tue, Feb 22 2022 5:35 PM

Adivi Sesh Major Film Locked Release Date First Glimpse Is Here - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం మేజ‌ర్ ( 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్నిక్రిష్ణ‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది ఈ చిత్రం​. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేస్తూ స్పెషల్‌ గ్లింప్స్‌ వీడియోను హీరో అడివి శేష్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

కాగా  ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ‌తోపాటు బాలీవుడ్ హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ మ‌రో ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement