‘సాహో సీత’.. ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు | Anand Mahindra Praised Major Sita Ashok Shelke | Sakshi
Sakshi News home page

‘సాహో సీత’.. ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

Published Sun, Aug 4 2024 1:51 PM | Last Updated on Sun, Aug 4 2024 3:18 PM

Anand Mahindra Praised Major Sita Ashok Shelke

కేరళ వయనాడ్‌ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే.. దేశంలోని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా ఆర్మీ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కోపై ప్రశంసల వర్షం కురిపించారు.

మేజర్ సీతా అశోక్ షెల్కే ఫోటోను షేర్ చేస్తూ ఆమెను వయనాడ్ వండర్‌ఫుల్‌ ఉమెన్‌ అంటూ కొనియాడారు.మాకు డీసీ సూపర్ హీరోలు అవసరం లేదు. ఎందుకంటే మాకు నిజజీవితంలో మేజర్ సీతా అశోక్ షెల్కేలాంటి వారు ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.  

 ఆర్మీ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కో ఎవరు?
భయంకరమైన విషాదాన్ని నింపిన వయనాడ్‌లో బాధితుల్ని రక్షించేందుకు రికార్డ్‌ సమయంలో తాత్కాలిక వంతెనల నిర్మాణం సీత ఆధ్వర్యంలోనే జరిగింది. వయనాడ్‌లో ముందక్కై, చురాల్‌మల్‌లను కలుపుతూ ప్రతికూల వాతావరణంలో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం జులై 31 రాత్రి 9గంటలకు ప్రారంభించి.. మర్నాడు సాయంత్రం 5.30గంటలకల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను త్వరగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొండచరియలు విరిగిపడి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం మరింత సులభమైంది. అందుకే దేశ ప్రజలు ఆర్మీ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కోను అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement