release postponed
-
'గేమ్ ఛేంజర్' వాయిదా.. అదే అసలు కారణం?
‘‘ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ, ఈగల్, హనుమాన్’ తదితర సినిమాలు విడుదల కానున్నాయి. ఐదుగురు నిర్మాతలనూ పిలిచి మాట్లాడాం. రెండు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని సూచించాం. సంక్రాంతి పోటీలో ఉండకూడదని నా సినిమా ‘గేమ్ ఛేంజర్’ను వేసవికి వాయిదా వేశాం. ఎవరైనా రిలీజ్ వాయిదా వేసుకుంటే.. సోలో రిలీజ్ చేసేలా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున చర్యలు తీసుకుంటాం’’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జనవరి 21న ‘లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ’ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న ‘దిల్’ రాజు సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ గురు రామాచారి మాట్లాడుతూ– ‘‘దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆశీస్సులతో 1999లోప్రారంభమైన ఈ అకాడమీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవానికి సారథ్యం వహించాలని డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత ‘దిల్’ రాజుగార్లను కోరగానే ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘దిల్’ నుంచి రామాచారిగారితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో ‘లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ’ గురించి చెప్పారాయన. ఈ అకాడమీలో ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నారు. అద్దె భవనంలో ఉన్న అకాడమీకి ప్రభుత్వం తరఫున సాయం వచ్చేలా చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. -
ఆలస్యంగా వస్తున్న జవాన్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి, కీలక పాత్రల్లో సంజయ్ దత్, దీపికా పదుకోన్ నటించారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ‘జవాన్’ సినిమాను షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. కాగా ఈ సినిమాను తొలుత జూన్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండటం ‘జవాన్’ రిలీజ్ వాయిదా పడటానికి ముఖ్య కారణమని బాలీవుడ్ సమాచారం. -
ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం గతంలో అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేసి ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అందించారు మేకర్స్. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరౌత్ తెలియజేస్తూ సోమవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి’’ అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం కానుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib — Om Raut (@omraut) November 7, 2022 -
అడివి శేష్.. మేజర్ వాయిదా
అడివి శేష్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ‘మేజర్’ విడుదల వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
థియేటర్స్‌లోనే గుడ్‌లక్
కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం. దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. -
వెనక్కు తగ్గిన రానా.. విరాటపర్వం వాయిదా
విభిన్నమైన పాత్రలను చేసేందుకు ఏమాత్రం వెనకాడని హీరో రానా దగ్గుబాటి. హిట్టూఫట్టు అని లెక్కలేసుకోకుండా జనాలకు మంచి కథలందించాలని చూసే ఈ హీరో ప్రస్తుతం విరాటపర్వంతో, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. వీటితోపాటు సుకుమార్ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో 1940 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్టోరీతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కరోనా దెబ్బకు కకావికలమైన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్ జగదీష్ వంటి పలు చిత్రాలు వాయిదా బాట పట్టగా తాజాగా విరాటపర్వం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. ఈ మేరకు రానా సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశాడు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని తెలిపాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: 1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం స్టోరీ టెల్లింగ్ బాగుంది: చిరంజీవి -
సినిమాలకు మళ్లీ బ్రేక్: ‘టక్ జగదీశ్’ వాయిదా
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ వాయిదా పడగా, చిరంజీవి సినిమా ఆచార్య కూడా వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. మహమ్మారి వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని ప్రకటించాడు. ఈ సినిమా వాయిదాతో మళ్లీ సినిమాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్డౌన్ వలన ఏడు ఎనిమిది నెలలు థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. థియేటర్లు బంద్ కాలేదు కానీ సినిమావాళ్లే ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేసుకుంటున్నారు. తన సినిమా వాయిదాపై నాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో ప్రకటన చేశాడు. అనంతరం ట్విటర్లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నెలకొన్న కారణాల వల్ల టక్ జగదీశ్ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ‘విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాణంలో ‘టక్ జగదీశ్’ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఏప్రిల్ 23వ తేదీన విడుదల కావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
సెకండ్ వేవ్ సినిమా.. మూడు నెలల ముచ్చటేనా?
కరోనా మళ్ళీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ స్పీడుగా వ్యాపిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... సినీ పరిశ్రమపై మళ్ళీ ప్రభావం చూపుతోంది. దేశంలోకెల్లా కరోనా కేసులు ఎక్కువున్న... మహారాష్ట్ర సినిమా హాళ్ళు పూర్తిగా మూసేసింది. హిందీ రిలీజులు వాయిదా పడుతున్నాయి. కర్ణాటక సహా దేశంలోని అనేక రాష్ట్రాలేమో... 50 శాతం సీటింగ్ కెపాసిటీకి దిగి వచ్చాయి. కన్నడ పునీత్ రాజ్‌కుమార్ ‘యువరత్న’ రిలీజైన వారం రోజులకే ఇవాళ్టి నుంచి ఓటీటీ బాట పట్టింది. తమిళ సర్కార్ నేటి నుంచే సీటింగ్ తగ్గించేసింది. ఫుల్ కెపాసిటీ ఉన్నా... తెలుగునాట హాళ్ళలో జనం పలచబడుతున్నారు. ‘లవ్‌స్టోరీ’ పోస్ట్‌పోన్ అయింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలంగాణ హైకోర్టు అడుగుతోంది. మరి, ఇప్పుడిక... మన సినిమా హాళ్ళ సంగతేమిటి? రిలీజవ్వాల్సిన మిగతా తెలుగు సిన్మాల భవిత ఏమిటి? సరిగ్గా ఏడాది క్రితం... కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్ డౌన్లో ఉంది. హాళ్ళు మూసేశారు. సినిమాలు లేవు. సమ్మర్ మొదలు గత డిసెంబర్ దాకా సినీ వ్యాపారమే తుడుచుకుపోయింది. ఏడాది తరువాత... ఇప్పుడు లాక్ డౌన్ లేదు. కరోనా మాత్రం బలంగానే ఉంది. హాళ్ళు తెరిచారు. సినిమాలు వస్తున్నాయి. కానీ, సెకండ్ వేవ్ దెబ్బతో ఇప్పుడు క్రమంగా హాలుకు వచ్చే జనమే తగ్గుతున్నారు. రెండువారాలుగా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో తెలుగు నాట కూడా సినిమా హాళ్ళపై షరతులు తప్పేలా లేవు. దాంతో, భారీ ఖర్చు పెట్టి తీసి, అంతే భారీగా వ్యాపారమూ జరుపుకొన్న పెద్ద సినిమాల రిలీజులు డోలాయమానంలో పడ్డాయి. తాజాగా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా తాజా పరిస్థితికి నిదర్శనం. టెస్టుల నడుమే... తెగ షూటింగ్స్ నిజానికి, లాక్డౌన్ ఎత్తేశాక∙ఒక దశలో తెలుగునాట షూటింగులు పీక్‌కి వెళ్ళాయి. రోజూ ఏకంగా 120కి పైగా షూటింగులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేప్తో ఆ జోరూ కొంత తగ్గింది. అయితేనేం... ఇప్పటికీ సినిమాలైతేనేం, వెబ్ సిరీస్లైతేనేం... రోజుకు సగటున 80 షూటింగులైతే తెలుగునాట జరుగుతున్నాయి. ‘‘షూటింగుల కోసం తగినంత మంది టెక్నీషియన్లైనా దొరకని పరిస్థితి. చివరకు, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న మా భారీ చిత్రానికి కావాల్సినంత మంది మేకప్మ్యాన్లు కూడా దొరకడం లేదంటే నమ్మండి’’ అని ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అయితే, ఈ షూటింగుల్లో శానిటైజేషన్, పదే పదే టెస్టులకే శ్రమ, ఖర్చు తడిసిమోపెడవుతున్నాయి. ఇటీవల అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ షూటింగు కోసం 100 మంది జూనియర్ ఆర్టిస్టులకు టెస్టులు చేస్తే, 45 మందికి పాజిటివ్ వచ్చింది. గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ సహా తెలుగునాట పలు సినిమా యూనిట్లు ముంబయ్, చెన్నైల నుంచి వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించి కానీ, షూటింగుకు అనుమతించడం లేదు. ‘‘రోజూ భారీ యూనిట్‌తో షూటింగ్ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్ళను ఒక రోజు ముందే వచ్చి, పరీక్ష చేయించుకోమంటున్నాం. స్థాని కులకు సైతం రెండు రోజులకు ఒకసారి ర్యాపిడ్ టెస్టులు చేయిస్తున్నాం’’ అని ‘శాకుంతలం’ చిత్ర వర్గాలు తెలిపాయి. హిందీలో వాయిదా పర్వం టెస్టులు, షూటింగుల మాటెలా ఉన్నా – కరోనా విజృంభణ ఆగడం లేదు. సామాజిక దూరంతో షూటింగులు జరుపుకొంటున్న హిందీ చిత్రసీమ చివరకు మూతపడ్డ హాళ్ళు, వివిధ ప్రాంతాల్లోని కర్ఫ్యూ, లాక్డౌన్, 144 సెక్షన్ల నిబంధనలతో ఏకంగా రిలీజులు వాయిదా వేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు హిందీ సినిమాలు వాయిదా బాట పట్టాయి. రానా నటించిన తెలుగు వెర్షన్ ‘అరణ్య’ రిలీజైంది కానీ, దాని రిలీజుకు మూడు రోజుల ముందే మార్చి 23న హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ రిలీజ్’ను చిత్రనిర్మాణ సంస్థ ఈరోస్ నిరవధికంగా వాయిదా వేసింది. ఇక, అమితాబ్ ‘చెహరే(’ ఏప్రిల్ 9న విడుదల కావాల్సింది. దాన్నీ వాయిదా వేశారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈ నెల 30న రిలీజు చేద్దామనుకున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశి’ సైతం తాజా పరిస్థితుల్లో మళ్ళీ నిరవధికంగా వాయిదా పడింది. ‘బబ్లీ ఔర్ బంటీ 2’ సహా అనేకం ఇప్పటికే పోస్ట్పోనయ్యాయి. కరోనా సెకండ్, ఆపై థర్డ్‌వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ సినిమాలు కానీ, వీటి తరువాత రిలీజనుకున్న ఇతర సినిమాలు కానీ అను కున్నట్టు రిలీ జవడం కచ్చితంగా అనుమానమే! పచ్చిగా చెప్పాలంటే, అసంభవమే!! మూడు నెలల ముచ్చటేనా? నిజానికి, అన్–లాక్డౌన్ తరువాత సినీరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హాలీవుడ్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ వేల కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క గత డిసెంబర్లో హాళ్ళు తెరవడానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. సగం థియేటర్ కెపాసిటీలో సైతం సంక్రాంతి సిన్మాలు ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’ లాంటివి వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ తరువాత ఫిబ్రవరి 5 నుంచి పూర్తి కెపాసిటీకి అనుమతి ఇచ్చాక, తెలుగులో చిన్న, పెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చాయి. ఫిబ్రవరి 12న వచ్చిన ‘ఉప్పెన’తో హాళ్ళు పూర్తిగా హౌస్ ఫుల్ అయి, కరోనా మునుపటి రోజుల్ని గుర్తు చేశాయి. ఇక కరోనాతో జీవితంలో నవ్వు కరవైన జనాన్ని మార్చి 11న వచ్చిన ‘జాతిరత్నాలు’ నవ్వించి, అనూహ్య విజయంతో పాటు, అద్భుతమైన షేర్లు రాబట్టింది. తాజా హాలీవుడ్ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అయితే ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు భాషల్లోనూ తెలుగునాట బాగా ఆడుతోంది. అందుకే, ‘‘గడచిన మూడున్నర నెలల్లో మన దేశం మొత్తం మీద మిగతా సినీపరిశ్రమలతో పోలిస్తే, తెలుగు సినిమాయే బాగుంది. తెలుగు స్ఫూర్తితో తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రసీమల్లోనూ ఉత్సాహం పుంజుకుంది’’ అని తమిళ హీరో కార్తీ, కన్నడ పునీత్ రాజ్ కుమార్ సైతం ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టే క్రమంగా మిగతాచోట్లా వసూళ్లు పెరిగాయి. మాలీవుడ్‌లో మమ్ముట్టి ‘ది ప్రీస్ట్’ కరోనా తర్వాత ఫస్ట్ బ్లాక్‌బస్టరైంది. కోలీవుడ్‌లో ఈ నెల 2న రిలీజైన కార్తీ ‘సుల్తాన్’ మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా గ్రాస్ సాధిం చింది. టాలీవుడ్‌లోనూ భారీ బిజినెస్ జరుగుతోంది. ఏడాది తర్వాత బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతున్నవేళ, ఇదంతా మూడునెలల ముచ్చటేనా అనిపించేలా సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్ళీ కలవరంలోకి నెట్టింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జనంపైనా, సరిగ్గా కరోనా నిబంధనలు పాటించని థియేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి, సుదర్శన్ థియేటర్ల ఓనరైన బాలగోవిందరాజు అంగీకరించారు. అయితే, ‘‘అలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా, ఎకాఎకిన హాళ్ళ కెపాసిటీ 50 శాతం తగ్గించడం మొదలు మూసివేత దాకా సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సినీపరిశ్రమకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో హాళ్ళలో యాభై శాతం కెపాసిటీకే అనుమతి అని షరతు పెడితే వ్యాపారం దాదాపు సున్నాయే. ‘‘ఆ షరతు మళ్ళీ పెడితే – జనం లేకుండా హాళ్ళు నామ్ కే వాస్తే నడుస్తాయే తప్ప, నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రతినిధి అన్నారు. ‘‘కెపాసిటీ 50 శాతమే ఐనా, ఖర్చు మాత్రం ఎప్పటిలానే వంద శాతం తప్పదు’’ అని శాలిబండ సుధా మల్టీప్లెక్స్ ఓనర్ కె. అనుపమ్ రెడ్డి వాపోయారు. కానీ, వ్యాపారం కన్నా జనం క్షేమం బాగుండాలని కోరుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. మూసినా... సగమే తెరిచినా... దెబ్బ మీద దెబ్బే! గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 నెలలకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్న నేపథ్యంలో సహజంగానే అడ్వా¯Œ ్స బుకింగులు జోరుగా సాగుతున్నాయి. కోర్టు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా తెచ్చుకుంటున్న ఉత్తర్వులతో తెలంగాణలో టికెట్ రేట్లూ సింగిల్ స్క్రీన్లలో రూ. 150కి, మల్టీప్లెక్సుల్లో రూ. 200కి ఎగబాకాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో ఓ హౌస్ ఫుల్ స్టార్ సినిమా రిలీజైతే, ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడేవారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే ఉంది. కొందరు ఎగ్జిబిటర్లే అది ఒప్పుకుంటున్నారు. అందుకే లాక్డౌన్ ఉండదనీ, హాళ్ళను మూయబోమనీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా – గుంపుల కొద్దీ జనంతో, వ్యాప్తికి కారణమయ్యే థియేటర్లపై ఆంక్షలు విధించడం పెద్ద పనేమీ కాదు. కర్ణాటక, తమిళనాడు బాటలో ఇతర రాష్ట్రాల్లో సైతం మళ్లీ 50 పర్సెంట్ కెపాసిటీతోనే థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు ఆదేశించేంచే ఛాన్స్ బలంగా ఉంది. తమిళ సర్కారు సైతం ఎన్నికలు ముగిశాక సరిగ్గా ధనుష్ ‘కర్ణన్’ రిలీజు రోజు నుంచి షరతులు పెట్టింది. ‘వకీల్ సాబ్’ సహా తెలుగులోనూ పలుకుబడి గల పెద్దల సినిమాలు రిలీజైపోతాయి గనక, ఇక్కడా హాళ్ళపై ఆంక్షలు రావడం ఖాయం. అదే జరిగితే... కలెక్షన్లే కీలకమైన ‘ఆచార్య’ సహా అనేక స్టార్ సినిమాల రిలీజ్ ప్రశ్నార్థకమే. అదే ఇప్పుడు ఎగ్జిబిటర్లకూ, వారి అడ్వాన్సుల మీద ఆధారపడ్డ బయ్యర్లకూ, వారితో వ్యాపారం చేసి సిన్మా రిలీజు చేసే నిర్మాతలకూ కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. ఒక్కమాటలో – ఇదంతా ఓ చెయిన్ రియాక్షన్. వెరసి, ఇప్పుడిప్పుడే కాళ్ళూ చేతులూ కూడదీసుకుంటున్న సినీ పరిశ్రమపై ఈ సెకండ్ వేవ్‌తో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. తగ్గుతున్న జనం... తరిగిపోతున్న కలెక్షన్లు... కరోనా సెకండ్ వేవ్ సమాజంతో పాటు సినిమా మీదా గట్టిగా ప్రభావం చూపెడుతోంది. ‘‘కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, హాళ్ళకొచ్చే జనం రెండు వారాలుగా తగ్గుతున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక... ఫరవాలేదనుకున్న సినిమాలకు సైతం మంచి కలెక్షన్లే వస్తే, ఇప్పుడు బాగున్న సినిమాలకు కూడా ఫరవా లేదనే స్థాయి కలెక్షన్లయినా రావట్లేదు. అలా కొన్ని సినిమాలు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్‌లో బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోయాయి’’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ టి. బాలగోవిందరాజు వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెల మధ్య దాకా హౌస్ ఫుల్ బోర్డులు చూసిన ఏసీ హాళ్ళలో ప్రస్తుతం సగటున ఆటకు 30 నుంచి 40 శాతం ప్రేక్షకులే ఉంటున్నారు. గత నెల మొదట్లో ఫ్యామిలీలు, ఆడవాళ్ళు, పిల్లలతో కళకళలాడి పూర్వవైభవం వస్తోందని ఆశలు రేపిన హాళ్ళు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మూడు రాష్ట్రాల మార్కెట్ పాయె! తెలుగులో కూడా సినిమాలు ముందుగా ప్లాన్ చేసిన తేదీలకు వస్తాయా అన్నది సందేహమే. మహారాష్ట్రలో హాళ్ళు మూసేస్తే, కన్నడనాట ఈ నెల 7 నుంచి సినిమా హాళ్ళను సగం సీటింగుకే పరిమితం చేశారు. తాజాగా, తమిళనాడులో సైతం ఇవాళ (ఏప్రిల్ 9) నుంచి థియేటర్లలో 50 శాతం సీటింగే అని అక్కడి సర్కారు ప్రకటించింది. అలా ఇప్పుడు మన తెలుగు సినిమాకు ఈ మూడు పొరుగు రాష్ట్రాల మార్కెట్ పోయింది. ఆ దెబ్బ తెలుగు సిన్మా వ్యాపారం పైనా ఉంటుంది. ‘‘మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో హాళ్ళపై వచ్చిన నిర్ణయాల ప్రభావం మన సినీసీమపై ఇప్పటికే పడింది. రేపు పొద్దున మన దగ్గర థియేటర్లు ఎంత కెపాసిటీతో నడుస్తాయి, హాళ్ళు తెరిచి ఉన్నా జనం వస్తారా – ఇలా అందరం రకరకాల అనుమానాలతో ఉన్నాం’’ అని పేరు ప్రచురించవద్దంటూ ఓ సినీ నిర్మాత చెప్పారు. హాళ్ళు మూసిన మరాఠ్వాడా, ఢిల్లీ లాంటి చోట్ల మన సినిమానే రిలీజు కాదు. పెద్ద హీరోల సినిమాలకు బలమైన మార్కెటైన కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల రిలీజైనా సగం కెపాసిటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మారిన పరిస్థితుల్లో బయ్యర్లు సైతం ఒకప్పుడు తాము ఒప్పుకున్న రేట్లకు సినిమా కొంటారా, డబ్బు మొత్తం నిర్మాతలకు కడతారా అన్నదీ అనుమానమే. ఆ మేరకు రిలీజుకు ముందే వ్యాపారం, రిలీజయ్యాక సీటింగ్ తగ్గుదలతో కలెక్షన్లు తెలుగు సినిమా నష్టపోయినట్టే! హాట్‌స్పాట్‌గా హాళ్లు? ఒక హౌస్‌ఫుల్ స్టార్ సినిమా ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో రిలీజవుతుంది. ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడే వారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే పొంచి ఉంది. జనంలో భయం పోయి, నిర్లక్ష్యం పెరిగిందని గమనిస్తున్న కొందరు ఎగ్జిబిటర్లే ఆ సంగతి బాహాటంగా ఒప్పుకుంటున్నారు. పెరుగుతున్న పాజిటివ్‌లు హిందీ, తెలుగు సీమల్లో రోజూ పలువురు ‘పాజిటివ్’గా తేలుతున్నారు. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న నటి నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. దాంతో, ఆమెతో కలసి టీవీ ఇంటర్వ్యూలిచ్చిన అంజలి, అనన్య, దర్శకుడు శ్రీరామ్ వేణు సహా అందరూ టెస్టుల హడావిడి పడ్డారు. హిందీలో పలువురి పేర్లు బయటకు వస్తుంటే, మన దగ్గరేమో బయటపడి చెప్పకుండా హోమ్ క్వారంటైన్లో గడిపేస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. నివేదా ఎఫెక్ట్‌తో అంజలి స్టాఫ్‌కూ కరోనా సోకిందనీ, తనకూ తప్పదని అంజలి సైతం క్వారంటైన్లోకెళ్ళారనీ భోగట్టా. ఆమె మాత్రం తనకు కరోనా రాలేదని ఖండించారు. ఏమైనా, షూటింగుల్లో ఇప్పటికీ పదులమంది కరోనా పాజిటివ్‌గా తేలుతు న్నారు. ఇటీవలే టీజర్ రిలీజైన ఓ భారీ ‘స్టయిలిష్’ సిన్మా సెట్స్‌లో ఒకటికి, రెండు సెట్ల అసిస్టెం ట్లను పెట్టుకొని, ఒకరికి వస్తే మరొకర్ని దింపి, షూటింగ్ కానిచ్చేస్తున్నారు. తెలుగులోనూ... వాయిదాలు షురూ! తాజా పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు దర్శక,నిర్మాతలు గురువారం సాయంత్రం ప్రకటించారు. కానీ,ఈ సెకండ్ వేవ్‌లోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. తెలుగునాట రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి వెళుతుండడంతో రానున్న రోజుల్లో మళ్ళీ షరతులు విధించే అవకాశం ఉంది. నేడో, రేపో తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లలో సగం మందినే అనుమతించే సూచనలున్నాయి. అదే గనక జరిగితే, ‘వకీల్ సాబ్’ మొదలు ఈ నెలలోనే రిలీజు కావాల్సిన రానా ‘విరాటపర్వం’, మే నెలలో వస్తామన్న చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’ లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు ఇరుకున పడడం ఖాయం. పెట్టిన ఖర్చు మేరకు వ్యాపారం జరిగి, వసూళ్ళూ రావాలంటే – పరిస్థితులు చక్కబడే దాకా రిలీజు వాయిదా మినహా మరో మార్గం లేదు. ఈ నెలలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రావాల్సిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ సైతం ఇప్పటికే రిలీజు వాయిదా రూటు పట్టింది. కరోనాకు తోడు గ్రాఫిక్స్ సహా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది గనక ‘ఆచార్య’ వాయిదా ఖాయమైందని ఆంతరంగిక వర్గాల సమాచారం. వెరసి, ఈ డోలాయమాన పరిస్థితిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందో, ఏం జరుగుతుందో సినీరంగంలో ఎవరూ ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. – డాక్టర్ రెంటాల జయదేవ -
బీ-టౌన్లో కరోనా కష్టాలు.. టెన్షన్లో స్టార్ హీరోలు
గత ఏడాది మార్చిలో కరోనా విలన్లా ఎంట్రీ ఇచ్చి థియేటర్స్పై విరుచుకుపడింది. ఫలితంగా లాక్డౌన్ వచ్చి థియేటర్స్ అన్నీ మూతపడిపోయాయి. వెండితెర కళ తప్పింది. ఓ ఆరు నెలల తర్వాత కరోనా కొంత శాంతించింది. ఇక థియేటర్స్‌లో ప్రేక్షకుల చప్పట్లు వినిపిస్తాయని అనుకున్నారు. థియేటర్లు తెరుచుకున్నాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా రెట్టింపు బలంతో వచ్చింది. అంతే... బాలీవుడ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లను మూసేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దాంతో, సినిమా విడుదలకు దారేది? అంటూ బాలీవుడ్ ప్రముఖులు తలలు పట్టుకు కూర్చున్నారు. కొందరు తమ సినిమా విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతానికి ఐదు సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. ఒక పక్క బాలీవుడ్ స్టార్స్‌కు కరోనా బారినపడుతున్నారు. థియేటర్ల మూసివేత బాలీవుడ్ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ‘బంటీ ఔర్ బబ్లీ 2’, రానా ‘హాథీ మేరే సాథీ’, అమితాబ్ బచ్చన్ ‘చెహ్రే’, తాజాగా అక్షయ్‌కుమార్ ‘సూర్యవంశి’ సినిమాల విడుదలు వాయిదా పడ్డాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాలు వాయిదా పడనున్నాయో అని బీ టౌన్లో ఆల్రెడీ చర్చ మొదలైంది. ఓటీటీ బాటలో... గత ఏడాది విడుదల కావాల్సిన సినిమాలు కొన్ని వాయిదా పడుతూ ఈ ఏడాది రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి. అయితే, ఈ సినిమాలన్నీ థియేటర్స్‌లోనే వస్తాయన్న గ్యారంటీ లేదు. గత ఏడాది కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద పెద్ద సినిమాలు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ ఏడాది కూడా దాదాపు 14 సినిమాలు తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. గత ఏడాది హాట్‌స్టార్ ఒకేసారి 8 భారీ హిందీ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తాజా పరిణామాల దృష్ట్యా మళ్లీ సినిమాలన్నీ ఓటీటీ బాట పడతాయా అనే టెన్షన్ స్టార్ హీరోల అభిమానుల్లోను, ఎగ్జిబిటర్లలోనూ మొదలైంది. అందుకు ఓ ఉదాహరణ... సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓ బడా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. కానీ ముంబయ్ థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్స్ విన్నపం మేరకు ‘రాధే’ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని సల్మాన్ ప్రకటించారు. మే 13న చిత్రాన్ని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. అయితే కరోనా విజృంభణకు ముందు తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు ‘రాధే’ థియేటర్‌కి వస్తాడా? ఓటీటీలో దర్శనమిస్తాడా? అనేది హాట్ టాపిక్. అలాగే ’సూర్యవంశీ’ సినిమాను థియేటర్లలో చూస్తే బాగుండేలా తీశామని హీరో అక్షయ్‌కుమార్, దర్శకుడు రోహిత్ శెట్టి చెబుతూ వచ్చారు. ఈ నెల 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మరి... ఇదే బాటలోకి మిగతా సినిమాలు కూడా వస్తాయా? లేక ఆలస్యమైనా సరే థియేటర్స్‌లో విడుదల చేసేందుకే మొగ్గు చూపుతాయా అనేది చూడాలి. ఇంకో విషయం ఏంటంటే... ఇటీవల ప్యాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది కాబట్టి, ప్యాన్ ఇండియా చిత్రాల్లో హిందీ వెర్షన్ విడుదలను ఆపుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. మార్కెట్ పరంగా హిందీలో రిలీజ్ కావడం కూడా ముఖ్యమే. ‘బాహుబలి’ రెండు భాగాల వసూళ్ళు రూ. 1600 కోట్లకు పైనే అని ఓ లెక్క. ఈ వసూళ్లలో హిందీ మార్కెట్‌ది కూడా ప్రధాన వాటాయే. అంతెందుకు... బాలీవుడ్ బాక్సాఫీస్ టాప్ 10 మూవీస్‌లో ‘బాహుబలి’ ఒకటి. అలాంటిది ఇప్పుడు సరైన హిందీ మార్కెట్ లేకుండా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘కేజీఎఫ్ 2’ వంటి ప్యాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్‌ను భారీ స్థాయిలో ఊహించుకోగలమా?. హిందీలో రిలీజ్ చేయకుండా ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికీ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. కర్ణాటక థియేటర్స్‌లో సీటింగ్ ఆక్యుపెన్సీ యాభై శాతమే. తమిళనాడులో కూడా పరిస్థితులు అంత బాగాలేవు. లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత విజయ్ ‘మాస్టర్’, కార్తీ ‘సుల్తాన్ ’ మినహా, ఇప్పటివరకు అక్కడ మరి ఏ ఇతర స్టార్ మూవీలూ రిలీజవలేదు. ఒక్క టాలీవుడ్లో మాత్రమే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరి.. కేవలం తెలుగు భాషలోనే సినిమాలు విడుదలైతే భారీ వసూళ్లు ఉండవనే భయం నిర్మాతల్లో ఉంది. -
'కేజీఎఫ్' అభిమానులకు షాక్! వచ్చే ఏడాదికి..
కరోనా వైరస్ దేశ వాసుల ప్రాణాలపై ఏమాత్రం కనికరం చూపడంలేదు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ ఈ మహమ్మారి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం సినిమా షూటింగ్‌లపై మాత్రమే కాకుండా.. విడుదల తేదీలపై కూడా పడింది. దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కేజీఎఫ్-2 సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. (ఫైట్స్ బ్యాలెన్స్ గురూ) ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకున్న 'కేజీఎఫ్: చాప్టర్2'ను 2021కి వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో కేజీఎఫ్-2 సినిమా షూటింగ్ సైతం ఆగిపోయింది. దీంతో తిరిగి చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది తెలియకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్1’ చిత్రానికి సీక్వెల్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ('ఆయన మరణం తీరని లోటు') -
అరణ్య వాయిదా
రానా హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో ‘కాడన్’ పేర్లతో రూపొందిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ‘‘ప్రేక్షకుల అభిరుచికి ఈరోస్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇదివరకెన్నడూ చెప్పని విలక్షణ కథలతో సినిమాలు నిర్మించడానికి, పంపిణీ చేయడానికి ప్రేక్షకులు మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇటీవల వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మా సినిమా విడుదల తేదీని మార్చుతున్నాం. మా భాగస్వాములు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ, మనందరి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ కోరుకుంటూ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘25 ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. ఈ చిత్రంలో పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలను చర్చించాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శంతను మొయిత్రా, కెమెరా: ఎ.ఆర్. అశోక్‌కుమార్. ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూ సర్: భావనా మౌనిక. -
కరోనా ఎఫెక్ట్: రానా ‘అరణ్య’ విడుదల వాయిదా
కరోనా వైరస్ ప్రభావం సినిమా రంగంపై బలంగానే పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్స్‌ను పలు ప్రభుత్వాలు మూసివేయగా.. ఈ నెలలోనే కాదు వచ్చే నెలలో విడుదల కావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారీ ప్రభావంతో నాని ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’ సినిమా విడుదలను వాయిదా వేశారు. కరోనా వైరస్ కారణంగా విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సోమవారం ట్విటర్లో వెల్లడించారు. ప్రభు సోలోమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 2 విడుదల చేయాలని భావించారు. కానీ దేశంలో క్రమంగా కరోనా ప్రభావం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘త్వరలో థియేటర్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి’. అంటూ నిర్మాతలు ట్వీట్ చేశారు. (నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్) కాగా ఇప్పటికే కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్, పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగ్‌లు సైతం వాయిదా పడుతున్నాయి. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్ తమ సినిమాల షూటింగ్‌ను వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించారు. అలాగే అనుష్య నటించిన ‘నిశ్శబ్ధం’ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు కరోనాను క్యాష్ చేసుకునేందుకు టైటిల్లో కరోనా వచ్చేలా సినిమా పేరును ఖరారు చేసుకుంటున్నారు. (కరోనాపై రాజమౌళి ట్వీట్) అదే విధంగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ‘జెర్సీ’ సినిమా షూటింగ్‌ను కొన్ని రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు శనివారం ట్వీట్ చేశారు. అలాగే అక్షయ్ కుమార్ సూర్యవంశీ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. ఈ సినిమాను మొదట ఈ నెల 24 న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో విడుదలను వాయిదా వేశారు. అలాగే హాలీవుడ్ సినిమాలు ఎక్వైట్ ప్లేస్, ములన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9తో పాటు జేమ్స్ బాండ్ చిత్రం ‘నోటైమ్ టు డై’ కూడా విడుదల వాయిదా పడింది. (కరోనా దెబ్బ: సినిమా షూటింగ్‌లు బంద్) -
వెనక్కి తగ్గిన వర్మ..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భైరవ గీత. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాను 2.ఓ కు పోటిగా ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగా వర్మ ప్రచారం కార్యక్రమాలను కూడా తన స్టైల్లో కొనసాగించాడు. 2.ఓ చిన్న పిల్లల సినిమా అంటూ కామెంట్ చేసి భైరవ గీతకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకువచ్చాడు. అయితే చివరి నిమిషంలో వర్మ వెనుకడుగు వేశాడు. సెన్సార్ సమస్యలతో పాటు సాంకేతిక కారణాల వల్ల భైరవ గీత సినిమా రిలీజ్ వాయిదా వేసినట్టుగా వెల్లడించారు. వారం ఆలస్యం డిసెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. Due to some censor related technical issues, @ThattSidd directed @BhairavaGeetha is now releasing on December 7 th Election Day ..Please vote for #BhairavaGeetha @dhananjayaka @Irra_Mor @AbhishekPicture — Ram Gopal Varma (@RGVzoomin) 27 November 2018 -
రేడియో జాకీ తప్పుకున్నారు
జ్యోతిక లేటెస్ట్ మూవీ ‘కాట్రిన్ మొళి’ ఈ నెల 18న రిలీజ్ కావాలి. ఆ రోజు జ్యోతిక బర్త్‌డే కూడా. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా చాలా ఎగై్జట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నాం అని చిత్రబృందం ప్రకటించింది. జ్యోతిక ముఖ్య పాత్రలో రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘కాట్రిన్ మొళి’. హిందీ చిత్రం ‘తుమ్హారీ సులూ’కి ఇది రీమేక్. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ‘‘మా సినిమాను ముందుగా అక్టోబర్ 18 రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ వారంలో కొత్త సినిమాల వర్షం కురవబోతోంది. దాంతో సరైన థియేటర్స్, షోలు దొరికే విషయంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే మా సినిమాను నవంబర్‌కు వాయిదా వేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
స్టార్ హీరో సినిమా వాయిదా.!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం. ఇటీవల వివేగం సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన అజిత్, తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వాసం రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దీపావళి సమయానికి షూటింగ్ పూర్తి కావటం కష్టమని భావించిన చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ సరసన తొలిసారిగా నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు డి ఇమాన్ సంగీతమందిస్తున్నారు. -
కల్యాణ్ రామ్ కొత్త సినిమా వాయిదా..?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు రవితేజ నేటటిక్కెట్టు రిలీజ్ అవుతుండటంతో పాటు సమ్మర్లో రిలీజ్ అయిన పలు చిత్రాలు ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుండటంతో నా నువ్వేను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. వారం ఆలస్యంగా జూన్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
చిత్రపరిశ్రమకు పెద్ద ఎఫెక్ట్
విడుదల వారుుదా తమిళసినిమా: చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖలు ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు రద్దు ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నా, దాని ఎఫెక్ట్ మాత్రం సినిమాలపై భారీగానే పడిందని చెప్పకతప్పదు. ఒక పక్క చిల్లర కొరత మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటే, మరో పక్క పెద్ద నోట్ల రద్దు చిత్రపరిశ్రమను స్థంభింపజేసిందనే చెప్పాలి. పలు చిత్రాల షూటింగ్‌లను రద్దు చేసుకోవలసిన పరిస్థితి. ఇక గత వారం తెరపైకి వచ్చిన చిత్రాలను చూసే వారు లేకపోవడంతో థియేటర్లు వెలవెల బోతున్నాయి . ఇదిలా ఉంటే ఈ వారం విడుదల కావలసిన చిత్రాలను నిర్మాతల వాయిదా వేసుకోవలసిన దుస్థితి నెలకొంది. సంగీతదర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం గత వారమే విడుదల కావలసి ఉండగా పెద్దనోట్ల ప్రభావంతో ఈ నెల 17కు వారుుదావేసుకున్నారు. ఇప్పుడది మరో రోజు వెనక్కు వెళ్లి 18న విడుదల కానున్నట్లు తెలిసింది. అదే విధంగా మరో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన సైతాన్ చిత్ర విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయి దా పడుతూ వచ్చింది. ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు అధికారికపూర్వకంగా చిత్ర వర్గాలు వెల్లడించారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఈ చిత్రం తప్పించుకోలేకపోతోందంటున్నారు.ఈ చిత్ర విడుదల వారుుదా పడనున్నట్లు తాజా సమాచారం. ఇక నటుడు జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం అక్టోబర్ 7వ తేదీనే విడదల అవుతుందని నిర్మాతల వర్గం ముందు ప్రకటించారు. ఆ తరువాత నవంబర్ తొలివారంలో విడుదలన్నారు. ఇప్పుడు ఈ చిత్రం విడుదల ఈ నెల 24కు వెళ్లిపోరుుంది. కాగా నటుడు విశాల్ తమన్నా హీరోహీరోరుున్లుగా నటించిన కత్తిసండై గత దీపావళికే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత, దర్శకులు ప్రారంభం రోజునే ప్రకటించారు. ఇదీ వారుుదా పడుతూ తాజాగా ఈ నెల 25న విడుదల కానుందంటున్నారు. ఇక ఇళుత్తిరు లాంటి కొన్ని చిత్రాల విడుదల డిసెంబర్‌కు వారుుదా పడ్డారుు. -
ఆ సినిమా విడుదల మళ్లీ వాయిదా
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన మదారి సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 15వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా కోసం వాయిదా పడింది. ఆ సినిమా నిర్మాతలు మదారీ డిస్ట్రిబ్యూటర్ అయిన వాసు భగ్నానీని సినిమా వాయిదా వేసుకోవాలని కోరారు. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని తదితరులతో పాటు ఊర్వశి రౌతేలా, శ్రద్ధాదాస్ తదితరులు నటించారు. గ్రాండ్ మస్తీ సినిమాకు ఇది సీక్వెల్. మదారీ సినిమా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘టిఇ3ఎన్’ సినిమాతో పాటు జూన్ 10నే ఇది విడుదల కావాల్సి ఉండగా, అప్పట్లో జూలై 15కు వాయిదా వేశారు. ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ మస్తీ కోసం వాయిదా వేశారు. పరిశ్రమ అంతా ఒక కుటుంబం లాంటిదని, వాళ్ల సినిమాను ముందే ప్రకటించారు కాబట్టి అది జూలై 15న, తమ సినిమా జూలై 22న విడుదల అవుతాయని భగ్నానీ చెప్పారు. తండ్రీ కొడుకుల అనుబంధం ఆధారంగా తీసిన మదారి సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. -
సూర్య సినిమా విడుదల వాయిదా
సూర్య ప్రధాన పాత్రలో తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా 'మేము'. తమిళ్లో గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్‌కు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, సంక్రాంతికి టాలీవుడ్లో భారీ పోటి ఉండటంతో వాయిదా వేసుకున్నారు. తరువాత కూడా పలుమార్లు సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నించినా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ శుక్రవారం(మార్చి 18) ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే మరోసారి మేము సినిమాను వాయిదా వేయక తప్పలేదు. వాయిదాకు కారణాలేంటి అన్న విషయం వెల్లడించకపోయినా, మేము చిత్రం శుక్రవారం రిలీజ్ కావటం లేదని ప్రకటించారు. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తామని తెలిపారు చిత్రయూనిట్. పసంగ సినిమాకు సీక్వల్గా పసంగ 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మేము పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్య సరసన అమలా పాల్ హీరోయిన్గా నటిస్తుండగా తెలుగమ్మాయి బిందు మాధవి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిన్న పిల్లలను ఆకట్టుకునే కథాంశంతో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకుడు. -
బాహుబలి విడుదల మళ్లీ వాయిదా!
ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా మొదటి భాగం విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా ట్విట్టర్, ఫేస్బుక్ పేజీల ద్వారా వెల్లడించారు. వాస్తవానికి సినిమాను మే 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించామని, కానీ సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కావట్లేదని అన్నారు. అందువల్ల బాహుబలి మొదటి భాగాన్ని జూలై నెలలో విడుదల చేస్తామన్నారు. 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో 600 మంది రోజుకు రెండు షిఫ్టులలో పనిచేస్తున్నా, ఇంకా సమయానికి పని పూర్తి కావట్లేదని చెప్పారు. మే 31వ తేదీన ట్రైలర్ మాత్రం పక్కాగా విడుదల చేస్తున్నామని, ఈలోపు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లన్నింటినీ మే 1 నుంచి మే 31 వరకు దశలవారీగా విడుదల చేస్తామని కూడా రాజమౌళి ప్రకటించారు. 17 Vfx studios with 600 artists are working on #Baahubali on double shifts but still cudnt make it on time.. pic.twitter.com/BD1Sgv0TWM — rajamouli ss (@ssrajamouli) April 28, 2015 We will also release posters of the principal characters of #Baahubali from may1st leading upto the trailer release on may31st. — rajamouli ss (@ssrajamouli) April 28, 2015 -
నిర్వేదానికి లోనయ్యా..
‘‘మనిషికి రెండు కళ్లు ఎంత ముఖ్యమో... తెలుగువారికి మన రెండు రాష్ట్రాలూ అంత ముఖ్యం. వీటిలో దేనికి ఇబ్బందులెదురైనా... అది తెలుగువారందరికీ బాధాకరమే. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ సహిత ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు తుఫాన్ బీభత్సానికి గురవ్వడం నా మనసును కలచివేసింది. ఈ ప్రళయం గురించి విని ఒక విధమైన నిర్వేదానికి లోనయ్యాను. తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో మా ‘కరెంట్ తీగ’ చిత్రాన్ని విడుదల చేయడం సబబు కాదు. అందుకే, ఈ నెల 17న విడుదల కావాల్సిన ఆ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం’’ అని మోహన్‌బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘తుఫాన్ బీభత్సానికి గురైన ప్రాంతాలకు నా బిడ్డలతో కలిసి వెళ్లాలనుకుంటున్నాను. మాతో పాటు కలిసి సహాయం అందించాలని ఎవరైనా ముందుకొస్తే ఇంకా ఆనందిస్తా. నేనెప్పడూ స్వయంగానే వెళ్లి సహాయం అందిస్తాను. రాజీవ్‌గాంధీ చెప్పిన ఓ మాటే దానికి కారణం. ‘ప్రభుత్వం సొమ్ము 80 శాతం కూడా ప్రజలకు చేరదు. దోచుకునేవాళ్లు దోచుకోగా 20 శాతమే వెళుతుంది’ అని. అందుకే... ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకుండా, నేనే స్వయంగా వెళ్లి సహాయం అందిస్తా. వంద మందిని నేను కాపాడలేకపోవచ్చు. కానీ నేనొక్కణ్ణి ఒక్క వ్యక్తినైనా కాపాడలేనా అనేది నా నమ్మకం’’ అన్నారు. ‘కరెంట్ తీగ’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘నేనిప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నాను. చెడు మాట్లాడకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. నిజమే చెప్పాలి. మనోజ్‌కి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందంటే అహంకారం అవుతుంది. అందుకే... బ్రేక్ అవుతుందని నమ్ముతాను అని చెబుతున్నా. ఇంతకు ముందు మనోజ్ సినిమాలు ఓ ఎత్తు. ఇదొక ఎత్తు’’ అని మోహన్‌బాబు నమ్మకంగా చెప్పారు. -
కోచ్చడయాన్ మళ్లీ వాయిదా?
కోచ్చడయాన్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నా తాజా చిత్రం కోచ్చడయాన్. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది, శోభన తదితర ప్రముఖ తారలు నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య అశ్విన్ దర్శకురాలు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, పంజాబి, గుజరాతి, జపనీస్, ఫ్రెంచ్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆరు వేల థియేటర్లలో ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల తొమ్మిదిన చిత్ర గీతాలు, ప్రచార చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు చిత్ర విడుదల వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడమే. ఏప్రిల్ 24న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ చిత్రం విడుదలకు చిక్కొచ్చిపడింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరగనుండడంతో కోచ్చడయాన్ చిత్రాన్ని విడుదల చేయడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికలనంతరం అంటే మే నెలకు చిత్ర విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటుడు విశాల్ నిర్మిస్తూ నటిస్తున్న నాన్ శివప్పు మనిదన్, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మాన్ కరాటే చిత్రాల విడుదల వాయిదా పడనున్నాయి. మొత్తం మీద భారీ చిత్రాలు ఏప్రిల్‌లో లేనట్లేనని సమాచారం.