పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది. మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం గతంలో అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేసి ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అందించారు మేకర్స్.
చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరౌత్ తెలియజేస్తూ సోమవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆదిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడం కోసం మరికొంత సమయం తీసుకోవాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నాం. భారతదేశం గర్వించే సినిమాగా దీన్ని మీ ముందుకు తీసుకురావాలని మేం నిర్ణయించుకున్నాం. మీ ప్రేమాభిమానాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి’’ అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల మరింత ఆలస్యం కానుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్‌లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..
जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib
— Om Raut (@omraut) November 7, 2022
Comments
Please login to add a commentAdd a comment