ఆ సినిమా విడుదల మళ్లీ వాయిదా | 'Madaari' release pushed back to July 22 | Sakshi
Sakshi News home page

ఆ సినిమా విడుదల మళ్లీ వాయిదా

Published Fri, Jul 8 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

ఆ సినిమా విడుదల మళ్లీ వాయిదా

ఆ సినిమా విడుదల మళ్లీ వాయిదా

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన మదారి సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 15వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా కోసం వాయిదా పడింది. ఆ సినిమా నిర్మాతలు మదారీ డిస్ట్రిబ్యూటర్ అయిన వాసు భగ్నానీని సినిమా వాయిదా వేసుకోవాలని కోరారు. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని తదితరులతో పాటు ఊర్వశి రౌతేలా, శ్రద్ధాదాస్ తదితరులు నటించారు. గ్రాండ్ మస్తీ సినిమాకు ఇది సీక్వెల్.

మదారీ సినిమా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘టిఇ3ఎన్’ సినిమాతో పాటు జూన్ 10నే ఇది విడుదల కావాల్సి ఉండగా, అప్పట్లో జూలై 15కు వాయిదా వేశారు. ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ మస్తీ కోసం వాయిదా వేశారు. పరిశ్రమ అంతా ఒక కుటుంబం లాంటిదని, వాళ్ల సినిమాను ముందే ప్రకటించారు కాబట్టి అది జూలై 15న, తమ సినిమా జూలై 22న విడుదల అవుతాయని భగ్నానీ చెప్పారు. తండ్రీ కొడుకుల అనుబంధం ఆధారంగా తీసిన మదారి సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement