great grand masti
-
ఆన్ లైన్ లో లీక్.. ఆ సిన్మా కొంపముంచింది!
అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'మస్తీ', 'గ్రాండ్ మస్తీ' సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. 'గ్రాండ్ మస్తీ' సినిమా అయితే ఏకంగా వందకోట్లు వసూలు చేసి.. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో వెల్లువెత్తడానికి గేట్లు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో'మస్తీ' సిరీస్ లో వస్తున్న 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమా కూడా బాగా కాసుల వర్షం కురిపిస్తుందని చిత్రయూనిట్ భావించింది. అయితే; 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఈ సినిమా ఆశలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆన్ లైన్ లో లీకవ్వడంతో అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమాను ప్రేక్షకుల మీదకు వదిలారు. అయినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. తొలి వీకెండ్ లో కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్, హీరోలు వివేక్ ఒబరాయ్, రితేశ్ దేశ్ ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తన కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నాడు. 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'ని చిత్తుచేస్తూ 'సుల్తాన్' రెండోవారంలోనూ భారీగా వసూళ్లు రాబడుతున్నాడు. రెండో వీకెండ్ మొదటి రోజైన శుక్రవారం ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 7.43 కోట్లు వసూలు చేసింది. దీంతో జూలై 6న విడుదలైన ఈ సినిమా మొత్తంగా దేశంలో రూ. 236.59 కోట్లు వసూలు చేసి.. కలెక్షన్ల పరంగా గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. -
'ఇది హత్య చేయడం కంటే ఎక్కువ'
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసి. గతంలో సినిమా రిలీజ్ తరువాత ఇండస్ట్రీ పెద్దలను ఇబ్బంది పెట్టే ఈ భూతం. టెక్నాలిజీ పెరగటంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు పైరసీ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. మాంజీ, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలను పైరసీ తీవ్రంగా దెబ్బతీసింది. ఈ శుక్రవారం విడుదలైన గ్రేట్ గ్రాండ్ మస్తీ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. మస్తీ సీరిస్‌లో విడుదలైన తొలి రెండు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో గ్రేట్ గ్రాండ్ మస్తీపై కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అడల్ట్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని భావించారు. కానీ సినిమా రిలీజ్‌కు 17 రోజుల ముందే నెట్లో వచ్చేయటంతో అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు కనీసం 15 కోట్ల వసూళ్లు సాధిస్తుందనుకున్న సినిమా 2 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ పైరసీ వల్ల తమకు జరిగిన నష్టాన్ని అభిమానులకు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా 'సినిమా 17 రోజుల ముందే లీక్ అయిపోయింది. అది చూసిన అందరూ సూపర్బ్‌గా చేశారని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది. -
పనిమనిషికి తన పేరు పెట్టడంపై హీరో ఆగ్రహం!
అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'కి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వచ్చేవారం విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే ఆన్ లైన్ లో లీకైంది. దీంతో సినిమా విడుదలను ఒకవారం ముందుకుజరిపి శుక్రవారం (రేపు) చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై బాలీవుడ్ నటుడు షైనీ ఆహుజా కేసు నమోదు చేశాడు. ఈ సినిమాలో పనిమనిషి పేరు షైనీ అని పెట్టారని కథనాలు వచ్చాయి. నటి సోనాలి రావత్ పోషించిన పాత్రకు షైనీ అని పేరు పెట్టినట్టు సమాచారం. హీరోలు రితేశ్ దేశ్ ముఖ్, వివేక్ ఒబరాయ్, ఆఫ్తాబ్ శివదాసని షైనీ అనే పనిమనిషి వెంటపడుతూ.. ఓ పాట కూడా పాడుతారని, ఈ నేపథ్యంలోనే షైనీ పాత్రతో సినిమాలో కొన్ని కామెడీ సీన్లు ఉంటాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే, తన పేరును అభ్యంతరకరంగా వాడి, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలపై షైనీ ఆహూజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో షైనీ పేరిట ఉన్న పాత్ర సన్నివేశాలన్నిటినీ తొలగించాలని, అంతేకాకుండా చిత్రయూనిట్ తనకు రాతపూర్వక క్షమాపణ చెప్పాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించిన షైనీ ఆహుజా తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేయడంతో ఆయనకు ముంబై కోర్టు 2011 మార్చిలో ఏడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. -
రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో సినిమా లీక్!
న్యూఢిల్లీ: రితేశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబరాయ్, ఆఫ్తాబ్ శివదాసని, ఊర్వశీ రౌతేలా, పూజా బోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆడల్ట్ కామెడీ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'... 'మస్తీ', 'గ్రేట్ మస్తీ' సిరీస్ భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్ లైన్ లో లీకైంది. ఈ లీకు ఆన్ లైన్ లో దుమారం రేపడంతో అప్రమత్తమైన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రయూనిట్ ఈ సినిమా విడుదలను ఒక వారం ముందుకు జరిపింది. నిజానికి ఈ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఈ శుక్రవారమే (ఎల్లుండి) విడుదల చేయబోతున్నారు. సినిమా ఆన్ లైన్ లో లీకు కావడంపై స్పందించడానికి 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' స్టార్లు రితేశ్, వివేక్, ఆఫ్తాబ్ నిరాకరించారు. ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వలేదు. ఢిల్లీలో బుధవారం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు ఈ విషయంపై తాము కామెంట్ చేయబోమని చెప్పారు. సినిమా లీక్ పై నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనుందని వివేక్ తెలిపారు. 'మస్తీ' సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో సినిమాలోనూ తాము కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని, గత 12 ఏళ్లుగా ఈ సినిమాల కోసం పనిచేయడం వల్ల తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ముగ్గురు స్టార్లు పేర్కొన్నారు. -
ఆ సినిమా విడుదల మళ్లీ వాయిదా
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన మదారి సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 15వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా కోసం వాయిదా పడింది. ఆ సినిమా నిర్మాతలు మదారీ డిస్ట్రిబ్యూటర్ అయిన వాసు భగ్నానీని సినిమా వాయిదా వేసుకోవాలని కోరారు. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని తదితరులతో పాటు ఊర్వశి రౌతేలా, శ్రద్ధాదాస్ తదితరులు నటించారు. గ్రాండ్ మస్తీ సినిమాకు ఇది సీక్వెల్. మదారీ సినిమా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘టిఇ3ఎన్’ సినిమాతో పాటు జూన్ 10నే ఇది విడుదల కావాల్సి ఉండగా, అప్పట్లో జూలై 15కు వాయిదా వేశారు. ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ మస్తీ కోసం వాయిదా వేశారు. పరిశ్రమ అంతా ఒక కుటుంబం లాంటిదని, వాళ్ల సినిమాను ముందే ప్రకటించారు కాబట్టి అది జూలై 15న, తమ సినిమా జూలై 22న విడుదల అవుతాయని భగ్నానీ చెప్పారు. తండ్రీ కొడుకుల అనుబంధం ఆధారంగా తీసిన మదారి సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు.