'ఇది హత్య చేయడం కంటే ఎక్కువ'
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసి. గతంలో సినిమా రిలీజ్ తరువాత ఇండస్ట్రీ పెద్దలను ఇబ్బంది పెట్టే ఈ భూతం. టెక్నాలిజీ పెరగటంతో సినిమా రిలీజ్కు ముందే నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు పైరసీ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. మాంజీ, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలను పైరసీ తీవ్రంగా దెబ్బతీసింది.
ఈ శుక్రవారం విడుదలైన గ్రేట్ గ్రాండ్ మస్తీ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. మస్తీ సీరిస్లో విడుదలైన తొలి రెండు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో గ్రేట్ గ్రాండ్ మస్తీపై కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అడల్ట్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని భావించారు. కానీ సినిమా రిలీజ్కు 17 రోజుల ముందే నెట్లో వచ్చేయటంతో అంచనాలు తలకిందులయ్యాయి.
తొలి రోజు కనీసం 15 కోట్ల వసూళ్లు సాధిస్తుందనుకున్న సినిమా 2 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ పైరసీ వల్ల తమకు జరిగిన నష్టాన్ని అభిమానులకు తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా 'సినిమా 17 రోజుల ముందే లీక్ అయిపోయింది. అది చూసిన అందరూ సూపర్బ్గా చేశారని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది.