చిత్రపరిశ్రమకు పెద్ద ఎఫెక్ట్
విడుదల వారుుదా
తమిళసినిమా: చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖలు ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు రద్దు ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నా, దాని ఎఫెక్ట్ మాత్రం సినిమాలపై భారీగానే పడిందని చెప్పకతప్పదు. ఒక పక్క చిల్లర కొరత మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటే, మరో పక్క పెద్ద నోట్ల రద్దు చిత్రపరిశ్రమను స్థంభింపజేసిందనే చెప్పాలి. పలు చిత్రాల షూటింగ్‌లను రద్దు చేసుకోవలసిన పరిస్థితి. ఇక గత వారం తెరపైకి వచ్చిన చిత్రాలను చూసే వారు లేకపోవడంతో థియేటర్లు వెలవెల బోతున్నాయి .
ఇదిలా ఉంటే ఈ వారం విడుదల కావలసిన చిత్రాలను నిర్మాతల వాయిదా వేసుకోవలసిన దుస్థితి నెలకొంది. సంగీతదర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం గత వారమే విడుదల కావలసి ఉండగా పెద్దనోట్ల ప్రభావంతో ఈ నెల 17కు వారుుదావేసుకున్నారు. ఇప్పుడది మరో రోజు వెనక్కు వెళ్లి 18న విడుదల కానున్నట్లు తెలిసింది. అదే విధంగా మరో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన సైతాన్ చిత్ర విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయి దా పడుతూ వచ్చింది. ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు అధికారికపూర్వకంగా చిత్ర వర్గాలు వెల్లడించారు.
అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఈ చిత్రం తప్పించుకోలేకపోతోందంటున్నారు.ఈ చిత్ర విడుదల వారుుదా పడనున్నట్లు తాజా సమాచారం. ఇక నటుడు జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం అక్టోబర్ 7వ తేదీనే విడదల అవుతుందని నిర్మాతల వర్గం ముందు ప్రకటించారు. ఆ తరువాత నవంబర్ తొలివారంలో విడుదలన్నారు. ఇప్పుడు ఈ చిత్రం విడుదల ఈ నెల 24కు వెళ్లిపోరుుంది. కాగా నటుడు విశాల్ తమన్నా హీరోహీరోరుున్లుగా నటించిన కత్తిసండై గత దీపావళికే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత, దర్శకులు ప్రారంభం రోజునే ప్రకటించారు. ఇదీ వారుుదా పడుతూ తాజాగా ఈ నెల 25న విడుదల కానుందంటున్నారు. ఇక ఇళుత్తిరు లాంటి కొన్ని చిత్రాల విడుదల డిసెంబర్‌కు వారుుదా పడ్డారుు.