బాహుబలి విడుదల మళ్లీ వాయిదా! | baahubali release date postponed again, says ss rajamouli | Sakshi
Sakshi News home page

బాహుబలి విడుదల మళ్లీ వాయిదా!

Published Tue, Apr 28 2015 5:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

బాహుబలి విడుదల మళ్లీ వాయిదా!

బాహుబలి విడుదల మళ్లీ వాయిదా!

ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా మొదటి భాగం విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా ట్విట్టర్, ఫేస్బుక్ పేజీల ద్వారా వెల్లడించారు. వాస్తవానికి సినిమాను మే 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించామని, కానీ సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కావట్లేదని అన్నారు.

అందువల్ల బాహుబలి మొదటి భాగాన్ని జూలై నెలలో విడుదల చేస్తామన్నారు. 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో 600 మంది రోజుకు రెండు షిఫ్టులలో పనిచేస్తున్నా, ఇంకా సమయానికి పని పూర్తి కావట్లేదని చెప్పారు. మే 31వ తేదీన ట్రైలర్ మాత్రం పక్కాగా విడుదల చేస్తున్నామని, ఈలోపు ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లన్నింటినీ మే 1 నుంచి మే 31 వరకు దశలవారీగా విడుదల చేస్తామని కూడా రాజమౌళి ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement