![Nanis Movie Tuck Jagadish Release Postponed - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/04/12/Tuck-Jagadish.jpg.webp?itok=Xz_NyOWk)
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌స్టోరీ వాయిదా పడగా, చిరంజీవి సినిమా ఆచార్య కూడా వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. మహమ్మారి వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని ప్రకటించాడు. ఈ సినిమా వాయిదాతో మళ్లీ సినిమాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్‌డౌన్ వలన ఏడు ఎనిమిది నెలలు థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. థియేటర్లు బంద్ కాలేదు కానీ సినిమావాళ్లే ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేసుకుంటున్నారు.
తన సినిమా వాయిదాపై నాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో ప్రకటన చేశాడు. అనంతరం ట్విటర్‌లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నెలకొన్న కారణాల వల్ల టక్ జగదీశ్ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ‘విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాణంలో ‘టక్ జగదీశ్’ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఏప్రిల్ 23వ తేదీన విడుదల కావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment