
పాన్ ఇండియా సినిమాలపై యంగ్ హీరో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా సినిమా అనేది కథలో ఉండాలి కానీ.. ఇమేజ్ ఉంది కదా అని పాన్ ఇండియా మూవీ చేయకూడదన్నారు. తాను ఎప్పటికీ ఇక్కడే (తెలుగు) నుంచే ఇండియన్ సినిమా చేస్తానని చెప్పారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకానుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘హిట్’ సిరీస్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’లోనూ నేను ఉన్నాను. ‘హిట్ 2’ని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయాలని ఉత్తరాది ప్రేక్షకులు అడుగుతున్నారు.. నానీగారితో మాట్లాడి పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అన్నపూర్ణ బ్యానర్‌లో నేను చేయబోతున్న రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి. ‘హిట్ 2’ హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా రిలీజవుతుంది’’ అన్నారు. ‘‘చెడు మీద మంచి ఎలా గెలుస్తుందనేది ఈ సినిమాలో చూపించాం. ‘హిట్ 3’ని భారీగా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. నటీనటులు మీనాక్షి చౌదరి, పావని, శ్రీనాథ్ మాగంటి తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment