Adivi Sesh Shares Video Of Audience Gets Emotional While Watching Major Movie, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Major Movie Premiere Show: మూవీ చూస్తూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చిన ఆడియన్స్‌

Published Sat, May 28 2022 6:31 PM | Last Updated on Sat, May 28 2022 7:22 PM

Adivi Sesh Shares Video Of Audience Gets Emotional While Watching Major Movie In Jaipur - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ తాజాగా నటించిన చిత్రం మేజర్‌. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే  ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్‌ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్‌ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్‌లో మేజర్‌ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు.

చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్‌?

ఈ క్రమంలో శనివారం జైపూర్‌లో మేజర్‌ మూవీ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. అలాగే సినిమాలో మేజర్‌ సందీప్‌ను చూసి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కోడుతూ ఆయనకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో అడివి శేష్‌ తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ‘జైపూర్‌.. థియేటర్లో సినిమా చూస్తూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అమర్‌ రహై! నా కెరీర్‌లో ఇదో గొప్ప క్షణం’ అంటూ అడివి శేష్‌ రాసుకొచ్చాడు. కాగా జైపూర్‌లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు చూసేందుకు 100 మందికి పైగా జవాన్లు థియేటర్‌కు వచ్చారు.

చదవండి: అలా అడిగేసరికి మహేశ్‌ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ

ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్‌ మూవీ టీం జవాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్. అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్‌ జోడిగా సయూ మంజ్రేకర్‌ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement